మాలిని బోనం సిద్ధం చేసి ఖుషి, వేదకి ఇస్తుంది. ఇక మాలిని, ఖుషి, వేద ముగ్గురు బోనం ఎత్తుకుని అమ్మవారి గుడిలో నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడే మాళవిక బోనం ఎత్తుకుని వచ్చి వేద అని పిలుస్తుంది. ఏయ్ ఎందుకొచ్చావ్ ఎవరి కోసం బోనం ఎత్తుతున్నావ్ అని మాలిని మాళవికను అడుగుతుంది. నా బిడ్డ  ఖుషి కోసం అని మాళవిక అంటుంది. ఎవరే నీ బిడ్డ.. వదిలేసి పోయినప్పుడు ఏమైందే నీ బిడ్డ అని మాలిని తిడుతుంది. వద్దనుకున్న దానివి వద్దనుకున్నట్టు ఉండాలి.. మధ్యలో నా కూతుర్ని చూసి కుళ్ళుకుంటావెంటీ.. ఇప్పుడు ఖుషి అమ్మవి నువ్వు కాదు మా వేద అని సులోచన కోపంగా అంటుంది. అని మీరనుకుంటే సరిపోతుందా అయినా ఖుషికి వేద అమ్మ ఏంటి.. కడుపున మోసి కన్నదా.. ఏం వేద ఖుషికి నువ్వు అమ్మవా, నీ రక్తం పంచావా.. పేగు పంచావా.. బిడ్డల్ని కనే రాతే ఆ భగవంతుడు నీ నుదిటిన రాయలేదు.. నువ్వు కనని నీది కానీ బిడ్డని కౌగలించుకుంటే కన్నతల్లివి అయిపోతావా పిల్లల్ని కనలేని ఆడదాన్ని పేరంటానికే పిలవరు అలాంటిది నువ్వు ఏకంగా అమ్మవారికి బోనం ఎత్తుతావా.. నీ బోనం అమ్మవారు స్వీకరిస్తుంది అనుకుంటున్నవా అదంతా నీ భ్రమ.. నీ మొక్కు తీరే మొక్కు కాదు అని మాళవిక అంటుంది. నాలుక చీరేస్తాను నా కూతురు గురించి ఇంకొక్క మాట ఎక్కువ మాట్లాడితే అని సులోచన వార్నింగ్ ఇస్తుంది. 


Also Read: నీకిచ్చిన మాట కోసమే జానకిని చదివిస్తున్నా అని జ్ఞానంబతో చెప్పిన రామా


ఇప్పుడు నువ్వు నా కొడుక్కి భార్యవి కాదు మా ఇంటి కోడలివి కాదు కానీ నా మనవరాలికి తల్లివి అయిపోతావా ఏం అర్హత, ఏం హక్కు ఉంది నీకు అని మాలిని అంటుంది. కనుక్కుందాం.. తీర్చుకుందాం ఆవిడనే అడుగుదాం అని అక్కడ ఉన్న సోదమ్మని మాళవిక అడుగుతుంది. అమ్మా ఈ పాప కన్నతల్లిని ఇది కనకుండానే అమ్మ అనిపించుకుంటుది.. డూప్లికేట్ అమ్మ ఇది. మా పాప బాగుండాలని మొక్కు తీర్చుకునే  హక్కు కన్నతల్లికి ఉంటుందా.. తల్లి కానీ ఈ తల్లికి హక్కు ఉంటుందా అని అడుగుతుంది. 'ఎవరు తల్లి..  ఎవరు కాదు.. ఎవరిది పాశం.. ఎవరిది మోసం, ఎవరిది పేగుబంధం.. ఎవరిది ప్రేమ బంధం నిర్ణయించాల్సింది మనం కాదు ఆ అమ్మవారు. అమ్మవారి మీద నమ్మకం పెట్టి భక్తితో చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళండి ఎవరి పూజ ఫలించాలో ఏ మొక్కులు ఫలించాలో.. ఎవరి బోనం స్వీకరించాలో అమ్మే నిర్ణయిస్తుంది. బోనాల తల్లి సన్నిధికి మీ ఇద్దరిలో ఎవరి బోనం ముందు చేరితే వారికి అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుంది' అని ఆమె చెప్తుంది. వేద కంటే ముందే నేనే ముందు బోనం సమర్పిస్తాను.. కన్నతల్లి కే ఖుషి దక్కుతుంది అని అమ్మవారు ముందు నా బోనమే స్వీకరిస్తుందని మాళవిక అంటుంది. నాకు కావలసింది ఒక్కటే నా ఖుషి బాగుండాలి, ఖుషికి ఏది మేలు, ఎవరి వల్ల మేలు జరుగుతుంది, తను ఎవరిని అమ్మా అని పిలవాలో నిర్ణయించాల్సింది నువ్వే తల్లి అని వేద అమ్మవారిని వేడుకుంటుంది. ఖుషి తల్లిని నేనే అని ఆ తల్లి ఆశీర్వదిస్తుంది, నా బోనమే ముందు స్వీకరిస్తుంది అని వేద నమ్మకంగా చెప్తుంది. 


