గుప్పెడంతమనసు ఫిబ్రవరి 18 ఎపిసోడ్ (Guppedanta Manasu February 18th Update)


ఏం జరిగిందో మొత్తం తెలుసుకున్న రిషి..వసుపై సీరియస్ అవుతాడు. ఇన్నాళ్లూ ఎందుకు దాచావ్ అని నిలదీస్తాడు. ఇంతలో వసు కళ్లు తిరిగిపడిపోతే తీసుకెళ్లి కార్లో కూర్చోబెడతాడు. కాసేపటి లేస్తుంది..ఇంతలో రిషికి వెక్కిళ్లు రావడంతో కారుదిగి వెళ్లి వాటర్ బాటిల్ తీసుకొస్తుంది. 
రిషి:ఇందాక కళ్ళు తిరిగి పడిపోయావు కదా ఇప్పుడు వెళ్లడం అవసరమా ఎందుకు ఇంత మొండితనం 
వసు:ప్రేమ సార్ 
రిషి:మరి అంత ప్రేమ ఉంటే ఎందుకు నన్ను ఇన్నాళ్లు ఏడిపించావు 
వసు:మీరే కాదు నేను కూడా చాలా బాధపడ్డాను 
ఆ తర్వాత వసుధార ఒకచోట కారు ఆపమని చెప్పి కారు దిగి... థ్యాంక్స్ చెప్పను ఎందుకంటే మా ఎండీ గారికి ముక్కుమీద కోపం 
రిషి: తప్పులన్నీ మీ ఎండీగారివేనా మీరు చేయలేదా
వసు: ఏమో సార్ మా ఎండీ గారితో జీవితాంతం కలిసి ప్రయాణం చేయాలని ఉంది అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతుంది 
ఆ తర్వాత  ఓ చోటుకి వెళ్లిన రిషి వసుధార మాటలు, వసుధారని హగ్ చేసుకున్న విషయం తలుచుకుని మురిసిపోతాడు. 
రిషి: మిస్టర్ రిషేంద్ర భూషణ్ వసుధార నీదే తను ఎవరిని పెళ్లి చేసుకోలేదు అనుకుంటూ గట్టిగా అరుస్తూ సంతోష పడుతాడు 


Also Read: వసు-రిషి కలసిపోయారు, ఇప్పటి వరకూ ఓ లెక్క ఇకపై మరో లెక్క!


మరోవైపు ధరణి కిచెన్లోకి వెళుతుండగా దేవయాని అక్కడ కూర్చుని ఉండడంతో ఈవిడకు కనిపిస్తే ఏదో ఒకటి అంటుంది అని దొంగ చాటుగా వెళుతుండగా దేవయాని గమనించేసి..ఏంటి వెనుకనుంచి వెళుతున్నావ్ వెన్నుపోటు వేద్దామనా... చాటుగా వెళతావేంటి ఇటురా అని నిలదీస్తుంది. అప్పుడు దేవయాని అడిగే ప్రశ్నలకు తింగరిగా సమాధానం చెబుతుంటుంది. ఇంతలో రిషి అత్యంత సంతోషంగా అక్కడకు వస్తాడు. ఏంటి ఇంత సంతోషంగా ఉన్నాడని మనసులో అనుకుంటుంది దేవయాని.
రిషి: ఏంటి వదిన ఈ మధ్య మీతో మాట్లాడలేదు.. అప్పుడప్పుడు కాలేజీకి రండి వదినా..మీకు ఇంట్లో బోర్ గా ఉంటే చెప్పండి కాలేజీకి రండి అక్కడ జాబ్ చేసుకోండి 
దేవయాని: షాక్ అయిన దేవయాని..అంతపని చేయకు...ధరణి కాలేజీకి వస్తే నాకు ఇబ్బంది అవుతుంది కదా...
రిషి: రానివ్వండి వదినకు కూడా బావుంటుంది
దేవయాని: ఏంటి రిషి చాలా కొత్తగా కనిపిస్తున్నావు
రిషి: నాకు కూడా కొత్తగానే ఉంది పెద్దమ్మ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. 


