Guppedantha Manasu Mirchi Madhavi: గుప్పెడంత మనసు సీరియల్ లో మెయిన్ లీడ్ అయిన రిషి(ముఖేష్ గౌడ), వసు (రక్షా గౌడ) ప్రేక్షకులకు ఎంతబాగా కనెక్ట్ అయ్యారో...మహేంద్ర, జగతి, దేవయాని, ధరణి , గౌతమ్, ఫణీంద్ర పాత్రలు కూడా బాగా మార్కులు సంపాదించుకున్నాయి. అయితే ఇప్పటికే గౌతమ్ గా నటించిన కిరణ్ కాంత్...బ్రహ్మముడి సీరియల్ తో బిజీ అయిపోయాడు. అంటే దాదాపుగా గుప్పెడంతమనసు నుంచి తప్పుకున్నట్టే.  ఇప్పుడు దేవయాని ( మిర్చి మాధవి) తప్పుకుంటోందట. గౌతమ్ అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ కాబట్టి పెద్దగా నష్టమేమీ లేదు కానీ దేవయాని పాత్ర అంటే సీరియల్ కి మెయిన్ విలన్. ఓ రకంగా చెప్పాలంటే సీరియల్ లో ఈమె కనిపించగానే కుట్రలకు కేరాఫ్ గా ఫిక్సైపోతారు ప్రేక్షకులు...కార్తీకదీపంలో మోనితను రియల్ గా కూడా విలన్ గా చూసినట్టే..గుప్పెడంతమనసు సీరియల్ లో దేవయానిని కూడా రియల్ విలన్ గానే చూస్తారు బుల్లితెర ఆడియన్స్. ఆమె ఏ రేంజ్ లో నటిస్తుందో ఇంతకన్నా చెప్పడానికేముంది. ఇప్పుడు ఆమె తప్పుకుంటోంది అనే విషయం తెలిసి సీరియల్ అభిమానులు అవాక్కవుతున్నారు.


Also Read: వసు గురించి ఈగో మాస్టర్ కి దాదాపు క్లారిటీ వచ్చేసినట్టే, జగతితో కలసి బయలుదేరిన రిషి!


ఇంతకీ దేవయాని పాత్ర తీసేస్తే సీరియల్ కి శుభంకార్డే కదా అంటారేమో..కాదు కాదు..కేవలం మిర్చిమాధవి సీరియల్ నుంచి బయటకు వచ్చేస్తోంది అంతే..ఆ పాత్రలోకి మరొకరు రాబోతున్నారు. ఈ మాట నిజమే అనేందుకు ఆధారం ఏంటంటే  దేవయానికి ఆ సీరియల్ నటులు సెండాఫ్ చెప్పిన వీడియో, ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఆ మూవీ టీమ్ లో కొందరు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో మిస్ యూ అంటూ పోస్ట్ చేశారు. ఇంతకీ మాధవి ఎందుకు తప్పుకుంటోంది అంటే..  ఆమె యూకే‌కి వెళ్లిపోతోందట. అక్కడి నుంచి వచ్చి షూటింగ్ చేసే అవకాశం లేకపోవడంతో వెళ్లిపోతోంది. మాధవి ప్లేస్‌లో మరొక నటి రాబోతున్నారు. ప్రస్తుతానికి అయితే ఆమె చివరి ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.


దేవయాని (మిర్చి మాధవి) సీరియల్ నుంచి తప్పుకోవడంతో ముఖేష్ గౌడ (రిషి) ఎమోషనల్ అయ్యాడు. పెద్దగా సీరియల్‌గా నటించినా.. నిజంగానే పెద్దమ్మ అంటూ ఎమోషనల్ అయ్యాడు. ధరణి పాత్రలో నటించిన సీతామహాలక్ష్మి కూడా లవ్ యూ, మిస్ యూ అంటూ పోస్టులు పెట్టింది.  నెటిజన్లు కూడా మిస్ యూ దేవయాని మేడం అంటూ పోస్టులు పెడుతున్నారు.






ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘మిర్చి’లో నటించినప్పటి నుంచీ ఆమెకు ‘మిర్చి మాధవి’గా పేరొచ్చింది. ఆమెది గుంటూరు జిల్లా. 
 త్రిశూలం సీరియల్‌తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన మాధవి..కథలో రాజకుమారి, చిన్నారి, కంటే కూతుర్నే కనాలి సీరియల్స్  తో మంచి పేరు సంపాదించుకుంది. ఇక సినిమాల విషయానికి వస్తే మిర్చి, 100 % లవ్, శతమానం భవతి, గద్దలకొండ గణేష్ లో నటించింది.