Samantha: ఇండియాలో హయ్యస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరు... సమంత ఫస్ట్ శాలరీ ఎంతో తెలుసా?

Samantha : ఇప్పుడు ఇండియాలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది సమంత. మరి ఆమె 10వ తరగతిలోనే ఫస్ట్ జాబ్ చేసిందని, ఆ టైమ్ లో సామ్ ఫస్ట్ శాలరీగా ఎంత అందుకుందో తెలుసా ?

Continues below advertisement

సౌత్ క్వీన్ సమంత ఇప్పుడు ఇండియాలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారింది. కానీ ఒకప్పుడు ఆమె పదవ తరగతిలోనే ఫస్ట్ జాబ్ చేసిందట. మరి ఆ ఫస్ట్ జాబ్ కి సమంత శాలరీగా ఎంత సంపాదించిందో తెలుసా? గతంలో ఓ ఇంటర్వ్యూలో సమంత ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. 

Continues below advertisement

సమంత ఫస్ట్ జాబ్, ఫస్ట్ శాలరీ 
స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఈ అమ్మడు కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన ఫస్ట్ జాబ్, ఫస్ట్ శాలరీ గురించి వెల్లడించింది. అప్పట్లో ఈ అమ్మడు హోటల్లో హోస్టెస్ గా 8 గంటల పాటు పని చేసిందట. ఆ పనికి ఫస్ట్ శాలరీగా రూ. 500 సంపాదించినట్టు సమంత స్పష్టం చేసింది. ఈ పని చేసినప్పుడు తను పదవ తరగతి లేదా 11వ తరగతి చదువుతున్నానని చెప్పుకొచ్చింది. ఈ విషయం గురించి సామ్ మాట్లాడుతూ "ఓ హోటల్లో కాన్ఫరెన్స్ కోసం హోస్టెస్ గా 8 గంటలు పని చేసి, నా మొదటి సంపాదనగా రూ. 500 రూపాయలు సంపాదించాను" అని సమంత చెప్పింది. 

ఇక ఇప్పుడు సమంత అత్యధిక పారితోషకం అందుకునే భారతీయ నటీమణులలో ఒకరన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సమాచారం ప్రకారం సమంత 'సిటాడెల్ : హనీ బన్నీ' అనే హిందీ సిరీస్ లో నటించడానికి ఏకంగా 10 కోట్ల భారీ రెమ్యూనరేషన్ తీసుకుంది. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. 

జెండర్ తేడా లేకుండా సమాన రెమ్యూనరేషన్ 
ఇక ప్రస్తుతం సమంత సినిమా ఇండస్ట్రీలో జెండర్ తేడా లేకుండా సమాన రెమ్యూనరేషన్ గురించి పోరాడుతోంది. చాలామంది హీరోయిన్లు హీరోలతో పోలిస్తే నిర్మాతలు తమకి చాలా తక్కువ పారితోషికం ఇస్తారని ఎన్నోసార్లు ఆవేదనను వ్యక్తం చేశారు. కానీ సమంత మాత్రం ఒక అడుగు ముందుకేసి తాను నిర్మిస్తున్న 'బంగారం' అనే సినిమాలో నటీనటులకు జెండర్ తేడా లేకుండా సమాన పారితోషకం ఇస్తానని చెప్పి, కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేయడానికి సిద్ధమవుతోంది. మరి ఆమె బాటలో ఇంకా ఎంతమంది నిర్మాతలు నడుస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

Also Read: క్లీన్ కామెడీ, నో అసభ్యత, డబుల్ ఫన్... 'రాబిన్‌హుడ్‌'కు నితిన్ ఫస్ట్ రివ్యూ

ఇదిలా ఉండగా, 'ఏ మాయ చేశావే' మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సమంత, ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్టును తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పుడప్పుడు కెరీర్ కు చిన్న బ్రేకులు పడ్డా, మళ్ళీ డబుల్ జోష్ తో వరుస ఆఫర్లు పట్టేస్తోంది ఈ అమ్మడు. సమంత ప్రస్తుతం ఆదిత్య రాయ్ కపూర్ తో కలిసి 'రక్త్ బ్రహ్మాండ్' అనే వెబ్ సిరీస్ షూటింగ్లో బిజీగా ఉంది. మరోవైపు ఆమె నిర్మిస్తున్న 'బంగారం' అనే సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది. అలాగే రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న 'ఆర్సీ 17' మూవీలో ఫిమేల్ లీడ్ గా సమంత పేరును పరిశీలిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.

Continues below advertisement