Illu Illalu Pillalu Serial Today Episode నర్మద, సాగర్ సరదాగా బయటకు వెళ్తారు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఐస్‌క్రీమ్ తింటారు. ప్రేమ పెళ్లి చేసుకోవడానికి నీ కంటే నేను ఎక్కువ రిస్క్ చేశానని అంటే నేను చేశానని అనుకుంటారు. సాగర్ ఓవర్ చేస్తూ నువ్వు కేవలం మీ ఇంటి నుంచి బయటకు వచ్చావ్ అంతే నేను అయితే మా నాన్న చంపేస్తాడు అని తెలిసి కూడా నిన్ను మా ఇంటికి తీసుకెళ్లా అంటాడు.

Continues below advertisement


నర్మద కోపంగా ఏంట్రా నేను జస్ట్ వచ్చేశానా.. మా నాన్న ఇప్పటికీ ఆ బాధ నుంచి కోలుకోలేదు తెలుసా అని అంటుంది. నర్మదకు ఎక్కిళ్లు వస్తే సాగర్ నీరు ఇస్తాడు. నర్మదతో ఇలా ఆగకుండా ఎక్కిళ్లు వస్తే మనల్ని బాగా ఇష్టపడే వాళ్లు తలచుకుంటున్నారని అర్థం అని తానే తలుచుకున్నట్లు చెప్తాడు. దానికి నర్మద నన్ను మా నాన్నలా ఎవరూ ప్రేమించలేరు. ప్రస్తుతం మా నాన్న నన్ను తలుచుకోరులే అని బాధ పడుతుంది. ఇంతలో నర్మద తండ్రి ఫోన్ నుంచి తల్లి ఫోన్ చేసి ఏడుస్తుంది. మీ నాన్నకి హార్ట్‌ అటాక్ వచ్చిందని చెప్తుంది. నర్మద షాక్ అయిపోతుంది. హాస్పిటల్ వివరాలు తెలుసుకొని సాగర్‌తో కలిసి అక్కడికి వెళ్తుంది. 


నర్మద తండ్రిని చూసి ఏడుస్తుంది. మీరు ఏంటి నాన్న ఇలా అని అంటుంది. బంగారం లాంటి కూతుర్ని కన్నాను అని మురిసిపోయాను కానీ నా చావుని నేనే కన్నాను అని అర్థమైంది. నువ్వు తప్పు మాకు ఎవరు ఉన్నారమ్మా.. అన్నీ ఆశలు పెట్టుకుంది నీ మీదే కదా. అసలు మేం బతుకుతున్నదే నీ కోసమే కదా.. నా కూతురితో మాట్లాడకుండా చూడకుండా ఉండగలమా.. మరి అంత అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు గుండెల మీద తన్నేసి మమల్ని వదిలేసి వెళ్లిపోతే ఎలా బతగలం ఆ బాధతో ఈ గుండె ఆగిపోదా.. నా కూతురుని వదిలేసి నేను ఉండలేకపోతున్నా అమ్మా.. నా గుండె తట్టుకోలేకపోతున్నా.. అలా అని నీ భర్త గురించి అందరూ అనే సూటి పోటి మాటలు తట్టుకోలేకపోతున్నా అతన్ని అల్లుడిగా ఒప్పుకోలేకపోతున్నా.. సరి దిద్దుకోలేని తప్పు చేశావమ్మా అని నర్మద తండ్రి అంటారు. 


సాగర్ బయట నుంచి మొత్తం విని నర్మద తండ్రితో నన్ను చూస్తేనే మీరు కోపంతో రగిలిపోతారని నాకు తెలుసు.. నేను మాట్లాడితే మీకు అసహ్యం అని నేను రావడం కూడా మీకు ఇష్టం లేదని నాకు తెలుసు కానీ ఇది నేను మాట్లాడాల్సిన సమయం దయచేసి నన్ను మాట్లాడనివ్వండి సార్ అని దండం పెట్టి అడుగుతాడు. సార్ మేం ఇద్దరం విడిపోయి బతకలేనంతగా ప్రేమించుకున్నాం. అందుకే ఎవరికీ తెలీకుండా ప్రేమించుకున్నాం.. మీరు మీ కూతురి కోసం ఎంత బాధ పడుతున్నారో తను కూడా మీ కోసం అంతే బాధ పడుతుంది. మీరు ఇందాక తనని సరిదిద్దుకోలేని తప్పు చేసింది అన్నారు. సరిదిద్దుకోవాలి అంటే ఏం చేయాలో చెప్పండి సార్. మీరు మీ కూతురుని దగ్గరకు తీసుకోవడానికి నేను మీకు అల్లుడిగా ఉండటానికి ఏం చేయాలో చెప్పండి సార్ అని అడుగుతాడు. దానికి నర్మద తండ్రి ప్రేమించడంతో నువ్వు నా కూతురికి తగిన వాడివే కానీ నా అల్లుడు గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడు కావాలి. మా ఆఫీస్‌లో కూడా అందరూ మీ అల్లుడు మూటలు మోస్తున్నాడు అని అంటున్నారు అని అంటారు. 


సాగర్ ఆయనతో సార్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే మీరు నన్ను అల్లుడిగా అంగీకరిస్తారా అని అడుగుతాడు. పెద్దాయన సరే అంటారు. సాగర్ అతి త్వరలోనే గవర్నమెంట్ ఉద్యోగం సాధిస్తానని అంటాడు. నర్మద వద్దని మీ ఇంట్లో ప్రాబ్లమ్ అవుతుందని అంటే నా నర్మద కోసం నేను గవర్నమెంట్ ఉద్యోగం సాధిస్తానని మాటిస్తాడు. 


వల్లి తెగ మెడిటేషన్ చేసేసి మనసు ప్రశాంతంగా ఉండి చావడం లేదు ప్రతీక్షణం వాళ్లిద్దరే గుర్తొస్తున్నారని ప్రేమ, నర్మదల్ని తిట్టుకుంటుంది. వాళ్ల తప్పులు ఏదో ఒకటి దొరకాలని అనుకుంటుంది. ఆలోచించి ఆలోచించి ఆ రోజు అర్ధరాత్రి సాగర్‌ని నర్మద తెగ చదివించేసింది ఆ మేటర్ తెలుసుకొని నర్మదతో ఓ ఆట ఆడుకోవాలి అనుకుంటుంది. ఇక ప్రేమ గురించి ఆలోచించి  లెటర్ గురించి తెలుసుకోవాలి అనుకుంటుంది.  మరోవైపు కల్యాణ్ ప్రేమ గురించి ఆలోచిస్తూ ప్లే బాయ్‌లా బతికిన నన్ను నాలుగు గోడల మధ్య బతికేలా చేశావ్ నీ జీవితం అన్యాయం కాకుండా ఎలా వదిలేస్తానే అనుకున్నావే అనుకుంటాడు. ప్రేమ చాలా టెన్షన్ పడుతుంటుంది. నీ కాపురం కూలిపోవడానికి ఆ ఒక్క ఫోటో చాలు నువ్వు నాతో తప్పు చేశావ్ అంటే ఎవరైనా నమ్మేస్తారు. నీ బతుకు నా గుప్పెట్లో ఉంది ప్రస్తుతం నా ఓడిలో వాలిపోవడం తప్పు నీకు మరో దారి లేదు అని  కల్యాణ్ అనుకుంటాడు. మరోవైపు వల్లి ప్రేమ లెటర్ బాగోతం తేల్చడానికి ప్రేమ దగ్గరకు వెళ్తుంది. ప్రేమతో అత్తయ్య పిలుస్తుందని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.