Alluda Majaka Promo: సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఇక ఈ సంక్రాంతికి మరింత వినోదం పంచేందుకు 'అల్లుడా మజాకా' పేరుతో ఫన్నీ షోను మనకు అందించేందుకు రెడీ అయ్యింది మల్లెమల టీవీ. ఈ మేరకు ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది. ఈ ఈవెంట్‌కి హీరో విక్టరి వెంకటేష్‌తో పాటు సీనియర్ నటీమణులు మీనా, ఖుష్బులు ముఖ్య అతిథులుగా పాల్గొని స్సెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇక కమెడియన్స్ ఆది, సుధీర్‌లతో కలిసి వెంకటేష్ చేసిన సందడి మామూలుగా లేదు. మూడు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ ప్రొమో మొత్తానికి ఫుల్ ఫన్ అండ్ జోష్‌తో సాగింది.
ప్రకాశ్ రాజ్ డైలాగ్ తో వెంకీని ఇంప్రెస్ చేసిన ఆది
ఆది కామెడీతోనే ప్రొమో ప్రారంభమైంది. "వెంకటేష్ 'నువ్వు నాకు నచ్చావ్' మూవీలోని ప్రకాశ్‌రాజ్ కవిత్వాన్ని పేరడి చేస్తూ నవ్వులు పూయించాడు. దేవుడా అడక్కుండానే వెంకటేష్‌ను గెస్ట్‌గా ఇచ్చావు.. అలాగే క్యూట్ ఖుష్బు గారిని ఇచ్చావు.. ముద్దుల మీనా గారిని ఇచ్చావు.. కానీ వారిద్దరి ఆయన(వెంకటేష్) పక్కనే ఇచ్చావు. ఇలా చక్కగా ఉండే అమ్మాయిలను ఆయనకిచ్చాడు.. చక్కలా ఉండే శాంతి స్వరూప్‌ను నాకు ఇచ్చావు... అయినా పర్వలేదు నువ్వు నాకు నచ్చావ్" అంటూ గెస్ట్స్ మీనా, ఖుష్బు, వెంకీ మామను ఇంప్రెస్ చేశాడు. ఆ తర్వాత వెంకీ మామ వచ్చాడంటే పండుగే పండుగ .. బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్... అంటూ అభిమానంతో ముంచెత్తారు. ఇక ఎప్పటిలాగే సుధీర్‌ను ఆది బుక్ చేశాడు. సుడిగాలి సుధీర్ ట్రై చేసిన అమ్మాయిలంటూ షోలో పాల్గొన్న బుల్లితెర కంటెస్టెంట్స్‌తో కంటెంట్ ఇచ్చాడు. సుధీర్ ఫోన్ చేసి విసిగిస్తుంటాడంటూ ఢీ షో ఫేం నైనికా వచ్చి రానీ తెలుగులో చెప్పడం బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత సుధీర్ తన డ్యాన్స్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు.
నరేష్, సుధాకర్‌ను ఆటాడుకున్న వెంకీ మామ
ఇక జబర్దస్త్ స్కిట్‌లోకి వెంకీ ఎంట్రీ ఇచ్చాడు. నరేష్, సుధాకర్‌లు వెంకీని తమ స్కిట్‌లో కలుపుకుని ఫుల్ ఎంటర్‌టైన్ చేశారు. స్కిట్‌లో వారు చెప్పే డైలాగ్స్‌కి వెంకి రియాక్షన్ మరింత జోష్ నింపింది. మొత్తం మీద ఈ ప్రోమో సంక్రాంతికి 'అల్లుడా మజాకా' అనేట్టుగానే సాగింది. ఇక ప్రోమో చివరిలో వెంకీతో కలిసి మీనా, ఖుష్బులు స్టెప్పులెశారు. ఇక పూర్తి వీడియో సంక్రాంతి సందర్భంగా జనవరి 15న ఈటీవీలో ప్రసారం కానుంది. ఇక చాలా రోజుల తర్వాత సుధీర్ మల్లెమల షోలో కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. సుధీర్‌ని ఈవెంట్స్‌లో చూసి ఆడియన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్‌మార్క్ మూవీ ‘సైంధవ్’ త్వరలో విడుదల కాబోతోంది. పాన్ ఇండియా మూవీ తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సైంధవ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వెంకీ 75వ సినిమాగా వస్తున్న సైంధవ్ ఎంతటి విజయం సాధిస్తుందో చూడాలి.
Also Read: కొంత మంది ఇడియట్స్ ఆ పని చేశారు, ఈ అవార్డు వాళ్లకే అంకితం: షారుఖ్ ఖాన్