గుప్పెడంతమనసు ఫిబ్రవరి 15 ఎపిసోడ్ (Guppedanta Manasu February 15th Update)


జగతి-మహేంద్ర మాట్లాడుకుంటుండగా రిషి అక్కడకు రావడంతో జగతి..మహేంద్రపై రివర్స్ అవుతుంది. రావొచ్చు కదా మహేంద్ర అని జగతి అంటే రానంటే రాను అంటాడు. అప్పుడు రిషి ఎక్కడికి వెళ్లనంటున్నారు డాడ్ అని అడిగితే ... జగతి ఎక్కడికి అంటే అక్కడకు అని రిప్లై ఇస్తాడు. మహేంద్ర-జగతి వాదించుకుంటూ ఉండగా నేను తీసుకెళతాను మేడం అంటాడు రిషి. జగతి సంతోషంగా బయలుదేరుతుంది. ఎక్కడికి అని మహేంద్ర అడిగినా వచ్చాక చెబుతాను అంటూ సంబరంగా వెళ్లిపోతుంది. ఎక్కడికి వెళ్లాలి మేడం అంటే చెబుతాను పోనీ రిషి అంటుంది. 
రిషి: వసుధార ఎవరిని పెళ్లి చేసుకుందని అడిగితే బాగోదేమే అనుకుంటాడు.  
జగతి: నన్న ఏమైనా అడగాలి అనుకుంటున్నావా 
రిషి: లేదు మేడం అనేసి..ఏంటో మేడం కొందరు దగ్గర వాళ్లకు కూడా చెప్పాల్సిన నిజాలు అన్ని దాస్తూ ఉంటారు 
జగతి: ఎవరి గురించి మాట్లాడుతున్నావు
రిషి: వసుధార గురించి మేడం..
జగతి: కొందరు అన్ని విషయాలు చెబితే మరికొందరు మనసులోనే దాచుకుంటారు
ఆ తర్వాత జగతి,రిషి ఇద్దరు కలిసి వసుధార వాళ్ళ ఇంటికి వెళ్తారు. అప్పుడు జగతి రిషిని లోపలికి రమ్మని పిలిచినా కూడా బయటే ఆగిపోతాడు. రిషి ఏ విషయం బయటకు అడగడు-వసు రిషితో ఆాట్లాడుతోంది ఈ విషయం తేల్చేస్తాను అనుకుంటుంది.


Also Read: ''గుప్పెడంతమనసు'' సీరియల్ నుంచి దేవయాని ( మిర్చి మాధవి) ఔట్


జగతి లోపలికి వెళ్లడంతో ఏంటి మేడం మీరు వచ్చారని వసుధార అడిగితే..కొన్ని సార్లు రాక తప్పదు వసుధార అని అంటుంది. రిషి సార్ వచ్చారా అని అడిగి రిషి దగ్గరకు వెళుతుంది. చక్రపాణి జగతికి కాఫీ తీసుకొని వస్తాడు. ఆ తర్వాత వసుధార కార్ దగ్గరికి వెళ్లి డోర్ కొట్టినా తీయడు రిషి. ఏంటి సార్ ఎంత పిలిచినా డోర్ తీయడం లేదనడంతో సారీ నాకు వినిపించలేదంటాడు. ఇద్దరూ కాసేపు వాదించుకుంటారు. లోపలికి రండి అని పిలిచినా రాను అని రిషి అనడంతో.. మీరే మనసు మార్చుకుని రండి అనేసి అక్కడి నుంచివెళ్లిపోతుంది. 


బయట మగవారి చెప్పులు ఉండటం చూసి వసుధార భర్తవే అనుకుని రిషి లోపలికి స్పీడ్ గా వెళ్తాడు. లోపలికి చూస్తూ ఉంటాడు. అప్పుడు వసుధార మీకు కావాల్సిన వాళ్ళు లోపల ఉన్నారు సార్ అనడంతో వసుధార బెడ్ రూమ్ లోకి వెళ్తాడు రిషి. అక్కడ ఎవరూ లేకపోవడంతో తన ముఖం తానే అద్దంలో చూసుకుని వసుధార ఏమనుకుంటోంది పిచ్చోడిని చేస్తుందా అనుకుంటూ కోపంగా బయటకు వెళ్లిపోతాడు. 
వసుధార: ఏంటి మేడం సార్ అలా కోపంగా వెళ్ళిపోయారు సార్ కి  కావాల్సిన వాళ్ళు లోపల ఉన్నారని చెప్పాను అంతమాత్రానికే వెళ్లిపోవాలా 
జగతి: నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు వసు. డైరెక్ట్ గా రిషితో చెప్తావా లేదా 
వసుధార: రిషి సార్ తెలుసుకుంటారు అనుకుంటున్నాను మేడం. నేనే రిషి సార్ కి నిజం తెలిసేలా చేస్తాను అని అంటుంది. అప్పుడు జగతి కోసం రిషి  క్యాబ్ బుక్ చేయడంతో జగతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. 


Also Read: వసు గురించి ఈగో మాస్టర్ కి దాదాపు క్లారిటీ వచ్చేసినట్టే, జగతితో కలసి బయలుదేరిన రిషి!


మరోవైపు కాలేజీకి వెళ్లిన రిషి వసుధార చేసిన పనిని తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నన్ను ఎందుకు పిచ్చోడిని చేస్తోంది. డైరెక్ట్ గా నోటితో చెప్తే సరిపోతుంది కదా అనుకుంటూ ఉంటాడు. మరోవైపు జగతి ఓచోట కూర్చుని ఉండగా మహేంద్ర వస్తాడు. అప్పుడు జగతి, మహేంద్ర వసుధార కోసం లైబ్రరీలో ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్తారు. మరో వైపు వసు రిషి కూడా లైబ్రరీకి వెళ్లి...నా బుక్స్ నేనే వెతుక్కుంటాను నువ్వు వెళ్లు అంటూ లైబ్రేరియన్ ని బయటకు పంపిస్తాడు.  వసుధార కూడా బుక్స్ వెతుక్కుంటూ ఉంటుంది. కింద పడిన బుక్ తీస్తుండగా వసు మెడలో తాళి బయటకు వచ్చి దానికున్న వీఆర్ ఉంగరం కనిపిస్తుంది. మరి రిషి చూస్తాడో లేదో చూడాలి....