గుప్పెడంతమనసు ఫిబ్రవరి 16 ఎపిసోడ్ (Guppedanta Manasu February 16th Update)


లైబ్రరీలో బుక్స్ వెతుక్కుంటూ ఉంటారు రిషి-వసు.. ఇంతలో కిందపడిన బుక్స్ తీస్తుండగా వసుధార మెడలో తాళి బయటపడుతుంది..దానికి వీఆర్ అని గతంలో రిషి ఇచ్చిన ఉంగరం ఉంటుంది. ఏవో బుక్స్ చూస్తుండగా అటువైపు నిల్చున్న వసుమెడలో ఉన్న VR ఉంగరం చూసి షాక్ అవుతాడు. వసు అలా నడిచి వెళ్లిపోతుండగా..నమ్మకం కుదరక అలాగే వెంటపడి చూసి పరుగున వెళ్లి వసు ఎదురుగా నిలి వసు మెడలో తాళిచూస్తూ అలాగే నిల్చుండిపోతాడు. కాసేపటి తర్వాత వసుధార లైబ్రరీ నుంచి బయటకు వెళ్లిపోతుండగా..వెనుకే వెళ్లి రిషి చేయి పట్టుకుంటాడు...
రిషి: ఏంటది
వసు: ఏది సార్
రిషి: ఆ VR అనే ఉంగరం అక్కడ ఎందుకుంది
వసు: నా మెడలోకి ఈ ఉంగరం నా ఇష్టం లేకుండా రాదుకదా సార్
అయినా...అని రిషి ఏదో చెప్పబోతుండగా...ఇంతలో లైబ్రేరియన్ వచ్చి మీరు ఎప్పటినుంచో అడుగుతున్న బుక్స్ వచ్చయని చెబుతాడు...వసు కాలేజీ నుంచి ఆటోలో వెళ్లిపోతూ రిషి అన్న మాటలు (ఆ VR అనే ఉంగరం అక్కడ ఎందుకుంది) తలుచుకుంటుంది. నేను ఎంత చెబుదాం అని ట్రై చేసినా మీకు అర్థం కావడం లేదు..ఆ గదిలో నాకు కావాల్సిన వాళ్లున్నారని చెబితే వెళ్లారు...ఆ గదిలో మీరొక్కరే ఉన్నారని ఎందుకు అర్థం చేసుకోలేదని..అనవసర కోపం తెచ్చుకుని నన్నే ప్రశ్నిస్తున్నారు..నా ప్రశ్నకు మీరే సమాధానం అని ఎప్పటికి తెలుసుకుంటారు అని తనలో తానే మాట్లాడుకుంటుంది. మన మధ్య అడ్డుతెర ఎప్పుడో తొలగిపోయింది కానీ మీరే తెలుసుకోవడం లేదు అనుకుంటుండగా తండ్రి చక్రపాణి నుంచి కాల్ వస్తుంది. ఇంటికి రావడం లేటవుతుంది అని కాల్ కట్ చేస్తుంది...అటు చక్రపాణి మాత్రం రిషి సార్ ఎప్పుడు నిజం తెలుసుకుంటారో..మా వసు ఎప్పుడు సంతోషంగా ఉంటుందో అనుకుంటాడు.


Also Read:  తన భర్త అంటూ అద్దంలో చూపించినా అర్థం చేసుకోని రిషి, వసు మెడలో తాళినుంచి బయటపడిన 'VR' ఉంగరం



