గుప్పెడంతమనసు ఫిబ్రవరి 17 ఎపిసోడ్ (Guppedanta Manasu February 17th Update)


వసుధార అమ్మవారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాలు తలుచుకుని బాధపడుతుంటుంది. ఇదంతా తనకోసమే కదా చేశాను అయినా అర్థం చేసుకోవడం లేదు నా బాధ ఎవరికి చెప్పుకోవాలి. ప్రతి చిన్న విషయంలో నన్ను అర్థం చేసుకునే రిషి సార్ ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారు. నా సంతోషమైన దుఃఖమైనా నీతోనే కదా నేను పంచుకునేది అని బాధపడుతూ అక్కడున్న పసుపు, కుంకుమతో రిషిధార అని రాస్తుంది. రిషి సార్ కి నిజం చెప్పాలంటే భయం వేస్తోంది అందుకే ఇలా రకరకాలుగా ప్రయత్నిస్తున్నాను...రిషి సార్ కి నిజం తెలిసిందో లేదో ఇంకా ఈ వేదన ఎన్నాళ్లు..ఈ దోబూచులాట ఎన్నాళ్లు రిషి సార్ ని నువ్వే మార్చాలి తల్లీ..తను నిజం తెలుసుకుని వసుధారా అంటూ నా దగ్గరకు రావాలి ఆపని నువ్వే చేయాలి అని వేడుకుంటుంది..ఇంతలో వసుధారా అని రిషి పిలుపు వినిపిస్తుంది...ఇద్దరూ కాసేపు ఒకర్నొకరు ప్రేమగా చూసుకుని హగ్ చేసుకుంటారు. 
రిషి: ఓ నిజం తెలుసుకునేందుకు ఇన్నాళ్లు పట్టిందేంటి..ఇన్నాళ్లు ఎందుకు ఆగాలి..ఎందుకిలా చేశావ్
వసు: మీ కోసమే సార్
రిషి: నాకోసమే అయితే నాకెందుకు చెప్పలేదు..ఏంటీ దాగుడుమూతలు
వసు: నేను దాచలేదు..
రిషి:  ఇన్ని రోజులు నా ఎమోషన్స్ తో, నా మనసుతో, నా ప్రేమతో ఆడుకున్నావు ..ఇలా ఎందుకు 
వసు: అసలు ఆరోజు ఏమైందంటే..అంటూ..జరిగినదంతా చెబుతుంది
రిషి: అంతా విని షాక్ అయిన రిషి...మన మధ్య దాపరికాలు ఉండవు అనుకున్నాను. నీ సైడ్ నుంచి నువ్వు కరెక్ట్ గానే చేసి నన్ను చేతగాని వాడివి చేశావు కాలేజీలో వసుధార పెళ్లి చేసుకుంది అని ప్రతి ఒక్కరు అన్నప్పుడల్లా రంపంతో నా గుండె కోసినట్టు అయింది  అయినా నీ చేతులతో నువ్వు తాళి కట్టుకోవడం ఏంటి వసుధారా
వసు: నేనే వేసుకున్నాను కానీ ఇది మీరు వేసినట్టుగా భావించాను 
రిషి: వసుపై కోప్పడిన రిషి..అన్నీ నీ అంతట నువ్వు చేశావు కానీ నేను నరకం అనుభవించాను 
వసు: మెడలో తాళి చూపించి ఇది మీ చేతులతో మీరే ఇచ్చారు అనడంతో అప్పుడు రిషి ఆశ్చర్యపోతాడు
అప్పుడు రిషి నువ్వు చేసింది ముమ్మాటికి తప్పు తప్పే అని అరుస్తుంటాడు..ఇంతలో వసు కళ్లు తిరిగిపడిపోతుంది. 


Also Read: హమ్మయ్య మబ్బులు విడిపోయాయ్ - రిషిధారగా మారిన వసుధార


ధరణి లగ్నపత్రిక తీసుకొని వెళ్తుండగా ఏంటది అనడంతో తెలిసినవారు శుభలేఖ ఇచ్చారు అని అంటుంది. అప్పుడు దేవయాని జగతి మహేంద్ర వాళ్లు రావడం గమనించి  అంతా బాగుంటే ఈపాటికి రిషి పెళ్లికి శుభలేఖలు చేయించే వాళ్ళం కదా అనడంతో జగతి,మహేంద్ర అక్కడికి వెళ్లి దేవయానికి సెటైర్స్ వేస్తుంటారు. త్వరలో శుభలేఖలు ప్రింట్ అయ్యేలా అందులో రిషి పేరు ఉండేలా చేయి దేవుడా అని మహేంద్ర అంటే..మరి రెండో పేరు అని ధరణి అనడంతో..అది దేవుడు డిసైడ్ చేస్తాడులే ధరణి అని సెటైర్స్ వేస్తుంటాడు. మీ ప్లానేంటో నాకు అర్థంకావడం లేదని దేవయాని అనడంతో.. ప్లాన్స్ వేయడాలు, మనుషులను పురమాయించడాలు నాకు అలవాటు లేదు ఏం జగతి అని మహేంద్ర అంటే...అవును మహేంద్ర అంటుంది జదతి. ఇప్పటివరకూ చేసింది చాలు..రిషి పెళ్లిగురించి ఆలోచించడం మానేయండి అంటుంది దేవయాని. తన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దాలో నాకు తెలుసు అనేసి అక్కడినుంచి వెళ్లిపోతుంది... 


Also Read:  తన భర్త అంటూ అద్దంలో చూపించినా అర్థం చేసుకోని రిషి, వసు మెడలో తాళినుంచి బయటపడిన 'VR' ఉంగరం


మరోవైపు రిషి కారులో వసుధారని తీసుకెళ్తూ.. ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర  ఎలా దాచావు వసుధార అనుకుంటూ ఉంటాడు. తర్వాత రిషి ఒక సైడ్ కి కారు ఆపి ఏంటి వసుధార పడిపోయావు అనడంతో టెన్షన్ లో పడిపోయాను సార్ అని అంటుంది. అప్పుడు పర్లేదు సార్ అని అనడంతో అప్పుడు రిషి బయలుదేరాలి అని చూస్తుండగా వెక్కిళ్లు రావడంతో వసుధార వాటర్ బాటిల్ ఇస్తుంది...వారి ప్రయాణం సాగుతుంది...