గుప్పెడంతమనసు జులై 6 బుధవారం ఎపిసోడ్ (Guppedantha Manasu  July 6 Episode 495)


నేనిచ్చిన మెసేజ్ కి రిప్లై ఇవ్వలేదని అడిగిన వసుధాతో...నాకేం పనిలేదా..ఇచ్చేటప్పుడు రిప్లై ఇస్తాను వెయిట్ చేయి అని కౌంటర్ ఇస్తాడు రిషి. ఇదంతా చూసిన జగతి-మహేంద్ర.. అసలేం జరుగుతోంది అనుకుంటారు.  రిషి దగ్గరకు వసు ఎందుకొచ్చిందని జగతి అడిగితే... సాక్షి నుంచి రిషిని రక్షించేందుకు వచ్చిందేమో అంటాడు మహేంద్ర. రిషి మాత్రం చాలా బ్యాలెన్సెడ్ గా వ్యవహరిస్తున్నాడు అని కాంప్లిమెంట్ ఇస్తాడు మహేంద్ర. రిప్లై ఇచ్చేవరకూ వెయిట్ చేయి అనేసి రిషి వెళ్లిపోతాడు. ఇంతలో వసుని లంచ్ కి పిలుస్తుంది జగతి.  రిషి సార్ తినకుండా వెళ్లిపోతున్నారని అన్న వసుధారతో..మీ సార్ నువ్వు ఏమనుకుంటారో మీ ఇష్టం అనేసి జగతి వెళ్లిపోతుంది. జగతి-మహేంద్ర-వసుధార లంచ్ చేస్తుంటారు. రిషి సార్ కి మీరైనా చెప్పొచ్చుకదా అని వసుధార అడుగుతుండగా రిషి అక్కడకు వస్తాడు. మహేంద్ర కార్ కీస్ తీసుకుని వెళ్లిపోతాడు. 
రిషి; మీ స్టూడెంట్ ఈ మధ్య కొన్ని అర్థం పర్థం లేని పనులు చేస్తోంది, కాస్త చెప్పండి..కాలేజీ కనెస్ట్రక్షన్ వర్క్స్ తనకి అవసరం లేదని...
వసుధార: నేను ఏం చేశానని..కాలేజీ పనే కదా
జగతి: ఎండీ గారు చెప్పింది విన్నావ్ కదా..ఇంక నన్నేం అడగొద్దు..అది ఎండీగారి ఆర్డర్
మహేంద్ర: స్టేజ్ పైన అంత ధైర్యంగా ఎండీగారి మెడలో దండ ఎలా వేయగలిగావ్...
వసు: మళ్లీ రిషి సార్ వచ్చినా వస్తారు...ఇంకెప్పుడైనా చెబుతాను
మహేంద్ర: తన మనసులో ఏముందో రిషికి చెబితే బావుంటుంది కదా అనుకుంటాడు


Also Read: తనను ప్రేమించిన రౌడీబేబీనే శౌర్య అని నిరుపమ్ కి తెలుస్తుందా, సౌందర్యకి జ్వాల ఏం సమాధానం చెబుతుంది!


