Guppedanta manasu Telugu Serial Today Episode : వసుధార ఏడుస్తూ కూర్చుని ఉంటుంది. పక్కనే రిషి, మహేంద్ర వసుధారను ఓదారుస్తూ ఉంటారు. నువ్వు తప్పు చేశావని అందరూ నమ్ముతున్నారనుకుంటున్నావా? ఎవరు నమ్మినా నమ్మకపోయినా మేం నిన్ను నమ్ముతున్నాం వసుధార అంటూ రిషి చెప్తాడు.


మహేంద్ర: అవునమ్మ నువ్వు ఏ తప్పు చేయలేదు. అసలు తప్పు చేయడం అనేది నీ డిక్షనరీలోనే లేదు.


రిషి: అసలు ఏం జరిగిందో చెప్పు వసుధార


వసుధార: సార్‌ నేను ఏ తప్పు చేయలేదు. నేను ఇప్పుడు భయపడుతుంది భాదపడుతుంది. వాళ్లు నా మీద నింద మోపినందుకు కాదు సార్‌. నావల్ల డీబీఎస్‌ కాలేజ్‌ పేరు పేపర్లకు, టీవీలకు ఎక్కింది. నావల్ల మీరు పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది సార్‌. అన్నింటికి మించి ఈ సిచ్చుయేషన్‌ నుంచి చిత్ర ఎలా బయటపడుతుంది. తన ప్రాణానిక ఏమైనా ప్రమాదం ఉందా అని భయపడుతున్నాను సార్‌.


రిషి: తనకేం కాదు వసుధార తన గురించి నువ్వేం బాధపడకు. వసుధార వాళ్లు చూపించిన సీసీటీవీ ఫుటేజీలో నువ్వు వాళ్లకు వార్నింగ్‌ ఇస్తున్నట్లు ఉంది. కానీ నేను అది నమ్మను. ఎందుకంటే నువ్వు ఏది చేసినా మంచికోసమే చేస్తావని నాకు తెలుసు. ఇంతకుముందు ఇలాంటివి చూసి నిన్ను అపార్థం చేసుకుని నేను ఏం కోల్పోయానే నాకు బాగా తెలుసు. నువ్వు తప్పు చేశావని నేను ఎప్పుడూ అనుకోను. అసలు చిత్ర నీకెందుకు మెసేజ్‌ చేసింది. నువ్వెందుకు అక్కడికి వెళ్లావు.


అంటూ అక్కడ ఎం జరిగిందో వివరంగా చెప్పమని రిషి, వసుధారను అడగుతాడు. అసలు జరిగిన విషయాన్ని వసుధార మహేంద్ర, రిషిలకు చెప్తుంది.  వసుధారకు చిత్ర ఫోన్‌ నుంచి మెసేజ్‌ వస్తుంది. అది చూసిన వసుధార చిత్ర ఆపదలో ఉన్నట్లుంది తనను ఎలాగైనా కాపాడాలని చిత్ర ఇంటికి కంగారుగా వెళ్తుంది.


చిత్ర: ఏంటి మేడమ్‌ ఇలా వచ్చారు?


వసుధార: అదేంటి చిత్ర ప్లీజ్‌ హెల్ప్‌ మీ మేడం అంటూ మెసెజ్‌ చేశావు.  


అని చెప్పడంతో చిత్ర నేను చేయలేదు మేడం అంటూ చెప్తుండగానే చిత్రను ప్రేమించిన వాడు అక్కడికి వచ్చి ఆ మెసేజ్‌ తానే చేశానని చిత్ర మీరు చెప్తే వింటుందని అందుకే మీరు ఇక్కడికి వచ్చేలా మెసేజ్‌ చేశానని చెప్తాడు. మేడం ఎలాగైనా చిత్రను ఒప్పించాలని చిత్ర వాళ్ళ అమ్మానాన్న కూడా ఒప్పుకున్నారని చెప్తాడు. చిత్ర వాళ్ల పేరెంట్స్‌ కూడా అక్కడికి వచ్చి అవును మేడం మాకు ఈ అబ్బాయి నచ్చాడు. చిత్రకు ఈ అబ్బాయితో పెళ్లి చేస్తే మంచి జీవితం ఉంటుందని చిత్రను మీరే ఒప్పించాలని వాళ్లు వసుధారకు చెప్తారు. చిత్ర మాత్రం తనకు పెళ్లి ఇష్టం లేదని వసుధారకు చెప్తుంది. దీంతో వసుధార వాళ్లను బెదిరిస్తుంది. చిత్రను ఇబ్బంది పెట్టొద్దని అలా చేస్తే  పోలీసులకు కంప్లైంట్‌ చేస్తానని చెప్తుంది. చిత్రకు భయపడొద్దని ధైర్యం చెప్తుంది వసుధార


వసుధార: ఇది సార్‌ జరిగింది. ఉదయం మీరు అడిగినప్పుడు మీకు చెప్తుంటేనే మీకు ఫోన్‌ వచ్చింది.


రిషి: నువ్వు వెళ్లే ముందు నాకు చెప్తే సరిపోయేది కదా! ఎందుకు ఒక్కదానివే ఒంటరిగా వెళ్లావు.


