Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్‌కి శ్రీధర్ ఎంత చెప్పినా ఆస్తి అడగటానికి ఇష్టపడడు. మీ ఆయనతో ఒక్క సంతకం పెట్టించమ్మా అని దీపకి చెప్తాడు. రెండు తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి అని సంతకం పెట్టించమని చెప్తాడు. కార్తీక్ పేపర్లు చింపేస్తాడు. శ్రీధర్ కోపంతో దీప కోసం ఆవేశంలో ఇళ్లు వదిలేశావు.. ఇప్పుడు ఆస్తి వదిలేస్తున్నావ్ అంటాడు. దానికి కార్తీక్ నాది నా భార్యది ఒకటే మాట.. నాకు వాళ్లు మీద ప్రేమ ఉంది అది చాలు అని అంటాడు. నా కొడుకు జీవితం నాశనం చేయడానికే నువ్వు వచ్చావని దీపతో శ్రీధర్ అంటాడు.
మామ పరువు రోడ్డుకి ఈడ్చే వరకు వదలను అని శ్రీధర్ అనుకుంటాడు. కాశి, తండ్రి, భార్యతో కలిసి భోజనం చేస్తుంటాడు. ఆస్తి పంపకాల వల్ల కాంచనకు అన్యాయం జరిగింది అని అంటాడు. దానికి స్వప్న తన అన్నకు అన్యాయం జరిగింది అని ఆస్తి మొత్తం జ్యోత్స్నది అయింది అని అంటుంది. జ్యోత్స్న పేరు వినగానే దాసుకి గతం గుర్తొస్తుంది. షాక్ అయి ఉంటాడు. దాంతో దాసు వారసురాలు కాదు.. ఇప్పుడే వెళ్లి నేను అన్యాయం ఆపుతానని అంటాడు. ఎవరికి అన్యాయం అని కాశీ అడిగితే కార్తీక్ అని చెప్పి దాసు సౌండ్ రావడంతో ఆగిపోతాడు. మొత్తం మర్చిపోయి భోజనానికి కూర్చొంటాడు. కాశీ, స్వప్నలు ఇదేంటి అనుకుంటారు. తన అన్నయ్యకి ఈ రోజు అన్యాయం జరిగినా ఏదో ఒకరోజు గెలిచి తనేంటో చూపిస్తాడని అనుకుంటారు.
జ్యోత్స్న: నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది. బావని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే దీప వారసురాలని తెలిసింది. దీప అడ్డు తొలగించుకోవాలి అనుకుంటే మధ్యలో దాసు వచ్చాడు. దాసుతో ఇప్పుడు ప్రాబ్లమ్ లేదు అనుకుంటే ఆస్తి మొత్తం తాత మమ్మీ డాడీ పేరున రాసేశాడు. వాళ్ల వారసురాలు దీప అని తెలిస్తే నాకు ఈ స్థానం కూడా దక్కదు. నా పేరున ఆస్తి రాయమని చెప్పలేను. పైగా డాడీకి అనుమానం ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి.
సుమిత్ర: జ్యోత్స్న ఈ రోజు నువ్వు ఆఫీస్‌కి వెళ్లవా. చిన్నప్పుడు పిల్లలు స్కూల్‌కి వెళ్లను అని మారాం చేస్తే వాళ్ల భవిష్యత్ బాగుండాలి అని స్కూల్‌కి పంపిస్తాం.
దశరథ్: ఒక వయసు వచ్చిన తర్వాత ఆడపిల్ల వద్దు అన్నా పెళ్లి చేస్తాం ఎందుకు.
శివన్నారాయణ: అది కూడా వాళ్ల భవిష్యత్ కోసమే.
జ్యోత్స్న: మీరంతా నాకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు.
సుమిత్ర: మేమో పెళ్లి సంబంధం చూశాం. అబ్బాయి ఎవరో కాదు నీ ఫ్రెండ్ గౌతమ్.
పారు: నువ్వు ఓకే అంటే తొందర్లోనే ముహూర్తం పెట్టిస్తాం.
జ్యోత్స్న: వద్దు.. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అందరూ జ్యోత్స్నని ఒప్పించే ప్రయత్నం చేస్తారు.
సుమిత్ర: జ్యోత్స్న పెళ్లి చేసుకో పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం నీ పేరున రాస్తాం. నువ్వు నీ భర్త మన బిజినెస్ చూసుకోవచ్చు.
జ్యో: మనసులో పెళ్లి చేసుకుంటే ఆస్తి రాస్తారా.
శివన్నారాయణ: నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి అమ్మ ఇళ్లరికం రావడానికి కూడా ఆ అబ్బాయి రెడీ.
సుమిత్ర: నువ్వు నా మాట వింటాను అని మీ నాన్నతో నమ్మకంగా చెప్పాను నా నమ్మకం కాపాడు.
జ్యోత్స్న: సరే మమ్మీ. మీరు చెప్పినట్లే పెళ్లి చేసుకుంటా కాకపోతే నేను ఒకసారి తనతో మాట్లాడాలి. కొన్ని పర్సనల్‌గా మాట్లాడాలి. వెళ్లి మాట్లాడి వచ్చిన తర్వాత నా నిర్ణయం చెప్తాను.
దశరథ్: మనసులో జ్యోత్స్న ఒక్కోసారి ఒక్కో రకంగా కనిపిస్తుంది. జ్యోత్స్న పెళ్లి లోపు దాసు కోలుకుంటే అసలు విషయం తెలుస్తుంది.
మరోవైపు గౌతమ్ తన ఇంట్లో పని చేసే రమ్మ అనే అమ్మాయిని ప్రేమ అని నమ్మించి గర్భవతిని చేస్తాడు. ఆమెను తీసుకొని వచ్చిన తల్లిదండ్రులు గౌతమ్ దగ్గర విషయం చెప్పి ఏడిస్తే గౌతమ్ పొగరుగా మాట్లాడుతాడు. దీప గౌతమ్ ఇంటికి వచ్చి అదంతా చూస్తుంది. ఫుడ్ డెలవరీ ఇవ్వడానికి వచ్చి సమస్య తెలుసుకుంటుంది. గౌతమ్ డబ్బు ఇచ్చి కడుపు తీయించుకో అని అంటే దీప వెళ్లి గౌతమ్‌తో గొడవ పడుతుంది. పోలీస్ కంప్లైంట్ ఇద్దామని రమ్య తల్లిదండ్రులతో చెప్తే వాళ్లు వద్దని దీపని వెళ్లిపోమంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్ ఇంట్లో ఆస్తి పంపకాల రచ్చ.. కార్తీక్ నిర్ణయానికి కుస్తీలు పడుతున్న తండ్రి!