గుప్పెడంతమనసు జులై 22 శుక్రవారం ఎపిసోడ్ (Guppedantha Manasu  July 22 Episode 509)


క్లాస్ రూమ్ లోకి వెళ్లిన రిషిని చూడకుండా ఏదోదో మాట్లాడేస్తుంది వసుధార. ఆ తర్వాత పుష్ప ఫోన్ రింగవడంతో అక్కడి నుంచి వెళ్లమని సైగ చేసిన రిషి...పుష్ప వెళ్లగానే చేతిలో ఉన్న గులాబీ తీసి వసుధార ముందు పెట్టేసి వెళ్లిపోతూ ఆల్ ది బెస్ట్ అని మెసేజ్ చేస్తాడు. ఆ గులాబీ చూసి వసుధార మురిసిపోతుంటుంది. 
జగతి-మహేంద్ర కాలేజీలో క్యాబిన్లోంచి బయటకు వస్తూ.. ఈ చదువుల పండుగ సమ్మిట్ ముగిసేసరికి వసు-రిషి కలవాలి అనుకుంటారు. ఎప్పటిలా వాళ్లిద్దరూ కలవాలంటే మనమే ఏదో ఒకటి చేయాలి అనుకుంటారు. వసుని అసిస్టెంట్ గా తీసుకోమని రిషికి నచ్చచెబుదాం అని మహేంద్ర అంటే సరే అంటుంది జగతి..
అటు దేవయానికి కాల్ చేసిన సాక్షి... ఈ ఎడ్యుకేషన్ సమ్మిట్లో తనకి అసిస్టెంట్ గా నన్ను తీసుకోమని చెప్పండి అంటుంది. దేవయాని సరే అని మాటిస్తుంది. 
కాలేజీలో మెట్లపై కూర్చుని చదువుకుంటున్న వసుధార దగ్గరకు వచ్చిన గౌతమ్.. కొన్ని బ్యాడ్జీలు తీసుకొచ్చి ఎలా ఉన్నాయో చూడు అంటాడు. అప్పుడే అక్కడకు వస్తాడు రిషి. 
గౌతమ్: నువ్వు ప్రతిదాంట్లో పాజిటివ్ నెస్ వెతుక్కుంటావ్ కదా... అప్పుడే అక్కడకు వచ్చిన రిషిని చూసి వీడు ఏదో ఒకటి అనకుండా ఉండడు అనుకుంటాడు.
రిషి: ఇక్కడేం చేస్తున్నావ్
గౌతమ్: నేను కూడా పని చేస్తున్నానోయ్..
రిషి: చదువుల పండుగకు మనకు కాన్ఫరెన్స్ హాల్ ఉంది..మెట్లపై కూర్చుని కాలక్షేపం కబుర్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు..
గౌతమ్: ఏంటి సార్..రిషి సార్ అలా అన్నారని మాత్రం అడగకు నాకు సంబంధం లేదు..నువ్వే వెళ్లి బ్యాడ్జెస్ గురించి వాడికి చెప్పెయ్ అనేసి వెళ్లిపోతాడు..


Also Read: కార్తీక్,దీప రీఎంట్రీ పక్కా - నిరుపమ్ తో శౌర్య పెళ్లిచేసేందుకు ఒక్కటైన హిమ-ప్రేమ్


రిషి క్యాబిన్ కి వెళుతుంది వసుధార...
క్యాబిన్ బయటే నిల్చుని ఆలోచిస్తున్న వసుని చూసి..హలో అని పిలుస్తాడు రిషి.. అయితే లోపలకురా లేదంటే బయటకు వెళ్లు..నువ్వు అక్కడే నిల్చుంటే ఏదో పనిష్మెంట్ ఇచ్చా అనుకుంటారు అంటాడు రిషి
వసు: బ్యాడ్జెస్ అన్నీ రిషి ఎదురుగా పెట్టి ఎలా ఉన్నాయ్ సార్..మీకు ఓకే కదా
రిషి: ఇప్పుడు ఓ కారు కొనుక్కోవాలంటే ఏం చేస్తారు
వసు: వెళ్లి కొనుక్కుంటారు..
రిషి: అంత సింపిల్ గా చెప్పేస్తారేంటి
వసు: టెస్ట్ డ్రైవింగా సార్..
రిషి: అర్థమైందా..
వసు: అంటే బ్యాడ్జెస్ పెట్టి చూపించాలా..ఆగండి పుష్పని పిలుస్తాను
రిషి: పుష్ప, షీలాని పిలవొద్దులే అంటాడు
సూట్ వేసుకోండి అని చెప్పి రిషికి వసుధార బ్యాడ్జ్ పెడుతుండగా అక్కడవు వస్తుంది సాక్షి.
గుచ్చుకుంటోంది చూసుకోవచ్చు కదా అన్న రిషి..ఒక్కోసారి చూసుకుని కూడా గుచ్చుతారు అంటాడు.. మీ మనసుకి అయిన గాయాన్ని నేనే తగ్గిస్తాను అంటుంది వసుధార...
సాక్షి: ఈ వసుధార ఉన్నంత వరకూ నేను రిషిని చేరుకోలేను అనుకుంటుంది
రిషి కోటు తీసి వసుధారకి వేస్తాడు...( ఇదంతా చూసి సాక్షి రగిలిపోతుంది)
కోటులో నేనెలా ఉన్నాన్ సార్ అంటే.. బ్యాడ్జి కదా చూడాలి అన్న రిషి..బానే ఉందంటాడు..
త్వరలోనే నా మనసేంటో మీకు తెలిసేలా చేస్తాను అనుకుంటుంది వసుధార
సాక్షి: వీళ్లిద్దరూ మళ్లీ దగ్గరవుతున్నారు..దూరం పెంచాలి..పెంచాలి కాదు పెంచుతాను..


Also Read: అలలెగసే కలవరమాయె తనలో నిను చూసే - సరికొత్తగా మళ్లీ వసుకి ప్రపోజ్ చేసిన రిషి


అంతా మీటింగ్ హాల్ లో కూర్చుంటారు..నేను లీడ్ చేయబోయే టీమ్ కి అసిస్టెంట్ గా వసుధార-సాక్షి ఇద్దరూ పోటీ పడుతున్నారు. 
మహేంద్ర: ఒక్కరు సరిపోతారు కదా
రిషి: ఓ స్థానానికి ఇద్దరిలో ఎవరు సరిపోతారో చిన్న పరీక్ష ద్వారా ఎంపిక చేద్దాం అనుకుంటున్నాను. మూడు లెవెల్స్ లో ఒకర్ని ది బెస్ట్ గా సెలెక్ట్ చేద్దాం...ఇందుకు మీరంతా సహకరించాలి. అందరి ఓట్ల ద్వారా సెలెక్ట్ చేద్దాం..మూడు ప్రశ్నలు ఇద్దర్నీ అడుగుతాను..వారు చెప్పే సమాధానం మీకు నచ్చితే చేయెత్తి ఓటేయండి..లేదంటే చేయి ఎత్తకండి. 
గౌతమ్: ఇంత ప్రాసెస్ అవసరమా..నీకు నచ్చిన వారిని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా
రిషి: ఇద్దరిలో ఏ ఒక్కరినీ అగౌరవ పరచడం ఇష్టం లేదు
సాక్షి: ఈ వసుకి నాకున్నంత చదువు లేదు..నాకున్నంత నాలెడ్జ్ లేదు..తప్పకుండా నేనే గెలుస్తాను
రిషి మొదటి ప్రశ్న: జీవితం అంటే ఏంటి?
సాక్షి: జీవితం అంటే ప్రయాణం, ఓ నది ప్రవహించినట్టు గెలుపు ఓటములు చూస్తూ పయనించడమే 
వసు: జీవితం అంటే నిర్వచనం లేదు..జీవితం అంటే పోరాటం, జ్ఞాపకాల పూలగుచ్చం, కష్ట సుఖాలను సమానంగా స్వీకరించడం
రిషి రెండో ప్రశ్న: ప్రపంచంలో స్వచ్ఛమైన నిస్వార్థమైన ప్రేమ ఎవరిది
సాక్షి: తల్లి ప్రేమ నిజమైనది, నిస్వార్థమైనది
ఎపిసోడ్ ముగిసింది...
Also Read: ఎట్టకేలకు రిషికి 'ఐ లవ్ యూ' చెప్పేసిన వసుధార, సాక్షిని ఆడేసుకున్న గౌతమ్