Guppedantha Manasu December 2nd Episode (గుప్పెడంతమనసు డిసెంబరు 2 ఎపిసోడ్)


హాస్పిట్లో శైలేంద్ర ఉంటాడు...రిషి కనిపించడకపోవడంతో వసుధార-మహేంద్ర కంగారుపడతారు.ఇంతలో రిషి నుంచి మెసేజ్ వస్తుంది...పని పూర్తిచేసుకుని వస్తానని చెప్పి. అప్పుడు కూల్ అవుతారు. అయితే మహేంద్ర మాత్రం ఈ అటాక్ అంతా వాడి ప్లానే అయిఉంటుంది..అయినా మన ఫ్యామిలీకి శైలేంద్రని మించి శత్రువు ఎవరుంటారని మహేంద్ర అంటాడు. అదే నిజమైతే ఇంతకన్నా పిచ్చి పని ఉండదంటుంది వసుధార. ఇక వాడి దుర్మార్గాలకి రోజులు దగ్గరపడ్డాయ్ అని వెళుతూ..నువ్వేంటి కంగారుగా ఉన్నావ్ అని అడుగుతాడు. రిషి సార్ ఎక్కడికి వెళ్లారో ఏంటో అని వసుధార టెన్షన్ పడుతుంటే..ఏంకాదులే వస్తాడు అని మహేంద్ర కూల్ చేస్తాడు. వచ్చిన తర్వాత అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం అని చెప్పి..మనం ధరణి దగ్గరకు వెళదాం పద అని వసుని తీసుకెళ్తాడు...


Also Read: డైలమాలో రిషి - క్లారిటీ ఇచ్చేందుకు వసు ప్రయత్నం - మొత్తం మార్చేసిన శైలేంద్ర!


ధరణి అటాక్ ఎలా జరిగింది, ఎంతమంది వచ్చారు, వాళ్ల ప్రవర్తన శైలేంద్రతో ఎలా ఉంది అంటూ మహేంద్ర వరుస ప్రశ్నలు వేస్తాడు
ధరణి: ఆయన ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలా అడుగుతున్నారేంటి..చెడ్డగా ఉన్నన్ని రోజులు ఏమీ జరగలేదు..ఆయన మారిన తర్వాత ఇలా జరిగిందని బాధపడుతుంది
ఈ అటాక్ వెనుక ఎవరున్నారో తెలుసుకుందాం అని అడుగుతున్నాను అంతే అని చెప్పి ధరణని రెస్ట్ తీసుకోమని చెప్పి... మహేంద్ర ఫణీంద్ర వాళ్ల దగ్గరకు వెళతాడు. రిషి ఏడని ఫణీంద్ర అడిగితే..బయటకు వెళ్లాడని చెబుతాడు.. ఇంతలో డాక్టర్ బయటకు రావడంతో నాకొడుక్కి ఏమైందని దేవయాని హడావుడి మొదలుపెడుతుంది... తనకి బ్లడ్ అవసరం అని చెబుతాడు డాక్టర్... పెద్దవయసు ఉన్న వాళ్ల దగ్గర బ్లడ్ తీసుకోవడం కరెక్ట్ కాదని ఎవర్నైనా అరెంజ్ చేయమని చెబుతాడు డాక్టర్...ఫణీంద్ర అందరకీ కాల్స్ చేసి అడుగుతుంటాడు...
ఆ మూర్ఖుడికి బ్లడ్ ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రారు అన్నయ్య అని మహేంద్ర అనుకుంటాడు...
ఎవ్వరూ ముందుకు రావడం లేదు దేవాయని అంటాడు ఫణీంద్ర..
బ్లడ్ కరెక్ట్ టైమ్ కి ఎక్కించకపోతే తన ప్రాణాలకే ప్రమాదం అంటాడు డాక్టర్...
దేవయాని ఏడుపు స్టార్ట్ చేస్తుంది.
ఫణీంద్ర: మహేంద్ర..నువ్వే ఈ నన్ను ఈ ఆపద నుంచి గట్టెక్కించాలి..శైలేంద్రకి బ్లడ్ ఇచ్చి వాడి ప్రాణం, నా ప్రాణం కాపాడు..నీ మనసులో ఉన్న అనుమానాలు కాసేపు పక్కనపెట్టు..నాకోసం...వాడు కోలుకున్నాడ అన్నీ పరిష్కరిద్దాం..ప్లీజ్ మహేంద్ర...అని చేతులు పట్టుకుని బతిమలాడుతాడు..
అన్నయ్య అడిగేసరికి మహేంద్ర కాదనలేకపోతాడు...అవేం మాటలు అన్నయ్య నేనిస్తాను అన్నయ్య..మీరు బాధపడకండి నేను చూడలేను అని చెప్పి బ్లడ్ ఇవ్వడానికి వెళతాడు...


Also Read: బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ - శైలేంద్ర నిజస్వరూపం మొత్తం రిషికి తెలిసిపోయింది


మహేంద్ర బ్లడ్ ఇస్తుంటాడు... శైలేంద్ర మెలుకువగానే ఉంటాడు...
మహేంద్ర: నేను నీ క్షేమంకోసమో నువ్వు బావుండాలనో బ్లడ్ ఇవ్వడం లేదు..నువ్వు బతకాలని బ్లడ్ ఇస్తున్నాను..నువ్వు ఇక్కడే ఇలాగే చనిపోతే నీ పాపాలు సమాధి అయిపోతాయి..నువ్వు మంచి వాడిగా అందరి గుండెల్లో మిగిలిపోతావ్ అది జరగడం నాకిష్టం లేదు... నీ సమాధిపై కీర్తి శేషుడు అని ఉండడం కూడా నాకిష్టం లేదు..నువ్వు చేసిన నేరాలు, ఘోరాలు బయటపడాలి...అందుకే నువ్వు బతికి ఉండాలి. అందుకే నీ మొహం చూడాలంటే చిరాకుపడే నేను నీకు బ్లడ్ ఇస్తున్నాను. ఇకపై నీ ఆటలు సాగవ్..నీ బండారం బయటపడే సమయం దగ్గరపడింది.. నా కళ్లముందే నా కొడుకు చేతిలో నువ్వు చావు దెబ్బలు తినడం ఖాయం..ఈ మాటలన్నీ నువ్వు వింటున్నావని నాకు తెలుసురా.... అంటాడు మహేంద్ర...
శైలేంద్ర: కళ్లు తెరిచి మహేంద్రని చూసి క్రూరంగా నవ్వుకుంటాడు శైలేంద్ర...
ఫణీంద్ర: నీది చాలా గొప్ప మనసు మహేంద్ర..నువ్వు నా తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం అనుకుని... మహేంద్ర దగ్గరకు వెళ్లి థ్యాంక్స్ చెబుతాడు... నీ ఒంట్లో ఎలా ఉందని యోగక్షేమాలు అడుగుతాడు..
వసు: శైలేంద్ర ఎన్ని కుట్రలు చేసినా వాటిని బయటపెట్టకపోవడానికి కారణం మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం సర్...శైలేంద్ర గురించి మీకు నిజం తెలిసిన క్షణం అది తట్టుకునే శక్తి ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా సర్ అని అనుకుంటుంది వసుధార...


Also Read: ఇంకేం కావాలి ఇది చాలదా - రిషిధార స్పెషల్ సెలబ్రేషన్స్, షాకిచ్చిన అనుపమ!


రిషి సర్ ఎక్కడికి వెళ్లారు ముకుల్ గారి దగ్గరకా అని ఆలోచనలో పడుతుంది వసుధార..ఇంతలో ముకుల్ అక్కడకు వస్తాడు... అంటే సర్ ముకుల్ గారిదగ్గరకు వెళ్లలేదా మరెక్కడికి వెళ్లి ఉంటారని ఆలోచిస్తుంది. రిషి సార్ ఉన్నారా అని ముకుల్ అడిగితే బయటకు వెళ్లారని చెబుతుంది. శైలేంద్ర కండీషన్ ఎలా ఉందని అడుగుతాడు...రండి సర్ మీరు తనని చూద్దురుగాని అని పిలుస్తుంది.


మహేంద్రని బయటకు తీసుకొచ్చి ఫణీంద్ర..ప్రతిక్షణం జాగ్రత్తలు అడుగుతాడు..నేను లోపలకు వెళ్లి శైలేంద్రని చూసి వస్తానండి అని లోపలకు వెళుతుంది దేవయాని.... అప్పుడే ముకుల్, వసుధార అక్కడకు వెళతారు...శైలేంద్ర స్పృహలోనే ఉన్నారా అని ముకుల్ అడిగితే... లేదంటాడు ఫణీంద్ర. అయితే మహేంద్ర మాత్రం లేదన్నయ్యా తొందరగానే కోలుకుంటాడని చెబుతాడు మహేంద్ర. ఇప్పుడు ఇంటరాగేషన్ అవసరమా అని ఫణీంద్ర అంటే...మీ కొడుకు అని వెనకడుగు వేస్తున్నారా? ఈ బంధాలు బంధుత్వాలు చట్టం చూడదు సర్ అని క్లారిటీ ఇస్తాడు ముకుల్. 
ఫణీంద్ర: నా కొడుకు తప్పు చేసి ఉంటే మీకన్నా ముందు నేనే శిక్షిస్తాను వదిలిపెట్టే ప్రసక్తే లేదు..ఇప్పుడు తన కండిషన్ సరిగ్గా లేదని అంటున్నానంతే..మరో ఉద్దేశం లేదు...