మరొకవైపు జగతి, మహేంద్ర వాళ్లు వసుధార వాళ్ళ ఇంట్లో కాఫీ తాగుతూ ఉంటారు. అప్పుడు మహేంద్ర ఈ సంతోష సమయాన్ని మనం పార్టీ చేసుకోవాలి అని అంటాడు. రిషి నువ్వు కలిసిపోయినట్టేనా అనడంతో నిజం తెలిసింది కానీ రిషి సార్ నామీద ఇంకా కోపంగా ఉన్నాడు సార్ అని అంటుంది వసుధార. రిషి మామూలే అమ్మ లోపల ప్రేమ గా ఉంటాడు కానీ బయటికి మాత్రం నటిస్తూ ఉంటాడు  అంటాడు మహేంద్ర. మనకు నిజం తెలిసిన కూడా చెప్పలేకపోయాను కానీ ఇప్పుడు రిషి నిజం తెలుసుకున్నాడు అదే చాలు అనగానే ఇంతలో రిషి అక్కడికి క్లాప్స్ కొడుతూ వస్తాడు. 


Also Read: ఫిబ్రవరి 18 రాశిఫలాలు , మహా శివరాత్రి ఈ రాశులవారికి కొత్త ఆలోచనలు కలిగిస్తుంది, ఆదాయం మెరుగుపడుతుంది


రిషి: ‍‍‍వసు తన మెడలో తానే తాళి వేసుకుందన్న విషయం మీ అందరికీ ముందే తెలిసి కూడా నా దగ్గర అబద్దాలు ఆడారా మీరందరూ బాగా నటించారు అని అంటాడు రిషి.మీరందరూ నిజం తెలిసి కూడా చెప్పకపోవడంతో నేను పిచ్చోన్ని అయ్యాను. మీరందరూ గొప్ప నటీనటులు మీ అందరికీ తెలిసి కూడా నాకు నిజం చెప్పలేదు.


ఎవరూ ఏమీమాట్లాడకుండా మౌనంగా తలదించుకుంటారు. అప్పుడు రిషి అందర్నీ కలిసి నిలదీస్తాడు.
రిషి: జగతిని ఉద్దేశిస్తూ..అంత బాధ పడుతున్నాడు నిజం చెప్పి తన బాధను తగ్గిద్దామని మీకు అనిపించలేదా మేడం 
జగతి మాట్లాడేందుకు ప్రయత్నించినా రిషి అస్సలు వినడు . నేను ప్రతి ఒక్క విషయంలో మిమ్మల్ని గౌరవంగానే చూస్తున్నాను కదా మేడం అలాంటప్పుడు నా దగ్గర నిజం దాచాలని ఎలా అనిపించింది అని బాధగా మాట్లాడుతాడు. నాకు ప్రతిఫలంగా మీరు ఇచ్చిన గిఫ్ట్ ఇదేనా మేడం . మీరు కూడా నా దగ్గర నిజం దాచారా సార్ అని చక్రపాణి ని అంటాడు. అప్పుడు రిషి వసుధారని అపార్థం చేసుకుంటూ ఓహో నువ్వు దాపరికాలు వీళ్లకు కూడా అంటగట్టావా అని అనడంతో వసుధార షాక్ అవుతుంది. అంతలా బాధపడుతుంటే మీరందరూ లోలోపల సంతోషపడ్డారు కదా ఇదేం రాక్షస ఆనందం అని అనడంతో అందరూ షాక్ అవుతారు. నా మనసుకు గాయం అయింది అందరూ కలిసి నా మనసుకు గాయం చేశారు నా మనసును బాధపెట్టారు. వసుధార నీ మెడలో తాళి ఎవరు కట్టారు అని కొన్ని వందలసార్లు అడిగాను ఏవేవో సమాధానం చెప్పింది. నాకు పరీక్షలు పెట్టింది అని బాధగా మాట్లాడుతాడు. మీరందరూ కూడా నా కళ్ళకు గంతలు కట్టి ఒక ఆట ఆడుకున్నారంటూ.. ‍‍‍‍‍‍‍‍వసుధార తన మెడలో వేసుకున్న తాళిని మీరు సమర్థిస్తున్నారా అనడంతో..‍అంతా మౌనంగా తలదించుకుంటారు...