ఆయుష్మాన్ ఖురానా, అనన్య పాండే హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తాజా సినిమా ‘డ్రీమ్ గర్ల్ 2’. రాజ్ శాండిల్య దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్‌ ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలైంది. ఇందులో డ్రీమ్ గర్ల్‌  ముఖాన్ని చూపించకుండానే, జస్ట్ హస్కీ వాయిస్ తో ఆకట్టుకునేలా చేశారు. హీరో ఆయుష్మాన్ ఖురానా అమ్మాయిలా వేషం వేసుకుని మత్తెక్కించే వాయిస్ తో మెస్మరైజ్ చేశాడు. డ్రీమ్ గర్ల్ తో ‘పఠాన్’(షారుఖ్ ఖాన్) ఫోన్ సంభాషణ ఆకట్టుకుంది. ప్రేమికుల రోజున పూజకు శుభాకాంక్షలు చెప్పేందుకు ‘పఠాన్’ త్వరలో తన ‘జవాన్’తో రానున్నట్లు వెల్లడించాడు. ఈ చిత్రంలో, ఆయుష్మాన్ తన వాయిస్‌ని అమ్మాయి వాయిస్‌గా మార్చే హాట్‌లైన్ కాలర్‌గా నటించాడు.


ఆకట్టుకుంటున్న ఆయుష్మాన్ వేషధారణ


మెరిసే బ్యాక్‌ లెస్ బ్లౌజ్, లెహంగాలో అలంకరించబడిన ఒక మహిళ, బెడ్‌పై కెమెరాకు వెనుకవైపు కూర్చొని ఉండగా మూవీ టీజర్ ప్రారంభమవుతుంది. ప్రేమికుల రోజున ఆమెకు 'పఠాన్' నుంచి కాల్ వస్తుంది. ఆమెకు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు చెప్తాడు. ఆమె మేకప్ చేసుకుంటూ అతడితో మాట్లాడుతూ ఉంటుంది. అతడు “మేరీ ‘జవాన్’ ఆ ఆరాహి హై (నా జవాన్ వచ్చేస్తోంది)” అని చెప్తాడు. ఆమె ఎప్పుడు వస్తుందని అడుగుతుంది. జూలై 7న వచ్చేస్తోందని చెప్తాడు. 






ఒక్క హీరోయిన్ అన్నారు, పూజా ఎవరు?


ఇక ఈ సినిమా టీజర్ ను ఇన్ స్టాలో షేర్ చేస్తూ అనన్య ఇంట్రెస్టింగ్ విషయం చెప్పింది. సినిమాకు సంతకం చేసే సమయంలో ఒక్క హీరోయిన్ మాత్రమే ఉందని చెప్పారు. నేనూ అలాగే అనుకున్నాను. ఇప్పుడు అందరూ దీన్ని పూజ అని ఎందుకు పిలుస్తున్నారు?” అంటూ రాసుకొచ్చింది.


‘డ్రీమ్ గర్ల్’ ఫ్రాంచైజీలో రెండవ భాగం గురించి ఆయుష్మాన్ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.  ’డ్రీమ్ గర్ల్ 2’ గురించి నేను చాలా ఆసక్తిగా ఉన్నాను! ఇది బాలాజీ మోషన్ పిక్చర్స్‌ తో నా రెండవ సినిమా. ఈ ఫ్రాంచైజీని తీసుకున్నందుకు ఏక్తాకు ధన్యవాదాలు. నాకు రాజ్‌ రూపంలో ఒక స్నేహితుడు దొరికాడు. అతనితో మళ్లీ జతకట్టడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. అనన్య పాండే నాతో నటిస్తోంది. మా కెమిస్ట్రీ గురించి ప్రేక్షకుల స్పందన కోసం ఎదురు చూస్తున్నాను” అని చెప్పాడు.    


ఒక్క టీజర్ తో మూడు సినిమాల ప్రమోషన్!


ఇక ఆయుష్మాన్ షేర్ చేసిన టీజర్‌పై నెటిజన్లను రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఒక అభిమాని, “వాట్ ఎ మార్కెటింగ్ బ్రో, 3 సినిమాలను ప్రమోట్ చేస్తున్నావ్” అని వ్యాఖ్యానించారు. ‘డ్రీమ్ గర్ల్ 2’ టీజర్ తో ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలను ప్రమోట్ చేస్తున్నారంటూ సదరు అభిమాని అభిప్రయాపడ్డాడు. షారుఖ్ తదుపరి చిత్రం ‘జవాన్’ జూన్ 2న విడుదల కానుంది.  


‘డ్రీమ్ గర్ల్ 2’లో అన్నూ కపూర్, పరేష్ రావల్, మనోజ్ జోషి, విజయ్ రాజ్, సీమా పహ్వా, రాజ్‌పాల్ యాదవ్ నటించారు. ఈ చిత్రాన్ని బాలాజీ టెలిఫిల్మ్స్ లిమిటెడ్ బ్యానర్‌పై ఏక్తా ఆర్ కపూర్, శోభా కపూర్ నిర్మించారు. ఆయుష్మాన్‌తో నుష్రత్ భరుచ్చా నటించిన సూపర్ డూపర్ హిట్ మూవీ ‘డ్రీమ్ గర్ల్’ కు ఇది రెండవ భాగం.


Read Also: ‘లేడీ’ వార్ - నయన్‌పై మాళవిక విమర్శలు, ఈ సారి ‘సూపర్‌స్టార్’ లొల్లి!