Guppedantha Manasu November 29nd Episode (గుప్పెడంతమనసు నవంబరు 29 ఎపిసోడ్)
వసుధారని ఇరికేందుకు ప్రయత్నించిన శైలేంద్ర..కాలేజ్ స్టూడెంట్ పై హత్యాయత్నం చేయిస్తాడు. ఆ మర్నాడు ఆమె తల్లిదండ్రులు వచ్చి రిషిని నిలదీస్తారు. కానీ అప్పటికే ఆమెను కాపాడిన రిషి..స్టూడెంట్ ని తీసుకొచ్చి తల్లిదండ్రులకు చూపించి..వసుధార ఎలాంటి తప్పు చేయలేదని ప్రూవ్ చేస్తాడు. పోలీసులు సారీ చెప్పి వెళ్లిపోతారు.. ఆ తర్వాత వసుధార ఏడుస్తూ కూర్చుంటుంది.. రిషి ఓదార్చుతాడు..రిషి చేయి తీసుకుని ముద్దుపెట్టుకుంటుంది వసుధార..ఏంటి స్పెషల్ థ్యాంక్సా అని నవ్వుతూ అంటాడు రిషి.
వసు: సాక్ష్యాలు నాకు వ్యతిరేకంగా ఉన్నాయి..ఎవరో కావాలని నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు..అనుపమ మేడం కూడా అలా మాట్లాడడం బాధ అనిపించింది, చాలా భయం వేసింది
రిషి: యూత్ ఐకాన్ కి భయమా
వసు: ఓ అమ్మాయి నా కారణంగా సూసైడ్ అటెప్ట్ చేశానంది..అన్నీ నాకు వ్యతిరేకంగా ఉన్నాయి
రిషి: బెయిల్ ఇప్పించినందుకు అనుపమ మేడంకి థ్యాంక్స్ చెప్పాలి..నీకు నేను నాకు నువ్వు ఇలా జీవితాంతం తోడుగా ఉండాలి. ఈ రిషి నీకు భర్త మాత్రమే కాదు నీ ప్రాణానికి, నీ జీవితానికి, నీ సర్వస్వానికి కాపలా...
వసు: అలా అనకండి సార్ ..యూ ఆర్ మై జెంటిల్మెన్...
Also Read: ఇచ్చిపడేసిన రిషి - దేవయానిలో మొదలైన భయం
అనుపమకి కాల్ చేసిన మహేంద్ర ఇంటికి రమ్మని పిలుస్తాడు..ఎందుకు అని అడిగితే వస్తే తెలుస్తుంది కదా అని కాల్ కట్ చేస్తాడు.. అనుపమ అటు బయలుదేరుతుంది..మరోవైపు రిషిధార కార్లో వెళుతుంటారు...ఆ స్టూడెంట్ MSR పేరు చెప్పిన విషయం గుర్తుచేసుకుని...వాసవ్ చెప్పింది నిజమే అంటారా అని అడుగుతుంది
రిషి: నాకు అర్థం కాలేదు
వసు: చిత్రకేసులో నన్ను ఇరికించింది MSR కదా..తనకి ఇన్ని తెలివితేటలు లేవు..దీనివెనుక ఇంకెవరో ఉన్నారు అనిపిస్తోంది
రిషి: MSR ని పట్టుకుంటే నిజం తెలుస్తుంది కదా.వాడు ఎవడైనా కానీ వాడిని వదిలిపెట్టే సమస్యే లేదు
ఓసారి కారు ఆపండి అని అడుగుతుంది..రోడ్డుపక్కనున్న టీ కొట్టు దగ్గరకు రిషిని తీసుకెళుతుంది...స్టౌ పై ఉన్న టీ వద్దు.. మళ్లీ ప్రిపేర్ చేయండి అంటూ..టీ ఎలా పెట్టాలో షాప్ వాడికి డైరెక్షన్ ఇస్తుంటుంది...
