గుప్పెడంతమనసు జులై 29 శుక్రవారం ఎపిసోడ్ (Guppedantha Manasu  July 29 Episode 515)


రిషి క్యాబిన్ కి వెళ్లిన వసుధార కుర్చీతో మాట్లాడుతుంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన రిషి లోపలకు రావొచ్చా అంటాడు. మీరేంటిసార్ నన్ను అడుగుతారని వసు అంటే..నీలోనువ్వే మాట్లాడుకుంటున్నావ్ కదా అందుకే అని రిప్లై ఇస్తాడు
రిషి: అక్కడ మీటింగ్ జరుగుతుంటే నువ్విక్కడ ఏం చేస్తున్నావ్
వసు: ఆనందం సార్..ఆనందం..
రిషి: ఎందుకో చెప్పు
వసు: గొప్ప ఆనందం కలిగితే చాటుగా వచ్చి మురిసిపోవాలి సార్..చాలా బావుంటుంది. ఎప్పుడైనా మీరుకూడా ట్రై చేయండి
( ఈ మీటింగ్ అయిపోయాక మీకు సూపర్ గిఫ్ట్ ఇస్తాను సరేనా అనుకుంటుంది)
రిషి: ఏంటలా చూస్తున్నావ్
వసు: మాట్లాడుతున్నాను సార్
రిషి: ఎవరితో
వసు: నాతో నేనే..మనసుతోమాట్లాడుతున్నాను
రిషి: నీకు మనసుకూడా ఉందా..సరేలే వెళదాం పద..వస్తావా రావా
రాకపోతే చేయిపట్టి లాక్కుపోతారా ఏంటి అని మనసులో అనుకుంటుంది వసుధార..ఇంతలో రిషి చేయిపట్టుకోవడంతో షాక్ అవుతుంది.నేను వస్తున్నాను కదా అని వసు అంటే..నువ్వు వచ్చేలా కనిపించడం లేదు పద..మన చదువుల పండుగ ఫెయిల్ అవకూడదు
వసు: నేను మిమ్మల్ని కూడా ఫెయిల్ అవనివ్వను..సక్సెస్ చేస్తాను..
వసుధార చేయి పట్టుకుని నడుస్తున్న రిషిని చూసి సాక్షి షాక్ అవుతుంది...ఇంతలో రిషి వసు చేయి వదిలేస్తాడు..
చదువుల పండుగ మీటింగ్ మనం సక్సెస్ చేయాలి పద వెళదాం సాక్షి అనేసి వసుధార వెళ్లిపోతుంది...


Also Read: రౌడీబేబిని ఎత్తుకున్న డాక్టర్ సాబ్, చెల్లుకు చెల్లు అంటూ షాకిచ్చిన శౌర్య


మీటింగ్ సందడి మొదలవుతుంది. రిషి-వసు ఒకర్నొకరు చూసుకంటూ ఉంటారు. అదంతా చూసిన దేవయాని చూడు సాక్షి వసుధార రిషి దృష్టిని ఎలా ఆకర్షిస్తోందో అంటాడు. ఇంతలో సాక్షి టిఫిన్ ప్లేట్ తీసుకెళ్లి రిషికి ఇస్తుంది. నాకు వద్దు సాక్షి అని రిషి అంటాడు. కొందరు మీకోసం ఎదురుచూస్తున్నారు మీరొస్తే తిందామని ఆగారని వసు అంటుంది
సాక్షి: నాన్సెన్స్ రిషి వాళ్లతో కలసి ఎందుకు తింటాడు
జగతి-మహేంద్ర: వీళ్లిద్దరి మధ్యా రిషి నలిగిపోతున్నాడు...
అరేయ్ గౌతమ్..అన్ని ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయా.. అన్నీజరుగుతున్నాయిరా.. నువ్వు అక్కడకు వచ్చి వాళ్లతో కలసి భోజనం చేస్తే బావుంటుందని గౌతమ్ అంటాడు. భోజనం చేస్తూ సరదాగా మాట్లాడితే రిషి సార్ మాతో సరదాగా ఉన్నాడని హ్యాపీగా ఫీలవుతారని క్లారిటీ ఇస్తాడు గౌతమ్..సరే అని వెళతాడు రిషి..


