సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) సినిమా థియేటర్లలోకి వచ్చి ఎన్ని రోజులు అయ్యింది? బహుశా... ప్రేక్షకులకు ఈ విషయం అంతగా గుర్తు ఉండటం కష్టమే. ఎందుకంటే... సుమారు రెండేళ్ళుగా ఆయన రోడ్ యాక్సిడెంట్ గురించి ఎక్కువ డిస్కషన్ జరిగింది. 


సాయి తేజ్ ఆస్పత్రిలో బెడ్ మీద ఉన్నప్పుడు 'రిపబ్లిక్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా విడుదలైన ఏడాదిన్నరకు మళ్ళీ ఆయన థియేటర్లలోకి వస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'విరూపాక్ష'. హీరోకి గ్యాప్ వచ్చినా సరే... ఆయన మార్కెట్ రేంజ్ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేస్తున్న చిత్రమిది. 


'విరూపాక్ష' తెలుగు రైట్స్ @ 20 కోట్లు!
'విరూపాక్ష' తెలుగు థియేట్రికల్ హక్కులను 20 కోట్ల రూపాయలకు అమ్మేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఈ రేటు ఏపీ, తెలంగాణకు మాత్రమే. తెలుగులో మాత్రమే కాకుండా... హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. పాన్ ఇండియా రిలీజ్ అన్నమాట. మిగతా రాష్ట్రాల నుంచి మంచి రేటు వచ్చే అవకాశం ఉంది. శాటిలైట్ & డిజిటల్ రైట్స్ అదనం అన్నమాట. ఏడాది ఏప్రిల్ 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  


మిస్టరీ థ్రిల్లర్‌గా 'విరూపాక్ష'ను రూపొందిస్తున్నారు. ఒక విధంగా హారర్ లేదా థిల్లర్ సినిమా సాయి ధరమ్ తేజ్ చేయడం ఇదే మొదటిసారి. 'ప్రతిరోజూ పండగే', ' సోలో బతుకే సో బెటర్', 'రిపబ్లిక్' మంచి విజయాలు సాధించాయి. వాటికి తోడు సుకుమార్ బ్రాండ్ వేల్యూ యాడ్ కావడంతో మంచి ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేసి మరీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకుంటున్నారు. 


'విరూపాక్ష' సినిమాకు  కార్తీక్ వర్మ దండు (Karthik Varma Dandu) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన సుకుమార్ శిష్యుడు. ఈ చిత్రానికి సుకుమార్ కథ, కథనం అందించారు. సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలపై ఓ సినిమా తెరకెక్కుతోంది. 


Also Read : ఆస్కార్ గడ్డపై తెలుగు బిడ్డలు - ఒకే వరుసలో స్టీవెన్ స్పీల్‌బర్గ్, చంద్రబోస్


''అజ్ఞానం భయానికి మూలం... భయం మూఢ నమ్మకానికి కారణం... ఆ నమ్మకమే నిజమైనప్పుడు? ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు? అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం'' అని ఎన్టీఆర్ డైలాగుతో టీజర్ విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. 


B Ajaneesh Loknath Telugu Movies : బి. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. రీసెంట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'కాంతార' (Kantara) కు ఆయన సంగీతం అందించారు. ఆ సినిమా విజయంలో సంగీతం ఎంత కీలక పాత్ర పోషించిందో... మన అందరికీ తెలిసిందే. తెలుగులో అజనీష్‌కు రెండో చిత్రమిది. ఇంతకు ముందు 'నన్ను దోచుకుందువంటే' చిత్రానికి సంగీతం అందించారు. తెలుగులో డబ్బింగ్ అయిన కన్నడ సినిమాలకు మ్యూజిక్ అందించారు.  


Also Read 'అవెంజర్స్', 'యాంట్ మ్యాన్' విలన్ జోనాథన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే  


ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్తా మీనన్ (Samyuktha Menon) కథానాయికగా నటిస్తున్నారు. సాయి చంద్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, సునీల్, అజయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయి తేజ్‌కు రోడ్ యాక్సిడెంట్ కావడానికి ముందు ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. ఆ ప్రమాదం వల్ల కొన్ని రోజులు బ్రేక్ పడింది. మళ్ళీ ఆయన కోలుకున్నాక షూటింగ్ రీ స్టార్ట్ చేశారు. కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి హైదరాబాద్‌లో రెండు సెట్స్ వేశారు. సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి అయ్యిందని సమాచారం.