వసుధార: మీరు అప్పటికే బాగా అలసిపోయి ఉన్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని.. ఏదైనా సీరియస్‌ మాటర్‌ అయితే చెబుదామనుకున్నాను.


మహేంద్ర: నీకు చెప్పాను కదా అమ్మ ఏ చిన్న విషయం అయినా రిషికి చెప్పి బయటికి వెళ్లమని..


వసుధార: అవును చెప్పారు మామయ్యా కానీ ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు.


రిషి: అసలు నాకొక విషయం అర్థం కాలేదు. చిత్ర ఎందుకు సూసైడ్‌ చేసుకుంది.


వసుధార: అదే అర్థం కావడం లేదు సార్‌.


మహేంద్ర: ఒకవేళ వీళ్లే అలా చేశారేమో..?


అనగానే రిషి కూడా నిజమే ఉండొచ్చని ఇందుకు కారణమైన వాళ్లు ఎవరైనా సరే పట్టుకుని తీరతానని ఇందులోంచి చిత్రను కాపాడతానని రిషి చెప్తాడు.


శైలేంద్ర వాళ్ల అమ్మతో ఫోన్‌లో మాట్లాడుతుంటాడు.


శైలేంద్ర: నన్ను పట్టుకోవడం ఎవ్వరి వల్ల కాదు మామ్‌.


దేవయాని: ఏదైతేనేం నువ్వు మాత్రం సూపర్‌ నాన్నా.. నువ్విక్కడ లేకుండానే.. మన చేతికి మట్టి అంటకుండానే ఆ వసుధారని కేసులో భలే ఇరికించావు.


మరోవైపు రిషి, మహేంద్ర, వసుధారతో మాట్లాడుతుంటాడు.


రిషి: వాళ్లు నిన్ను ఈ కేసులో తెలివిగా ఇరికించామనుకుంటున్నారేమో కానీ అసలు వాళ్ల ప్లాన్‌ ఏంటి? ఏం ఆశించి  ఇలా చేస్తున్నారు. మొత్తం బయటికి తీస్తాను.


శైలేంద్ర: ఎక్జామ్‌లో ఔట్‌ ఆఫ్‌ సిలబస్‌ క్వశ్చన్‌ వచ్చినట్లు నాకు ఏ సంబంధం లేనట్లు నేను ఔట్‌ ఆఫ్‌ స్టేషన్‌లో ఉన్నాను. నా మీద అనుమానం వచ్చే ప్రసక్తే లేదు.


రిషి: వాళ్లు ఔట్‌ ఆఫ్‌ స్టేషన్‌లో ఉన్నా అండర్‌ గ్రౌండ్‌లో ఉన్నా.. కలుగులో ఉన్న ఎలుకను బయటికి లాగినట్లు వాళ్లను బయటికి లాగుతాను.


దేవయాని: నాకు తెలుసు నాన్న నా కొడుకు కలుగులో ఉన్న ఎలుక కాదు. అంత ఈజీగా దొరకడానికి ఏ ఆధారం లేకుండా ఎలా తెలుసుకుంటారో అదీ చూద్దాం.


రిషి: ఇందులో మనకి ఏ ఆధారాలతో సంబంధం లేదు.


అంటూ ఆధారాలు దొరక్కపోతే నేనే పోలీస్‌ పాత్ర పోషిస్తా.. మొత్తం ఇన్వెస్టిగేషన్‌ చేసి మొత్తం కూపీ లాగుతానని ఒకవైపు రిషి చెప్తుంటాడు. మరోవైపు శైలేంద్ర కూడా తాను ఎవ్వరికీ దొరకనని ధీమాగా వాళ్ల అమ్మ దేవయానికి ఫోన్‌లో చెప్తుంటాడు.


రిషి ఇంట్లో కనిపించకపోవడంతో వసుధార కంగారుగా మహేంద్రను అడుగుతుంది. ఇంట్లో లేడని ఎక్కడికి వెళ్లాడని ఇద్దరూ టెన్షన్‌ పడుతుంటారు. హాస్పిటల్‌లో చిత్రను చంపేందుకు చిత్ర లవర్‌ కిరాయి రౌడీలతో వస్తాడు. రిషి హాస్పిటల్‌లో చిత్రను కాపాడి రౌడీలను, చిత్ర లవర్‌ను పట్టుకుంటాడు. మరుసటి రోజు హాస్పిటల్‌ లో చిత్రను  రిషి, వసుధార లు కలిసి కిడ్నాప్‌ చేశారని చిత్ర పేరేంట్స్‌ పోలీసులకు చెప్తుంటారు. ఇదంతా లైవ్‌లో దేవయాని చూస్తూ ఉంటుంది. చిత్ర బతికే ఉందని ఎవ్వరూ తనను కిడ్నాప్‌ చేయలేదని నిజాలు మొత్తం చిత్రనే చెప్తుందని రిషి చెప్పడంతో మహేంద్ర చిత్రను తీసుకుని అక్కడికి వస్తాడు. దీంతో చిత్ర పేరెంట్స్‌, పోలీసులు, దేవయాని షాక్‌ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆
*T&C Apply