అటు సాక్షిని డాక్టర్ చెకప్ చేస్తుంది. పొట్ట వాష్ చేశాం...కాస్త జాగ్రత్తగా చూసుకోండి అని చెబుతుంది. సాక్షికి ఏమైంది పెద్దమ్మా అని అడిగితే... సాక్షి సూసైడ్ చేసుకోవాలనుకుందని చెబుతుంది దేవయాని: నువ్వంటే ప్రేమ రిషి, నువ్వంటే తనకి ప్రాణం, పిచ్చి, పాపం మొదట్లో నిన్ను కాదనుకుని వెళ్లిపోయింది, తప్పో-ఒప్పో అయిందేదో అయిపోయింది, నువ్వే జీవితం అని నమ్మి ఇక్కడకు వచ్చింది. తను వెళ్లడం నీకు నచ్చలేదు, రావడం అస్సలు నచ్చలేదు, ఓ ఆడపిల్ల నీ వెంట పడుతోందని చులకన చేసేవాడివి కాదునువ్వు. కానీ తను నీ ఆస్తిపాస్తులపై ఆశతో రాలేదు కదా. నీ మీద ప్రేమతోనే నిన్ను కోరుకుంది. 
రిషి: నేను కాదన్నంత మాత్రాన ఇలా చేసుకోవాలా
దేవయాని: ఇంకేం చేయగలదు చెప్పు..వాళ్ల పేరేంట్స్ తో మనిటంటికి వచ్చింది, తనకి ఇష్టం లేకపోయినా లైబ్రరీలో బ్లాక్ మెయిల్ కూడా చేసింది, ఇంక నువ్వు తనకు దక్కవని తెలిసిపోయింది, అందుకే వేరే దారిలేక ఇలాంటి నిర్ణయం తీసుకుందేమో...నాన్నా రిషి నా మాట విను....మనం కోరుకున్న వారికన్నా మనల్ని కోరుకున్నవారితోనే జీవితం ఆనందంగా సాగిపోతుంది... నా మాట విని సాక్షిని.....
రిషి: ఇంకోసారి ఈ టాపిక్ మనమధ్య రావొద్దు...ఈ విషయంలో నా నిర్ణయం ఎప్పటికీ మారదు
దేవయాని: నీ నిర్ణయాన్ని మార్చుకోమని చెప్పను...తనను ప్రేమించకు, పెళ్లిచేసుకోకు...ఓ స్నేహితురాలిగా భావించు..తనని చూసి కోపం తెచ్చుకోకు..స్నేహంగా పలకరించు, పిచ్చిది సంతోషిస్తుంది.  చావు అంచుల వరకూ వెళ్లివచ్చింది. ప్రేమ-పెళ్లిని పక్కనపెట్టు..తనను ఓ మనిషిగా గుర్తించు. సమయం-సందర్భం చూసి నేనే తనకు సర్దిచెప్పి లండన్ పంపించేస్తాను. ఇంకెవరినైనా పెళ్లిచేసుకోమని చెబుతాను. సరే అని రిషి వెళ్లిపోగానే... లే సాక్షి అంటుంది దేవయాని. ( ఇదంతా దేవాయని-సాక్షి చేసిన కుట్ర)
మహేంద్ర: ఏంటి వదినా సాక్షి అంతపని చేసిందా
దేవయాని: బయటకు అలా ఉంటుంది కానీ సాక్షి సున్నితమైనది...
మహేంద్ర: మనసు సున్నితంగా ఉన్నప్పుడు చేసే పనులు కూడా సున్నితంగా ఉండాలి కదా
రిషి: ఎందుకు, ఏంటనే విశ్లేషనలు మనకు అనవసరం...ఇదో సున్నితమైన అంశం...పెద్దమ్మా ఆ సాక్షికి గట్టిగా చెప్పండి..ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దని...
జగతి, మహేంద్రని వెటకారంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది దేవయాని.....
జగతి: నా కేదో తేడా కొడుతోంది...
మహేంద్ర: ఇది సాక్షి-వదినగారు కలసి వేసిన ప్లాన్ అనిపిస్తోంది...


Also Read: ముదిరిన టామ్ అండ్ జెర్రీ వార్ - రిషిని రెస్టారెంట్ కి రమ్మన్న వసు, సాక్షితో కలసి వెళ్లి షాకిచ్చిన ఈగో మాస్టర్