రిషి: నువ్వు స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించావో ఇప్పుడు కూడా అలాగే ప్రవర్తిస్తున్నావ్...కాలేజ్ ఎండీవి..
వసు: అప్పుడు ఇప్పుడు ఏంటి తేడా...అప్పుడు మీరే నా పక్కనున్నారు..ఇప్పుడు మీరే ఉన్నారు
రిషి: అందరూ నిన్నే చూస్తున్నారు
వసు: తప్పేంటి..రెస్టారెంట్ కి వెళితే ఫుడ్ ఎలా ఉండాలో చెబుతాం కదా ఇది కూడా అంతే...తనని అలా చేయమన్నందుకే మీరు ఇబ్బందిగా ఫీలవుతున్నారు..మరి నేనే వెళ్లి టీ చేస్తే..
రిషి: వద్దు వసుధారా...అలాంటి ప్రయోగాలు చేయొద్దు
వసు: నాకైతే నా చేతులతోనే టీ చేసుకుని తాగాలని ఉంది..మీక్కూడా నేనే ఇస్తాను..
ఆ టీకొట్టు వాడిని పక్కన నిల్చోమని చెప్పివసుధార టీ ప్రిపేర్ చేస్తుంటుంది.. రిషి ఇబ్బందిగా కూర్చుంటాడు..
మేడం నేను పాతికేళ్లనుంచి టీ కొట్టు నడుపుతున్నాను మీరు కొత్తగా నేర్పిస్తారా అని అడుగుతాడు... కానీ నా స్టైల్ నాకుంటుంది కదా పనికొస్తే వాడుకోండి లేదంటే లేదు అంటుంది...
ఆ టీ తాగిన తర్వాత బావుందని చెబుతారు... ఈ సార్ ని ఎక్కడో చూశాను అనుకుంటూ ఈయన రిషి సార్ కదా అనుకుని సెల్ఫీ అడుగుతాడు...మీరంటే మా పిల్లలకు చాలా ఇష్టం..మీతో సెల్ఫీ తీసుకుని మా పిల్లలకు చూపిస్తే హ్యపీగా ఫీలవుతారు..
వసు: అంతేనా..రిషి సార్ బ్యానర్ కడతారా
ఈ ఐడియా బావుంది మేడం
రిషి: మీ పనితనాన్ని నమ్ముకోండి..వేరేవాళ్ల ఫేమస్ ని నమ్ముకోవద్దంటాడు
సెల్ఫీ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతారు రిషిధార...
Also Read: వసుధారపై కిడ్నాప్ కేసు - చిత్రను సేవ్ చేసిన రిషి
మహేంద్రని కలుస్తుంది అనుపమ... కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు..నేను అడగలేదు కదా అంటే అడగకపోతే తాగవని కాదు కదా అంటాడు.
అనుపమ: ఎందుకు రమ్మన్నావ్
మహేంద్ర: చిత్ర కేసులో నా కోడలు ఏ తప్పూ చేయలేదని తేలింది..నీకు ముందే చెప్పినా నమ్మలేదు..వసుధార జగతి శిష్యురాలు తను ఏ తప్పు చేయదు
అనుపమ: ఇందుకోసమే పిలిచావా
మహేంద్ర: నువ్వు హెల్ప్ చేయడం వల్లేకదా వసుధార బయటకు వచ్చింది..
ఇంతలో వచ్చిన రిషి వసు..అనుపమకి జరిగినదంతా చెబుతాడు.. ఈ కేసులో చిత్ర ప్రేమికులు, బాబాయ్, పిన్ని నేరస్తులు.. వసుధార ఏ తప్పు చేయలేదని తేలిపోయింది..నాకు చాలా హ్యాపీగా ఉంది
అనుపమ: అవునా చాలా హ్యాపీగా ఉందా
రిషి: అవును మేడం..