Also Read: నువ్వు తల్లివెంటీ అని మాళవికని అవమానించిన అభిమన్యు- యష్ ని ఆట పట్టించిన ఖుషి, వేద


ఇద్దరు బోనం ఎత్తుకుని అమ్మవారి సన్నిధికి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతూ ఉంటారు. అప్పుడే వేద కాలికి గాజు పెంకు గుచ్చుకుని రక్తం కారుతూ అల్లాడిపోతుంది. నొప్పిని భరిస్తూ వేద అలాగే వెళ్తుంది. అది చూసి యష్ బాధపడతాడు. మాళవిక మెట్లు ఎక్కుతూ ఉండగా తన బోనం కిందపడి పగిలిపోతుంది. వేద బోనం సమర్పించేందుకు వెళ్తుంది. మాళవిక అక్కడే నిలబడి ఏడుస్తూ ఉంటుంది. నా ఖుషికి మంచి అమ్మని ఇచ్చావ్, నాకు మంచి భార్యని ఇచ్చావ్, మా ఇంటికి మంచి కోడలిని ఇచ్చావ్.. వేదని చల్లగా చూడమ్మా అని యష్ అమ్మవారిని మొక్కుకుంటాడు. కాంచన భర్తని విడిపించి తను సంతోషంగా ఉండేలా చూడుతల్లి అని మాలిని మొక్కుకుంటుంది. మా మమ్మీడాడీ ఎప్పుడు గొడవపడకుండా కలిసి ఉండేలా చూడమని  ఖుషి వేడుకుంటుంది.  బోనం తీసుకున్న అమ్మవారు నిన్ను దీవిస్తుంది అనుకుంటున్నవా, ఖుషి ఎప్పటికీ నీకే సొంతం అవుతుంది అనుకుంటున్నవా నెవర్ ఈరోజు నీ చేతుల్లో నేను ఓడిపోయి ఉండొచ్చు ప్రతి సారి నీది గెలుపు కాదు ఖుషి నా పేగు పంచుకున్న నా బిడ్డ, నా నెత్తురు నా ప్రాణం అని మాళవిక అంటుంది. కాదని నేను అన్నాన ఖుషిని నేను నీ దగ్గర నుంచి లాక్కున్నాన్న లేకపోతే నువ్వు వదిలేసి వెళ్లిపోతే నేను అక్కున చేర్చుకున్నాన..  ఏది నిజం చెప్పు మాళవిక అని వేద అడుగుతుంది. సమాధానం చెప్పావ్ ఎందుకంటే తప్పు చేసింది నువ్వు.. తట్టుకోలేకపోతున్నావ్ నీ బోనం పగిలిపోయిందని నీ మొక్కు ముక్కలైందని కానీ నీకు తెలియనిది ఏంటంటే బోనం ఎత్తాలసింది భక్తితో పోటీతో కాదు. పోటీ ఉండాల్సింది. నువ్వు ఖుషిని పారేసి వెళ్ళినప్పుడు నీలో పాశం లేదు ఇప్పుడు కావాలనుకున్నపుడు నీలో మోసం ఉంది.. నా మీద అక్కసు అసూయ ఉంది అబద్ధమా. నువ్వు మళ్ళీ తల్లి స్థానం కోసం తాపాత్రయపడటం వెనక నిజాయితీ లేదు దుర్మార్గం ఉంది అది ఈరోజు అమ్మవారే నిరూపించింది. ఇప్పటికైనా తెలుసుకో తల్లి అంటే పేగు కాదు పాశం.. పంతం కాదు బంధం అని వేద అంటుంది.  


తరువాయి భాగంలో.. 


కాలికి గాజు పెంకు గుచ్చుకోవడంతో బాధతో అల్లడిపోతుంది వేద. అది చూసి యష్ వచ్చి తన కాలికి కట్టు కడతాడు. ఇంత నొప్పి ఎలా భరించగలిగావ్ అని యష్ అడుగుతాడు. నా ఖుషి కోసం అంటుంది. నువ్వు బెస్ట్ మదర్.. అమ్మ అంటే దానికి అర్థం నువ్వు అని అంటాడు.