Illu Illalu Pillalu Serial Today Episode శ్రీవల్లి ఇంట్లో ఎవరికీ తెలీకుండా తన తండ్రి దొంగతనం కోసం సాయం చేస్తుంది. అందుకు తన తాళాల గుత్తిని ఓ చోట పెట్టి మెయిన్ డోర్ గడియ తీసి ఉంచుతుంది.  తర్వాత తన గదిలోకి వెళ్లిపోతుంది. ఇక తిరుపతి దగ్గు రావడంతో మధ్యలో లేస్తాడు. అప్పడే ఆనంద్‌ రావు రామరాజు ఇంటికి వస్తాడు.

తిరుపతి మెయిన్ డోర్ వైపు చూసి గడియ పెట్టడం మర్చిపోయారేమో అని వెళ్లి చూసి డోర్ లాక్ చేస్తాడు. తర్వాత వచ్చి తిరుపతి పడుకుండిపోతాడు. ఇక ఆనంద్ రావు ఇంటికి వచ్చి డోర్ తీస్తే డోర్ ఓపెన్ కాదు దాంతో వల్లికి కాల్ చేస్తాడు. శ్రీవల్లి మళ్లీ హాల్‌లోకి వచ్చి మాట్లాడుతుంది. డోర్ రావడం లేదని తీయమని ఆనంద్ రావు చెప్తాడు. వల్లి మళ్లీ డోర్ లాక్ తీస్తుంది. ఆనంద్ రావు ఇంట్లోకి వస్తాడు. ఆనంద్ రావు సరిగ్గా ఇంటి లోపలికి వెళ్లే సరికి తిరుపతి నిద్రలో  లేచి కలవరిస్తాడు. ఆనంద్ భయపడతాడు. తిరుపతి పక్కనే పడుకొని నీకు ఈ జన్మకి పెళ్లి అవ్వదురా ఇక్కడే ఇలాగే ఉండిపోతావ్ అని అంటాడు. 

ధీరజ్ గదిలోకి వెళ్లి ప్రేమతో డోర్ ఓపెన్ చేయమని అంటే చేయకుండా ఇక్కడ ఎంజయ్ చేస్తున్నావా రాక్షసి. మొన్న నువ్వే లోపలికి తీసుకొచ్చావ్ ఇప్పుడు పట్టించుకోవడం లేదు నువ్వేంటో అర్థం కావడం లేదే రాక్షసి అని అంటాడు. నన్ను అర్థం చేసుకోవాలి అంటే నీకు మనసు ఉండాలి కానీ నువ్వు ఎలా వచ్చావ్ అని ప్రేమ అంటుంది. దానికి ధీరజ్ నువ్వు కాకపోతే మరెవరూ డోర్ తీసేవాళ్లు లేరా అని అంటాడు. నిన్ను బతిమాలితే నువ్వు వచ్చి డోర్ తీస్తావా అంత సీన్ నీకు లేదే అని ధీరజ్ అంటే నువ్వు మాట్లాడే ప్రతీ మాట లెక్క పెట్టుకున్నారా బదులు తీర్చుకుంటా.. నువ్వు కాళ్లు పట్టుకున్నా అప్పుడు నేను వదలను అని అంటుంది. ఏడ్చావులే లే అని ధీరజ్ బెడ్ ఎక్కబోతే ఏంట్రాబెడ్ ఎక్కుతున్నావ్ నీ సామ్రాజ్యం అది అని చాప, దిండు, దుప్పటి కిందకి విసిరేస్తుంది. నాకు కాళ్లు నొప్పులు ఉన్నాయే ఈ పూటకి నేను బెడ్ మీద పడుకుంటానే వదిలేయవే అంటే గతంలో ఏం అన్నావో గుర్తు చేసుకో అని అంటుంది. నేను నీ బాధ్యత కాబట్టి నువ్వు ఈ బెడ్ నాకు అంకితం చేసేశావ్ హాయిగా కింద పడుకో నాన్న అని అంటుంది. అది బుర్రా చీమల పుట్టానే టార్చర్ పెట్టి చంపుతున్నావ్ అని ధీరజ్ కింద పడక వేస్తాడు. 

ప్రేమ, ధీరజ్ గిల్లిగజ్జాలాడుతూ ఉంటే ప్రేమ చెంబు ఇచ్చి కొడుతుంది. అది వల్లి తండ్రికి తలకు తగులుతుంది. ఆనంద్ రావు కుయ్యోమొర్రో అంటాడు. మరోవైపు సాగర్ నర్మదని కూల్ చేయడానికి నర్మద మీద చేయి వేస్తాడు. నర్మద సాగర్ చేయి పట్టుకోగానే సాగర్ లైన్‌లోకి వచ్చింది అనుకుంటాడు. కానీ నర్మద సాగర్ చేతిపై దోమల కాయిల్ అతికించేస్తుంది. సాగర్‌కి దిమ్మతిరిగిపోతుంది. ఇలా కాదు అని కాయిల్ పక్కకి విసిరేస్తాడు. ఆనంద్ రావు వచ్చి అక్కడ కూర్చొవడం ఆకాయిల్ అతని లుంగీకి అతుక్కొని బ్యాక్ కాలిపోతుంది. తర్వాత ఆనంద్ రావు తాళాలు తీసుకుంటాడు. నర్మదని సాగర్ మళ్లీ హగ్ చేసుకోగానే నర్మద లేచేసి నీరు తాగడానికి బయటకు వస్తుంది. 

ఆనంద్ రావు ఓ మూల దాక్కోవడంతో నర్మద చూసేస్తుంది. దొంగ దొంగ అని అరుస్తుంది. బాటిల్‌తో ఆనంద్‌రావుని నాలుగు తగిలిస్తుంది. ఈ లోపు తిరుపతి కూడా పట్టుకుంటాడు. కానీ అందరూ వచ్చే టైంకి ఆనంద్ రావు తప్పించుకుంటాడు. అందరూ బయటకు వెళ్లి వెతుకుతుంటే ఆనంద్ రావు రామరాజు ఎదురిళ్లు అయిన భద్రావతి ఇంట్లో దూరుతాడు. భద్రావతి గదిలో దూరుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.