అనుపమ: నీ భార్యమీద వచ్చిన నిందని తొందరగానే తుడిచేశావ్...హ్యాపీగా ఉంది..నేరస్తుల్ని పట్టుకోవడంలో నీకు ఎంతో వేగం చాతుర్యం ఉంది కదా..కానీ మీ అమ్మను చంపిన వాళ్లని పట్టుకోవడానికి నీకెందుకు ఇంత ఆలస్యం అవుతోంది...చెప్పు రిషి.. అమ్మను చంపినవారిని పట్టుకోవాలి వారిని శిక్షించాలని అనుకోలేదా..
రిషి: ఆ ప్రయత్నంలోనే ఉన్నాకదా..
అనుపమ: ఇంతవరకూ ఆ కేసు ఓ కొలిక్కి రాలేదు కదా
మహేంద్ర: దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది
అనుపమ: వసుధారపై నిన్న నిందపడింది..ఒక్క రోజులో తప్పులేదని ప్రూవ్ చేశారు..భార్య విషయంలో యాక్టివ్ గా ఉన్న రిషి ఎందుకు చురుగ్గా లేడు. నీ కోడలు ఇంటికొచ్చిందని నాకు కాల్ చేసి గర్వంగా చెబుతున్నావ్...మరి నీ భార్యని చంపిన వాళ్లని ఎందుకు పట్టుకోలేదు..బతికినన్ని రోజులూ తనని బాధపెట్టారు..ఎందుకు మీ అమ్మ చావుని లైట్ గా తీసుకుంటున్నారు
రిషి: ఆవిషయంలో నేను ఎంత తొందరగా ఉన్నానో..ఎంత ప్రయత్నాలు చేస్తున్నానో నాకే తెలుసు. వసుధార కేసులో క్లూ దొరికింది..
అనుపమ: ఏంటి వసుధారా నువ్వైన చొరవ తీసుకోవచ్చు కదా.నువ్వు ఓ స్థాయికి ఎదగడానికి జగతే కారణం అయింది..నువ్వు ఆ కృతజ్ఞత తీర్చుకోవచ్చుకదా...నీకు నిజంగా తల్లిపై గౌరవం, ప్రేమ ఉంటే ఆ ఆధారాలు దొరికించుకో..నా జగతిని చంపింది ఎవరో నాకు తెలియాలి
రిషి: అమ్మ హత్య విషయంలో ఏమీ చేయలేదనుకుంటున్నారు...బయటకు ఇలా ఉన్నా లోలోపల కుంగిపోతున్నా..మొన్నటి వరకూ డాడ్ ఏమైపోతారో అని భయపడ్డాం..మేం ఏడుస్తూ కూర్చుంటే కానీ మా బాధ తెలియదా...మీరు చెప్పినా చెప్పకపోయినా నేను హంతకుడిని పట్టుకోవాలని నిర్ణయించుకున్నా..ఓ స్నేహితురాలిగా మీకే అంత ప్రేమ ఉంటే..జన్మనిచ్చిన తల్లిపై నాకెంత బాధ్యత ఉండాలి..నా వంతు ప్రయత్నం నేను నా పద్ధతిలో చేస్తున్నా..నా ప్రయత్నాలు ఫలిస్తాయి..రేపే జరగొచ్చు లేదా ఇంకొంచెం ఆలస్యం కావొచ్చు..అమ్మ మరణానికి న్యాయం జరిగి తీరుతుంది..వాటి ఫలితం రాబోయే రోజుల్లో మీకే తెలుస్తుంది...
ఈ మాట చెప్పేసి రిషి, వసుధార అక్కడి నుంచి వెళ్లిపోతారు...అనుపమ సైలెంట్ గా ఉండిపోతుంది
Also Read: ఇదే ఏడాదిలో మళ్లీ ముక్కోటి ఏకాదశి - న్యూ ఇయర్ కన్నా ముందే వచ్చింది!
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply