నా దృష్టిలో మాళవిక ఒక మనిషే కాదు. ఎప్పుడైతే కన్న బిడ్డని కాదనుకొని కోరికల కోసం వెళ్లిపోయిందో అప్పుడే నా దృష్టిలో మాళవిక మనిషి స్థానం నుంచి దిగజారిపోయింది. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు ఆ రెండింటికీ మాళవిక అర్హురాలు కాదని యష్ అంటాడు. వేద మాళవిక అన్న మాటలు తలుచుకుని బాధపడుతుంటే యష్ వచ్చి తన కాలికి తగిలిన దెబ్బకి మందు రాస్తాడు. నువ్వు చూడటానికి చాలా మెతకగా కనిపిస్తావ్ కానీ చాలా గట్టిదానివి.. కాలికి అంత పెద్ద దెబ్బ తగిలితే ఎలా నడవగాలిగావ్ నేను అయితే అలా చేయలేనని యష్ అంటే నా ఖుషి కోసం అని వేద అంటుంది. 'నా బిడ్డ కోసం ఎంత నొప్పైనా భరించడానికి సిద్ధమే. నా కడుపున బిడ్డని కనే నొప్పి ఎలాగూ ఆ భగవంతుడు నాకివ్వలేదు. కణేశం నా బిడ్డని కాపాడుకునే నొప్పైనా భరించాలి కదా. నేను బిడ్డని కనలేనని చాలామంది చాలాసార్లు అవమానించారు. భరించాను. ఈరోజు మాళవిక కూడా అదే మాట అన్నది అవి నా గుండెల్ని చీల్చాయి. ఖుషి నన్ను అమ్మ అని పిలిచింది.. నన్నే అమ్మగా కావాలని అనుకుంది. అందుకోసమే నేను మీ భార్యని అయ్యాను. అమ్మ స్థానంలో ఉండి ఖుషి కోసం బోనం ఎత్తే హక్కు కూడా నాకు లేదా. ఆ మాళవిక వదిలేసి వెళ్లిన బిడ్డ మీద హక్కు ఉంటుందా? నేను పెనవేసుకున్న బిడ్డ మీద నాకు హక్కు ఉండదా. ఎందుకంటే నేను ఖుషిని కడుపున మోసి కనలేదనా.. ఇదెక్కడి న్యాయం.. నా ప్రేమ, నా అమ్మ ప్రేమ నిజమైతే బోనం ముందే నేనే పెడతానని అది ఒక్కటే ఆలోచించాను మాళవికతో పోటీగా కాదు. అందుకే కాలికి తగిలిన గాయం గురించి ఆలోచించలేదు. అమ్మవారి మీద శ్రద్ధ, భక్తి, ప్రార్ధన.. ఈ మూడే ఆ అమ్మవారి దగ్గరకి నన్ను చేర్చింది. నన్ను అమ్మవారు దీవించింది అది చాలు నాకు' అని ఎమోషనల్ గా మాట్లాడుతుంది. అమ్మల్ని కన్న అమ్మే నిన్ను దీవించింది ఖుషికి నువ్వు కాక ఇంక అమ్మ ఎవరు వేద, ఖుషి నీ బిడ్డే. అమ్మ స్థానానికి నీ కంటే హక్కు అర్హత వేరే ఎవ్వరికీ ఉండదని యష్ చెప్తాడు.
Also Read: పగిలిన మాళవిక బోనం, వేద కాలికి గుచ్చుకున్న గాజుపెంకు - అమ్మవారు ఎవరిని ఆశీర్వదించారు?
జైల్లో ఉన్న ఖైలాష్ దగ్గరకి కాంచన వస్తుంది. నాలాంటి నష్ట జాతకురాలిని చేసుకోబట్టే మీకింత కష్టం వచ్చింది. నన్ను తప్ప వేరే ఆడదాన్ని చెల్లెలి లాగా చూస్తారు. అలాంటి మీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే అది నా వల్లే. నాలాంటి నష్టజాతకురాలిని పెళ్లి చేసుకోవడం వల్లే. అందుకే నా మీద నాకే చాలా కోపంగా ఉండి నన్ను క్షమించండి అని కాంచన ఖైలాష్ కాళ్ళ మీద పది ఏడుస్తుంది. 'నన్ను విడపించడానికి ఎటువంటి ప్రయత్నం చెయ్యకు. మీ అమ్మానాన్నలతో నిష్టూరంగా మాట్లాడి వాళ్ళ చేత మీ తమ్ముడిని గట్టిగా అడిగించి రిలీజ్ చేయించొద్దు. మీ తమ్ముడు తలుచుకుంటే నిమిషంలో నా మీద పెట్టిన కేసు విత్ డ్రా చేయొచ్చు.. నిమిషంలో నన్ను విడుదల చెయ్యొచ్చు. కానీ నా కోసం నువ్వు ఎవరి కాళ్ళ మీద పడి దిగజారవద్దు. నేను లేకపోతే చచ్చిపోతాను అని ఎవరి ముందు ఏడవొద్దు' అని ఖైలాష్ అంటాడు. నా కాంచన అలాంటి పనులు చెయ్యకూడదు, నువ్వు ఇక్కడికి వచ్చినట్టు కూడా ఎవరికి చెప్పకు. మా ఆయన భోజనం చేయకపోతే నేను ఇక్కడ ఎలా తినేది, అక్కడ మా ఆయన కటిక నెల మీద పడుకుంటే నేను ఇక్కడ పట్టు పరుపుల మీద ఎలా పడుకునేది, ఇంట్లో అందరూ హ్యాపీ గా ఉన్నారు నేను ఎలా మా ఆయన లేకుండా సంతోషంగా ఉండేది అని ఎవరితో అనకు అని కాంచనకి నూరిపోస్తాడు.
Also Read: ఆదిత్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్న రుక్మిణిని దేవి చూస్తుందా? తండ్రిపై ద్వేషంతో రగిలిపోతున్న దేవి
ఇంట్లో అందరూ సంతోషంగా తినేందుకు కూర్చుంటారు. కాంచన ఏది అని రత్నం మాలినిని అడుగుతాడు. ఎంత చెప్పినా గది దాటి బయటకి రాను అని చెప్పి ఏడుస్తుంది అని మాలిని చెప్తుంది. తనని నేను తీసుకుని వస్తాను అని వేద వెళ్తుంది. 'నా మీద కోపంగా ఉందా వదినా, నీ కోపంలో న్యాయం ఉంది, జరిగిన దాంట్లో అందరి కంటే ఎక్కువ నష్టం నీకే జరిగింది, కానీ నువ్వు భార్య స్థానంలో కాకుండా ఒక ఆడదాని స్థానంలో ఉండి ఆలోచించు, తన తప్పు తను తెలుసుకుని పశ్చాత్తాపడతానికి ఇదొక కారణం కావొచ్చు. నువ్వు ధైర్యంగా ఉండు నీకు అంతా మంచే జరుగుతుంది. జరిగేలా నేను చేస్తాను. నన్ను నమ్ము. మళ్ళీ అడుగుతున్నా జరిగినదానికి నన్ను క్షమించు' వదినా అని వేద అంటుంది. బయట అందరూ ఎదురు చూస్తున్నారు నువ్వు రా వదిన అని పిలుస్తుంది. రేయ్ యశోధర్ నన్నే జైల్లో పెడతావా.. నా మీద కేసు పెడతావా.. నీకు నాకు కచ్చితంగా యుద్ధం జరుగుతుంది. నిన్ను ఓడించేది, నన్ను గెలిపించేది నీ అక్కే అదే నా పెళ్ళాం అని ఖైలాష్ అంటాడు.
తరువాయి భాగంలో..
ఖైలాష్ చెప్పినట్టుగానే కాంచన ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అయ్యిందేదో అయ్యింది అదంతా మర్చిపోయి మనం హ్యాపీ గా ఉందాం కేసు వాపస్ తీసుకో నాన్న, ఖైలాష్ ని బయటకి తీసుకురా అని మాలిని యష్ ని అడుగుతుంది. ఖైలాష్ భవిష్యత్ ని నేను కాదు ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు అని యష్ చెప్తాడు.