గుప్పెడంతమనసు జులై  9 శనివారం ఎపిసోడ్ (Guppedantha Manasu  July 9 Episode 498)


సాక్షిని తిట్టి పంపించేసిన రిషి..మళ్లీ తన పెద్దమ్మ మాటలు గుర్తుచేసుకుని సారీ అని చెప్పి వెనక్కు పిలుస్తాడు. టీ, కాఫీ ఏం కావాలని అడిగితే..నీ టైమ్ కావాలి అంటుంది.
సాక్షి: ఆత్మహత్య చేసుకున్నట్టు నటిస్తేకానీ నా దారికి రాలేదు కదా...ఇకముందు చూడు ఒక్కో అడుగు నీకు ఎలా దగ్గరవుతానో అనుకుంటుంది. నీకు ఇబ్బంది కాబట్టి ఇకపై రానులే రిషి 
రిషి: నీ మనసులో నువ్వు క్లియర్ గా ఉన్నట్టే నామనసులో నేను క్లియర్ గా ఉన్నాను..నువ్వు ఎప్పుడైనా రావొచ్చు
సాక్షి: సినిమా బాకీ ఉన్నావ్..ఎప్పుడు తీరుస్తావ్
రిషి: ఇప్పుడే కదా అడిగావ్..చెబుతానులే
సాక్షి: నువ్వేదో పనిలో ఉన్నావ్ రిషి..నేను వెళతానులే...ఇంకెప్పుడూ నిన్ను ఇబ్బంది పెట్టను
రిషి: జీవితంలో ఏదైనా పోగొట్టుకోవచ్చు కానీ జీవితాన్ని పోగొట్టుకోకూడదు...
సాక్షి: నువ్వు నా గుప్పిట్లోకి వస్తావ్ రిషి..అప్పుడు నేనేంటో చూపిస్తాను అనుకుంటూ వెళ్లిపోతుంది...
 సాక్షి వెళ్లిపోయిన వెంటనే ....హార్ట్ సింబల్ చూసి వసుఆలోచనల్లో పడతాడు రిషి...


Also Read: హిమ క్యాన్సర్ నాటకాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న శోభ, మరింత పగ పెంచుకున్న శౌర్య


ఏంటి గౌతమ్ ఇలా జరిగిందని మహేంద్ర అంటే..అవునంకుల్... రిషి రాగానే నేను వెళ్లిపోదాం అనుకుంటే మొత్తానికే ప్రోగ్రాం క్యాన్సిల్ చేశాడు రిషి అనుకుంటారు. ఇంతలో అటుగా వెళుతున్న వసుధార కళ్లుతిరిగి కిందపడిపోతుండగా మహేంద్ర నెమ్మదిగా తీసుకొచ్చి కూర్చోబెడతాడు. హాస్పిటల్ కి తీసుకెళదాం అని గౌతమ్ అంటే వద్దులెండి సార్...నేను రూమ్ కి వెళ్లి రెస్ట్ తీసుకుంటాను అంటుంది. నేను కార్ కీ తేవడం లేదని మహేంద్ర చెప్పడంతో రిషి కారు కీ అడుగుతాను అని చెప్పి గౌతమ్ వెళతాడు. అటు క్లాస్ రూమ్ లోంచి గెటౌవ్ అన్న విషయం గుర్తుచేసుకుని వసుధార బాధపడుతుంది. రిషి కూడా అదే విషయం తల్చుకుంటాడు. తను నన్ను కాదన్నా ఎందుకు ఆలోచిస్తున్నాను... ప్రేమిస్తే ఇంత బాధగా ఉంటుందా... ల్యాబ్ లో ఎందుకు అలా మాట్లాడింది. తన మనసులో నా స్థానం ఏంటి అని ఆలోచిస్తుంటాడు. అప్పుడే వచ్చిన గౌతమ్...వసుధార కళ్లుతిరిగి పడిపోయిందని చెబుతాడు. కంగారుపడినపోయిన రిషి ఇప్పుడెలా ఉందో చెప్పు అంటాడు.
 కార్ కీ ఇవ్వు అని గౌతమ్ అడిగి వెళ్లిపోతాడు. 
గౌతమ్: మనుసులో మాట బయటపెట్టుకోరు ఇద్దరూ ఇద్దరే అనుకుంటూ వెళ్లిపోతాడు గౌతమ్..
రిషి: గౌతమ్ వెళ్లిపోయిన తర్వాత రిషి ఆలోచిస్తాడు...
గౌతమ్: రిషిని ఎలాగైనా వసుధారతో పంపించేందుకు ప్లాన్ చేసిన గౌతమ్ ...కాలు స్లిప్ అయినట్టు యాక్ట్ చేస్తాడు. రిషి కంగారుగా వచ్చి గౌతమ్ ని లేపి కుర్చీలో కూర్చోబెడతాడు. భవిష్యత్ లో కూడా నడవగలనో లేదో, ఇక క్రికెట్ ఆడగలనో లేదో....అయినా వసుధార కళ్లుతిరిగి పడిపోయింది..నన్ను మర్చిపోయి..వసుధారని రూమ్ లో దించేసి రా...
రిషి: డ్రైవర్ ని ఇచ్చి పంపించనా
గౌతమ్: అలా పంపిస్తే తన మనోభావాలు దెబ్బతింటాయ్...
రిషి: నేనే వెళ్లి డ్రాప్ చేస్తానులే.... అటెండర్ ని పిలిచిన రిషి నువ్వు ఇక్కడే ఉండి గౌతమ్ కి హెల్ప్ చేయి అని చెప్పేసి వెళ్లిపోతాడు...
గౌతమ్: మహేంద్రకి కాల్ చేసిన గౌతమ్..మనోడు వస్తున్నాడు సరిగ్గా డీల్ చేయండి అంటాడు... అటెండర్ వాటర్ ఇవ్వగానే తాగేసి నీళ్లలో ఏం కలిపావ్ వెంటనే దెబ్బ తగ్గిపోయింది. కొన్ని అద్భుతాలు ఇలాగే జరుగుతాయి..జరిగిన వాటిగురించి ఎ్వరికీ చెప్పొద్దు..
రిషి రావడం చూసి మహేంద్ర..వసుధారని తీసుకెళ్లి కార్లో కూర్చోబెడతాడు....జాగ్రత్తమ్మా అని చెబుతాడు...( పుత్రరత్నం ముందు నటించాలి లేకపోతేన బావోదు అనుకుంటూ) నువ్వేంటి ఇక్కడ గౌతమ్ ఎక్కడ అని అడుగుతాడు.
రిషి: వసుధారకి ఎలా ఉంది
మహేంద్ర: చాలా నీర్సంగా ఉంది..అలసిపోయినట్టుంది...
రిషి: అవసరం లేని పనులు చేయిస్తే అలానే ఉంటుంది...( మీరు డ్రాప్ చేస్తారా ఇదిగోండి కీ అంటాడు)
మహేంద్ర: నాకు పని ఉంది..గౌతమ్ వెళతాడు అనుకున్నాను...నేను వెళ్లనా వెళతాను అని తప్పించుకోలేక కీ తీసుకుంటాడు...
రిషి: డాడ్..అని వెనక్కు పిలిచిన రిషి..వద్దులెండి నేనే వెళతాను...
మహేంద్ర: ఎందుకు, ఏంటి ...సరే వెళ్లు ( నాక్కావాల్సింది కూడా అదే)


