Illu Illalu Pillalu Serial Actross Lavanya: ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్‌లో జనాలు నుంచి మంచి ఆదరణ పొందుతున్న వాటిలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి. ఆమని, బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కలిసి నటిస్తున్న సీరియల్ మహిళలకు బాగా కనెక్ట్ అయ్యింది. మధ్యతరగతిలో జరిగే రోజు వారి సంఘర్షణలనే స్టోరీగా తీసుకొని రూపొందించిన సీరియల్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇందులో చూపించే సన్నివేశాలు మన ఇంట్లో జరిగిందనో పక్కింట్లో జరిగిన విషయాన్నే చూపిస్తున్నారు అనేలా ఇందులో సీన్స్ ఉంటున్నాయ. అందుకే ఈ సీరియల్‌కు రోజు రోజుకు చూసే ఫ్యాన్స్ ఎక్కువ అవుతున్నారు.
ఇందులో ప్రేమగా కన్నడ బ్యూటీ లావణ్య నటించింది. ఉన్నత చదువులు చదవాలనే కోరిక ఉన్నప్పటికీ అనుకోని పరిస్థితుల్లో మేనత్త కొడుకునే పెళ్లి చేసుకుంటుంది. డ్యాన్స్‌పై కూడా ఆమెకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు రెండు మూడు ఎపిసోడ్స్‌లో చూపించారు. సీరియల్ ఆసక్తిగా సాగడానికి ఓ పిల్లర్‌గా మారిన ప్రేమ బుల్లితెరపైనే కాదు. రియల్‌గా కూడా డ్యాన్స్ కుమ్మేస్తోంది. తన సహ నటులతో వేసిన స్టెప్పులు, చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఆ సంగతులేంటో మీరూ చూసేయండి.
తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ పాట ఏదైనా స్టేజ్ దద్దరిల్లిపోవాల్సిందే అన్నట్టు డ్యాన్స్ కుమ్మేస్తుంది లావణ్య.
సీరియల్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా తాను ఉన్న చోట మొత్తం ఉత్సాహంతో ఊగిపోయేలా చేస్తుంది లావణ్య. తన తోటి వారితో కూడా డ్యాన్స్‌లు చేయిస్తుంది.