తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలని, చిన్న పనికే లక్షల్లో సంపాదన అంటూ అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తుంటారు కొందరు కేటుగాళ్లు. మణి గిన్నెలు ఇంట్లో ఉంచుకుంటే మంచిదని నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న కేటుగాళ్ల ఆట కట్టించారు అనంతపురం పోలీసులు. గత కొన్ని రోజులుగా నమోదైన కేసుల విచారణలో భాగంగా అమాయక ప్రజలను మోసం చేస్తున్న గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు.


నెల్లూరు నుంచి వచ్చి మోసాలు..
పోలీసుల కథనం ప్రకారం.. మణి గిన్నెలు ఇంట్లో ఉంచుకుంటే మంచిదని ప్రజలను నిందితులు నమ్మిస్తున్నారు. వారి వద్ద నుంచి లక్షలాది రూపాయలకు టోకరా వేస్తున్నట్లు సమాచారం అందింది. నెల్లూరు జిల్లా నుంచి అనంతపురం పట్టణానికి వచ్చిన కేటుగాళ్లు.. ఇక్కడ కొంతమంది అమాయక ప్రజలకు గాలం వేసే ప్రయత్నంలో ఉన్నారు. పక్కా సమాచారం అందుకున్న అనంత పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా మోసగాళ్ల ముఠాను అరెస్టు చేశారు. ఐదుగురు నిందితులతో పాటు రెండు రాగి నాణేలు, మూడు నకిలీ మణిగిన్నెలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
గ్యాంగ్ లీడర్ అతడే..
నెల్లూరు పట్టణానికి చెందిన షేక్ మైనుద్దీన్ ఈ టీంకు గ్యాంగ్ లీడర్ గా వ్యవహరిస్తున్నాడు. నంద్యాల జిల్లా బేతంచెర్ల కు చెందిన సయ్యద్ మహమ్మద్ ఇలియాజ్, బనగానపల్లి వాసి ఎం.అబ్దుల్ రసూల్,  విజయవాడకు చెందిన కండి శివన్నారాయణ రెడ్డి,  కోట కిరణ్ కుమార్ లను అరెస్టు చేశారు. అరెస్టు వివరాలను అనంతపురం అడిషనల్ ఎస్పీ అయి నాగేంద్రుడు మీడియా సమావేశంలో వివరించారు షేక్ మైనుద్దీన్ మొదట వెండి సామాన్ల విక్రయ సాలను నిర్వహించేవాడని వ్యాపారంలో నష్టాలు రావడంతో అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలన్న దురుద్దేశంతో నకిలీ మణిగిన్నెలను తయారు చేయడం మొదలుపెట్టినట్లు ఆయన వెల్లడించారు. 


దేవతల ప్రతిమలను నకిలీ మణిగిన్నెలపై అమర్చి మధ్యలో క్వాడ్జ్ రాయిని ఉంచి వెనుక వైపు రెండు బ్యాటరీలను ఏర్పాటు చేశారని తెలిపారు. దీంతో గిన్నెలోకి నీరు పోయగానే ఆకుపచ్చ, ఎరుపు రంగులోకి మారిపోతుండటంతో సులభంగా ప్రజలు నమ్మే నమ్మి భారీగా నష్టపోయినట్లు ఆయన మీడియాకు తెలిపారు. నెల్లూరు నుంచి అనంతపురం పట్టణానికి వచ్చి మోసానికి పాల్పడబోతున్నట్లు తమకు పక్క సమాచారం రావడంతో ప్రత్యేక బృందాలు ఏర్పడి ఉంటాను అరెస్టు చేసినట్లు చెప్పారు. 


ప్రత్యేక పోలీస్ బృందాలకు అనంతపురం ఇంఛార్జి డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు సీసీఎస్ డీఎస్పీ ఎస్ మహబూబ్ బాషా నేతృత్వం వహించారన్నారు. ప్రత్యేక పోలీస్ టీమ్ లలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు రవిశంకర్ రెడ్డి, నాగ శేఖర్ అలాగే ఏఎస్ఐలు రమేష్ , విజయభాస్కర్,  వెంకటేష్, రామకృష్ణ లతోపాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారని ఏఎస్పీ నాగేంద్రుడు వెల్లడించారు. ప్రజల అప్రమత్తంగా ఉండి ఇలాంటి మోసాలకు పాల్పడే ముఠాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజల అమాయకత్వం, డబ్బు మీద ఆశనే నిందితులకు మార్గంగా మారుతుందని, ఇలాంటివి నమ్మవద్దని హెచ్చరించారు.
Also Read: Sai Priya Episode : సాయిప్రియ కేసులో మరో ట్విస్ట్‌- బతకాలని ఉందంటూ పేరెంట్స్‌కు మెసేజ్‌