Also Read: రిషి మనసులో దాగని ప్రేమ, వసు కళ్లుతిరిగి పడిపోయిందనగానే కంగారుపడిపోయిన ఈగో మాస్టర్


కార్లో కూర్చున్న రిషి... వసుధారకి సీట్ బెల్ట్ పెడతాడు. అవసరం లేని పనులు , తనకు సంబంధం లేనివన్నీ చేస్తుందని రిషి అనుకుంటాడు. గౌతమ్ సార్ రిషి సార్ కారు తెస్తే రిషి సార్ కి ఇబ్బంది కదా నేను ఆటోలో వెళతాను అని మాట్లాడుతుంటుంది. 
రిషి: ఇలాంటి స్థితిలో కూడా నా గురించే ఆలోచిస్తోందా..ఇంతలా ఉండే వసుధార నాకు ఎందుకు నో చెప్పింది...
వసు: ఏంటి గౌతమ్ సార్...మీరుకూడా రిషి సార్ లా మాటిమాటికీ హారన్ కొడతారు అంటుంది...( సడెన గా రిషిని చూసి షాక్ అవుతుంది) మీరేంటి సార్..గౌతమ్ సార్ కాదా...
రిషి: గౌతమ్ కి కాలు నొప్పి అని వచ్చాను..ఏం నేను డ్రైవ్ చేస్తే కూర్చోవా... నన్నుచూడగానే భూతాన్ని చూసి అరిచినట్టు అరుస్తావేంటి. నేను వచ్చానని కారు దిగిపోతావా
వసు: నేను అలా అనలేదు కదా సార్...( రిషి సార్ ఏం మాట్లాడడం లేదేంటి)
రిషి: వసుధార ఏం మాట్లాడదేంటి..ఏదో ఒకటి మాట్లాడొచ్చుకదా
వసు: నేను మాట్లాడాలని అనుకుంటున్నారా
రిషి: నేనే మాట్లాడాలని అనుకుంటోందా
ఇద్దరూ ఒకేసారి పిలుచుకుంటారు... 
రిషి: లేనిపనులన్నీ తలకెత్తుకోవడం ఎందుకు.. ఇదంతా అవసరమా..
వసు: అలా అయిపోయింది సార్ అంతే...
రిషి: ఎప్పుడూ గలగలా మాట్లాడుతుంది..ఈరోజేంటో సీరియస్ గా ఉంది..అయినా పాపం హెల్త్ బాగాలేదు.. నేనంటే ప్రేమ లేదంటుంది..నాకేదైనా జరిగితే ప్రాణాలతో ఉండను అంటుంది... నిన్నెలా అర్థం చేసుకోవాలి వసుధార....
ఎపిసోడ్ ముగిసింది...


Also Read: సాక్షితో షికార్లు చేస్తున్న రిషిని చూసి హర్ట్ అయిన వసు - దేవయాని విషపు ఆలోచన పసిగట్టేసిన జగతి, మహేంద్ర