రిషికి మెసేజ్ చేసిన వసుధార...ఏంటో ఈ మధ్య రిప్లైలు ఇవ్వడం లేదు అనుకుంటుంది.
రిషి: ఈ వసుధార ఏంటో అర్థంకాదు..ఏంటో ఈ మెసేజ్... ( టైం చెబుతానన్నారు, టైం ఇస్తానన్నారు, అందుకే గుర్తుచేస్తున్నాను అని ఉంటుంది). రిప్లై ఇచ్చేవరకూ ఇలాగే మెసేజెస్ తో దాడిచేస్తుందేమో..
వసుధార: వాయిస్ మెసేజ్ పంపించారంటూ ఓపెన్ చేస్తుంది.. చెబుతా అన్నాను కదా ఇంత తొందరెందుకు అని పంపిస్తాడు... సార్ సీరియస్ గా ఉన్నట్టున్నారనుకుని గుడ్ నైట్ చెబుతుంది.
రిషి: గతంలో వసుతో కలసి దిగిన ఫొటోస్ చూస్తూ అన్నీ గుర్తుచేసుకుంటాడు. నువ్వు నీ మనసు ఏం చెబుతున్నాయో అర్థంకావడం లేదు అనుకుంటాడు. నాకు కొత్త ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం చేశావ్, జ్ఞాపకాలు మిగిల్చావ్, బాధ పెట్టావ్, నాకు అన్నిరంగుల్ని పరిచయం చేశావ్...నేనేంటో నాకు అర్థం అయ్యేసరికి నువ్వేంటో అర్థం కాకుండా పోతున్నావ్...అసలు నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావా అని అనుకుంటాడు....అప్పుడే వసుధార నుంచికాల్ వస్తుంది...
వసు: ఏంటి సార్ పొద్దున్నే కాల్ చేసిందని ఆలోచిస్తున్నారా..ఈ రోజంతా నేను రెస్టారెంట్ డ్యూటీలోనే ఉంటాను సార్..ఈ విషయం మీకు చెప్పడానికే కాల్ చేశాను.. అని కట్ చేస్తుంది..
రిషి: ఏంటి నాకు కాల్ చేసి రెస్టారెంట్ లో ఉంటానని చెబితే ఏమనుకోవాలి... నేను మెసేజెస్ కి సరిగా రిప్లై ఇవ్వడం లేదని, కలుద్దాం అంటే టైం ఇవ్వడం లేదని ఇన్ డైరెక్ట్ గా రెస్టారెంట్ కి రమ్మంటోందా... రమ్మనగానే నేను వెళతానా, అసలు నువ్వు ఏమనుకుంటున్నావ్...నీకు చాలా క్లారిటీ ఇస్తాను చూడు అనుకుంటూ సాక్షికి కాల్ చేస్తాడు.....
సాక్షి: రిషి నాకు కాల్ చేస్తున్నాడా అని ఆశ్చర్యంతో కాల్ లిఫ్ట్ చేస్తుంది...చెప్పు రిషి అనగానే... నేను కాఫీ తాగడానికి రెస్టారెంట్ కి వెళుతున్నాను..నీ హెల్త్ జాగ్రత్త అని చెప్పేసి కట్ చేస్తాడు. దీంతో నన్ను రమ్మని చెప్పకనే చెప్పాడా అని ఫిక్సై...రెస్టారెంట్ కి బయలుదేరుతుంది.


Also Read: వసు వేసిన పూలదండ చూసి మురిసిన రిషి, పేపర్లో రిషిధార ఫొటో చూసిన దేవయాని-సాక్షికి షాకిచ్చిన జగతి-వసుధార


అటు వసుధార రెస్టారెంట్ డ్యూటీ చేస్తూ రిషి ఊహల్లో తేలుతుంటుంది వసుధార.  చేతిలో గులాబీ పట్టుకుని తనకు తెలియకుండానే లవ్ సింబల్ రాస్తుంది.  వీటిని చెడగొట్టడం ఎందుకు ఉండనిద్దాం అనుకుంటుంది. ఇంతలో రిషి అక్కడకు వస్తాడు. 
రిషి: నువ్వు ఇన్ డైరెక్ట్ గా రమ్మంటే వచ్చాను అనుకున్నావా...నేను కాఫీ తాగేందుకు వచ్చాను...


రేపటి( గురువారం) ఎపిసోడ్ లో
సాక్షి కాఫీ కావాలా జ్యూస్ కావాలా అని రిషి అడిగితే... నువ్వు ఏదంటే అదే అంటుంది సాక్షి. మనం సినిమాకు వెళదాం అని రిషిని ఒప్పిస్తుంది. అసలు సాక్షి ఇక్కడకు ఎందుకు వచ్చింది, రిషి సార్ రమ్మన్నారా...అయినా సినిమాకు వెళతారా-ఎలా వెళతారో నేనూ చూస్తాను అనుకుంటుంది.