Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ, అర్చనలు బయటకు వస్తారు. అర్చన అక్కడున్న కొత్త కారుని చూసి తుక్కలేస్తుంది. కారే ఇలా ఉంటే దీనిలో వచ్చిన వాళ్లు ఇంకా ఎలా ఉంటారో అని అంటుంది. ఇంతలో మిధున షాపింగ్ నుంచి వస్తుంటే నీకు నచ్చిన మిధున వస్తుందని అర్చన అంటుంది. దాంతో మహాలక్ష్మీ నాది తనది సేమ్ టేస్ట్‌ అని అంటుంది. 


మహాలక్ష్మీ వెళ్లి మిధునని హగ్ ఇస్తే మిధున తోసేసి అసహ్యించుకుంటుంది. నువ్వు నాలాగే మన ఇద్దరి టేస్ట్‌లు సేమ్ టూ సేట్ నీకు నాలా అహంకారమే అలంకారం అని మహాలక్ష్మీ అంటే దానికి మిధున అవునా ఒక్క నిమిషం అని కారులోకి వెళ్లి డ్రస్ మార్చుకొని వస్తుంది. మహాలక్ష్మీ, అర్చనలు షాక్ అయిపోతారు. డ్రస్ మార్చేవేంటి అని అంటే దానికి మిధున నువ్వు నేను సేమ్ టూ సేమా నా స్టైల్ సపరేట్ నాతో ఎవరు పోల్చుకున్నా నాకు కంపరంగా ఉంటుందని చెప్తుంది. మహాలక్ష్మీకి మండినా సరే సైలెంట్‌గా ఉంటుంది. ఇక డ్రైవర్‌కి కాల్ చేసి పెట్రోల్ తీసుకురమ్మని చెప్పి కోట్ల ఖరీదైన కారు కాల్చేస్తుంది. మహాలక్ష్మీ, అర్చనలు షాక్ అయిపోతారు.  మీరు కట్టుకున్న లాంటి చీరతో చాలా టైం ఉన్నానని అందుకే ఆ చీరతో పాటు కారు తగలపెట్టేశాను అని ఇంకోసారి నన్ను టచ్ చేస్తే మనిషినే తగలపెట్టేస్తాను అని మరోకారు తెప్పించుకొని అందులో వెళ్లిపోతుంది. 


డ్రైవర్‌ మహాలక్ష్మీ వాళ్లతో మా మేడంకి కోపం వస్తే ఇంతే ఇది ఎన్నో కారు కూడా తెలీదని అంటాడు. మహాలక్ష్మీ అర్చనతో తను ఎందుకో సీత అని అనుమానంగా ఉందని ఒకసారి రేవతి వాళ్ల స్ట్రీట్‌కి వెళ్లి చెక్ చేద్దాం అని ఇద్దరూ పాత చీరలు కట్టుకొని  తోపుడు బండి మీద కూరగాయలు పెట్టుకొని వెళ్తారు. ఇద్దరూ కూరగాయలు తీసుకొని రేవతి ఇంటి ముందుకు వెళ్తారు. అక్కడ సీతని చూసి ఇద్దరూ వేరు వేరు అని అనుకుంటారు. సీత, రేవతిలు చూసి వదిన వాళ్లు కూరగాయలు అమ్మడం ఏంటి అని అనుకుంటారు. సీత కావాలనే కూరగాయలు కొనాలని రమ్మని పిలుస్తుంది. ఇద్దరూ వేరే వైపు ముఖం తిప్పుకొని మాట్లాడితే సీత కావాలనే వాళ్లని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. ఇంతలో రేవతి దగ్గరకు ఓకావిడ వచ్చి సీతని చూసి ఎవరు అని అడుగుతుంది. అత్తాకోడళ్లకు గొడవ వచ్చి వచ్చిందని చెప్తుంది. సీత అత్తల్ని తోడేలు గుంట నక్క అని తిడుతుంది. మా పెద్ద అత్తని టమాటా నలిపినట్లు నలిపేస్తా అని చిన్నత్తని ములక్కాడలా విరిచేస్తా అని తిడుతుంది. మహాలక్ష్మీ వాళ్లు వెళ్లిపోయిన తర్వాత సీత, రేవతిలు నవ్వుకుంటారు. 


మహాలక్ష్మీ వాళ్లు వెళ్తుంటే అక్కడ ఒరిజినల్‌గా కూరగాయలు అమ్మే ఇద్దరూ మహాలక్ష్మీ, అర్చనల్ని చితక్కొడతారు. ఇంతలో త్రిలోక్ వస్తే ఇద్దరూ ముఖాలు కప్పుకుంటారు. త్రిలోక్ ఇద్దరికీ ముసుగు తీయమని అరిచి మహాలక్ష్మీ, అర్చనలను చూసి షాక్ అయిపోతాడు. కోట్ల ఆస్తి ఉంచుకొని ఈ సీక్రెట్ బిజినెస్ ఏంటని తిడతాడు. మహాలక్ష్మీ త్రిలోక్‌తో మిధున, సీతల గురించి చెప్తుంది. సీతలా ఇంకో అమ్మాయా అది మోడ్రన్ అమ్మాయా అని నోరెళ్ల బెడతాడు. ఏదో జరుగుతుందని త్రిలోక్ అనుభవిస్తాడు. మరోవైపు ఆఫీస్‌లో ముఖర్జీ ఎమర్జన్సీ మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. కొత్తగా వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ వచ్చిందని రేపే సంతకాలు చేయాలని అంటాడు. ఇక సీత గురించి అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్ ఇంట్లో ఆస్తి పంపకాల రచ్చ.. కార్తీక్ నిర్ణయానికి కుస్తీలు పడుతున్న తండ్రి!