కాలేజీ బయట చెట్టుకింద కూర్చున్న వసుధార..అప్పుడు రిషి తనకు ఇచ్చిన గిఫ్ట్ తీసుకోపోవడంతో కిందపడి పగిలిపోతుంది. దాన్ని అతికించే పనిలో పడుతుంది. మీకు ఈ రోజు నేను ఇవ్వబోయే సర్ ప్రైజ్ ఇదే..మీరిచ్చిన గిఫ్ట్ మీకే ఇస్తున్నాను. రిషి సార్ ఇచ్చిన గిఫ్ట్ తిరిగి ఆయనకే ఇస్తున్నా..జీవితం పగిలిపోతే మళ్లీ రాదని అనుకుంటారు..కానీ తిరిగి అతికిస్తే ఎంత బావుందో చూడండి.. మీదెంతో అందమైన జీవితం అందులో నాకు చోటుకావాలి అనుకుంటుంది. వసు ఆ గిఫ్ట్ ని ప్యాక్ చేస్తుండగా రిషి వస్తాడు. రిషిని చూసి గిఫ్ట్ దాచేస్తుంది వసుధార 
రిషి: ఏంటసలు నువ్వు..చదువుల పండుగను పట్టించుకోవడం లేదా
వసు: అయిపోయింది కదా సార్..సక్సెస్ చేసేశాం కదా..చదువుల పండుగ స్టార్ట్ చేసి వదిలేయాలి..దానికి సంబంధించిన పనులు అవే జరుగుతాయి..
రిషి: ఏదో గిఫ్ట్ ఇస్తానన్నావ్..
వసు: ఇస్తాను సార్..సమయం సందర్భం ఉంటాయి కదా
రిషి: నువ్వు ఎప్పుడు గిఫ్ట్ ఇస్తావా అని ఎదురుచూడాలా
వసు: మీకెంత ఉత్సాహంగా ఉందో నాక్కూడా అంతే ఉత్సాహంగా ఉంది..
ఏదీ చూడనీ అని రిషి..ఆగండి అని వసుధార..ఇద్దరూ గిఫ్ట్ ఒకరిచేతిలోంచి మరొకరు లాక్కుంటారు..
ఓపెన్ చేసేందుకు ట్రై చేసిన రిషి..మధ్యలోనే ఆపేసి..సరే..నీకు నచ్చినప్పుడే ఇవ్వు అని తిరిగి ఇచ్చేస్తాడు..
ఇదంతా చూసి సాక్షి రగిలిపోతుంటుంది...గిఫ్ట్ నువ్వు ఇవ్వడం కాదు అద్భుతమైన గిఫ్ట్ నేనిస్తాను అనుకుంటుంది.


Also Read: అర్థరాత్రి దేవయాని ముందు బుక్కైపోయిన రిషి-వసు,వదిలేదేలే అంటున్న సాక్షి
అంతా మీటింగ్ రూమ్ లో ఉంటారు
సాక్షి ఇది నీకు జీవితంలో ఆఖరి అవకాశం..దీన్ని నువ్వు పోగొట్టుకోవద్దు అని చెబుతుంది దేవయాని. ఆఖరి బాల్ విసురుతున్నా ఆంటీ సక్సెస్ అవుతాను. ఇది నీ గెలుపు కాదు నా గెలుపు. ఏర్పాట్లు బాగా చేశారని అంతా పొగిడేస్తారు. వెళ్లి రిషికి కంగ్రాట్స్ చెప్పిన సాక్షి..నాక్కూడా ఆల్ ది బెస్ట్ చెప్పు అంటుంది. 
రిషి: నువ్వు కోరుకున్నది అందరి మంచి కోసమే అయితే తప్పకుండా జరుగుతుందంటాడు..
మీడియా వాళ్లు వచ్చి జగతి గురించి మాట్లాడుతుండగా ప్లీజ్ వెళ్లి కూర్చోండి అని పంపించేస్తాడు రిషి..
ఇంతలో సాక్షి..రిషికి వరుస మెసేజెస్ పెడుతుంది...ఏంటీ ఇన్నిసార్లు మెసేజెస్ వస్తున్నాయి చూడడం అవసరమా అనుకుంటాడు.
సాక్షి: నీకు నాకు ఉన్న దూరం ఈ రోజు తగ్గిపోతుందిలే అనుకుంటుంది..
అటు వసుధార రిషి కోసం తిరిగి అతికించిన గిఫ్ట్ ని బ్యాగులో పెట్టుకుని మీటింగ్ రూమ్ కి వెళుతుంది..
స్టేజ్ పై మాట్లాడిన రిషి..ఒక్కొక్కర్నీ స్టేజ్ పైకి ఆహ్వానిస్తాడు.. ఇంతలో లేచి నిల్చున్న సాక్షి..చదువుల పండుగ గురించి కొంచెం మాట్లాడాలి అని స్టేజ్ పైకి వెళుతుంది..
రిషి వచ్చి కూర్చోగానే అక్కడకు వచ్చిన వసుధార..ఈ గిఫ్ట్ మీకోసమే అని తీసి ఇస్తుంది.
అది చూసి రిషి షాక్ అవుతాడు..


Also Read: రాయలేని కవితలు అన్నీ కళ్లతోటి పలికిస్తున్నా అన్న వసు, పనిష్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైన రిషి