ఎవరైనా ఎప్పుడైనా కలగన్నారా? ప్రపంచ ప్రఖ్యాత చలనచిత్ర పురస్కార వేదిక ఆస్కార్ బరిలో తెలుగు పాట ఉంటుందని! దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఆ కలను సాకారం చేశారు. ఎవరైనా ఎప్పుడైనా కలగన్నారా? మట్టి పరిమళాలు, మన సంస్కృతి సంప్రదాయాలతో సాహిత్య సాగు చేస్తున్న చంద్రబోస్, ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ (Steven Spielberg)తో పాటు ఒకే వరుసలో నిలబడతారని! ఆ కలను సాకారం చేసినది కూడా దర్శక ధీరుడే!
ఆస్కార్ నామినీస్ లంచ్...
చంద్రబోస్, కీరవాణి ఫొటోస్!
ఒక్క అడుగు.. చరిత్ర సృష్టించడానికి ఒక్క అడుగు దూరంలో మన తెలుగు పాట 'నాటు నాటు...' (Naatu Naatu Song) నిలిచింది. 'ఆర్ఆర్ఆర్' (RRR Movie) సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా అద్భుతంగా డ్యాన్స్ చేసిన పాటకు ఆస్కార్ నామినేషన్ లభించింది. ఈ సంగతి మన అందరికీ తెలిసిందే.
Oscar Nominees Luncheon : ఆస్కార్ నామినేషన్ అందుకున్న ప్రతి ఒక్కరికీ ప్రతి ఏడాది లంచ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం అలవాటు. ఈ ఏడాది కూడా లంచ్ ఇచ్చారు. దానికి చంద్రబోస్, కీరవాణి అటెండ్ అయ్యారు. ఆ తర్వాత ఫోటో దిగారు. అక్కడ స్టీవెన్ స్పీల్‌బర్గ్, చంద్రబోస్ ఒకే వరుసలో నిలబడ్డారు.
Also Read : 'అవెంజర్స్', 'యాంట్ మ్యాన్' విలన్ జోనాథన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే
'నాటు నాటు...'కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ వచ్చింది. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్... ఇద్దరికీ ఆ అవార్డును సంయుక్తంగా ఇచ్చారు. గోల్డెన్ గ్లోబ్ వేదికపై కీరవాణి సగర్వంగా ఆ పురస్కారాన్ని సగర్వంగా అందుకున్నారు. అంతకు ముందు ఆన్‌లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ, క్రిటిక్స్ ఛాయస్ మూవీ అవార్డ్స్ నుంచి ఉత్తమ పాటగా 'నాటు నాటు...'కు అవార్డు వచ్చింది. ఆ అవార్డు వేడుకలకు చంద్రబోస్ హాజరు కాలేదు.
కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అందుకున్న సమయంలో చంద్రబోస్ ఇండియాలో ఉన్నారు. ఇక్కడ మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నారు. అప్పుడు కొంత మంది రాజమౌళిపై విమర్శలు చేశారు. పాట రాసిన వ్యక్తికి సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని! అన్నయ్య కీరవాణిని ప్రమోట్ చేస్తున్నారని! ఇప్పుడు ఆస్కార్స్ లంచ్ కార్యక్రమానికి చంద్రబోస్ వెళ్ళడం ద్వారా ఆ విమర్శలు ఆగాలి మరి!
Also Read : నయన్ అంటే గౌరవమే - లేడీ సూపర్‌స్టార్ గొడవకు మాళవిక చెక్, ఫ్యాన్స్ ట్రోలింగ్ ఆపేస్తారా?
లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి ఉత్తమ సంగీతానికి గాను ఎం.ఎం. కీరవాణి అవార్డు అందుకున్నారు. ఆయనకు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ కూడా అవార్డు ఇచ్చారు. అయితే, అందరి చూపు ఆస్కార్ నామినేషన్ మీద ఉంది. ఎందుకు అంటే... ప్రపంచ సినిమాలో అన్ని అవార్డులకు పెద్దన్నగా అకాడమీ పురస్కారాలను చూస్తారు కాబట్టి! ఆస్కార్ షార్ట్ లిస్టులో 'నాటు నాటు...' చోటు సంపాదించుకున్న తరుణం నుంచి నామినేషన్ డిస్కషన్ నడుస్తోంది.
మార్చి 23 కోసం ఇండియా వెయిటింగ్!
మార్చి 23, 2023న ఆస్కార్ విజేతల వివరాలు వెల్లడిస్తారు. ఆ రోజు కోసం యావత్ భారతదేశం వెయిట్ చేస్తోంది. 'నాటు నాటు...'కు అవార్డు రావడం ఖాయం అని అభిమానులు ఆశిస్తున్నారు. 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' విభాగంలో పోటీ పడటానికి మొత్తం 81 పాటలు అర్హత సాధించగా... అందులో 15 పాటలను మాత్రమే షార్ట్ లిస్టుకు ఎంపిక చేశారు. ఆ పదిహేనులో 'ఆర్ఆర్ఆర్'లోని 'నాటు నాటు...' ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత నామినేషన్ కూడా అందుకుంది.