రిషి కార్లో కూర్చుని వసుధార అన్న మాటలు, మెడలో తాళి, దానికున్న VR ఉంగరం అన్నీ గుర్తుచేసుకుంటాడు.  నేనిచ్చిన ఉంగరం తన మెడలో ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది..ఇది కరెక్ట్ కాదు కదా...చాలా ప్రశ్నలున్నాయి కానీ ఒక్కదానికీ సమాధానం చెప్పదు..అసలు వసుధార ఏం చేస్తోందో నాకు అర్థం కావడం లేదు..తన మనసులో ఉన్నది బయటపెట్టదు అనుకుంటాడు... మీకు కావాల్సిన మనిషి లోపలున్నారు అంది..వెళ్లి చూస్తే అక్కడెవరూ లేరు..ఆ అద్దంలో నన్ను నేను చూసుకుని ఏమనుకోవాలి..తన ఉద్దేశం ఏంటి.. వసుధార నాతో గేమ్స్ ఆడుతోందా..క్లూస్ ఇస్తోందా..ఏంటి ఇదంతా అని తనలో తానే సతమతమైపోతాడు...వసుధార తెలివైందే కావొచ్చు కానీ నా లైఫ్ లోకి వచ్చి నా లైఫ్ ని చిందరవందర చేసి నాతో ఆటాడటం ఏంటి..ఏదో జరిగింది కానీ చెప్పడం లేదు..అసలు ఏం జరిగిందో చెప్పడానికి చాలా అకాశాలు వచ్చాయి కానీ చెప్పలేదు..నాకిక ఓపిక లేదు..అటో ఇటో తేల్చేస్తాను అనుకుంటూ వసుధార ఇంటికి వెళతాడు...


Also Read: ఆటగదరా శివా - జీవిత చిత్రాన్ని కళ్లముందు ఆవిష్కరించే శివుడి పాటలు మీకోసం


ఇంటికొచ్చిన రిషిని చూసి చక్రపాణి ఆశ్చర్యపోతాడు..రండి రండి అని సంతోషంగా ఆహ్వానిస్తాడు. వసుధారని పిలవండి అని అడిగితే ఇంకా రాలేదండీ..లేటవుతుందని చెప్పిందండీ..కారణం తెలియదు అంటాడు
రిషి: మీకు బాధ్యత లేదా..అడగరా
చక్రపాణి: ఒకప్పుడు అడిగేవాడిని కానీ ఇప్పుడు అడగడం మానేశాను
రిషి: తను వచ్చేవరకూ నేను వెయిట్ చేస్తాను
చక్రపాణి: ఈ ఫ్యాన్ మధ్యలో ఆగిపోతుంది..మీరు ఆ గదిలో కూర్చోండి అంటాడు
రిషి: వసురూమ్ లోకి వెళ్లిన రిషి..మొన్న వచ్చినప్పుడు ఈ గదిలో తనకు కావాల్సిన వారున్నారని చెప్పింది
చక్రపాణి: వసు అమ్మ చెబితే నిజమే కదా
రిషి: అప్పుడు ఎవరూ లేరు..ఇప్పుడూ ఎవరూ లేరు..
చక్రపాణి: వసు అమ్మ ఎప్పుడూ కరెక్టే చెబుతుంది..మీకు కాఫీ ఇవ్వకపోతే వసు అమ్మ ఒప్పుకోదు సార్ నేను కాఫీ తీసుకొస్తాను .వసు అమ్మ చెప్పిందంటే అబద్ధం ఉండదండీ అని మరోసారి అనేసి అద్దం వైపు చూసేసి వెళ్లిపోతాడు..
రిషి: మళ్లీ వెనక్కు తిరిగి అద్దంలో తనను తాను చూసుకుంటాడు రిషి.. అప్పుడు రిషి... వసు మాటలు, చక్రపాణి మాటలు పదే పదే గుర్తుచేసుకుంటాడు..ఇంతలో ఫ్యాను గాలికి పేపర్లన్నీ ఎగిరి కిందపడతాయి..వాటన్నింటి నిండా లవ్ సింబల్ వేసి VR అని రాసి ఉంటాయి..ఐలవ్ యూ ఎండీగారూ మీ పొగరు అని రాసి ఉండడం చదువుతాడు..


కాఫీ తీసుకోండి సార్ అని చక్రపాణి వస్తే..వద్దండీ నేను వెళతాను అంటాడు. మా సమస్యను మేం ఇద్దరం తేల్చుకుంటాం అంటాడు. బాబూ వసు ఎక్కడుందో అని చక్రపాణి సందేహిస్తుండగా నాకు తెలుసు... థ్యాంక్యూ అనేసి వెళ్లిపోతాడు రిషి. మొత్తానికి మబ్బులు విడిపోయినట్టే...