మేష రాశి 


మహా శివరాత్రి పర్వదినం ఈ రాశివారిలో ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారానికి సంబంధించి విదేశాలకు వెళ్లాలి అనుకునేవారికి ఇదే మంచి సమయం. ఈ రోజు మీరు పిల్లల నుంచి శుభవార్త వింటారు. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు ఈరోజు మంచి రోజు.


వృషభ రాశి


ఈ రోజు ఈ రాశివారు వ్యాపారంలో విజయాన్ని పొందుతారు. విదేశీ భాగస్వాములతో కలసి పనిచేసేవారు లాభపడతారు. ఉద్యోగులు పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు. ఆర్థికపరంగా బావుంటుంది. 


మిథున రాశి


సరదా పర్యటనలు, సామాజిక సమావేశాలు మిమ్మల్ని సంతోషంగా రిలాక్స్‌గా ఉంచుతాయి. ఈ రోజు మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేదంటే నష్టపోతారు. 


కర్కాటక రాశి


మహా శివరాత్రి రోజున మీ మనసులో కొత్త ఆలోచనలు వస్తాయి. ఈ రోజు మీరు కొత్త వ్యాపారానికి కూడా ప్లాన్ చేస్తారు.  కుటుంబ వ్యవహారాల్లో ఇంటి సభ్యులందరి సహకారం అందుతుంది. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగులకు శుభదినం.


Also Read: స్త్రీ-పురుషులు సమానం అని ఇప్పుడు చెప్పడం ఏంటి - శివుడు అప్పుడే చెప్పాడు


సింహ రాశి


ఈ రోజు మీరు సమయస్ఫూర్తి, హాస్యంతో మీ చుట్టు పక్కలవారిని ఆకట్టుకుంటారు. ఆదాయం మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఉద్యోగులు పనిపై చక్కని శ్రద్ధ కనబరుస్తారు. ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని మెరుగు పర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. 


కన్యా రాశి


ప్రభావవంతమైన వ్యక్తుల సహకారం మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. అదనపు డబ్బును రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ రోజు ప్రతి ఒక్కరూ మీతో స్నేహంగా ఉండాలని కోరుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. 


తులా రాశి


మీ ఆరోగ్యం మెరుగుపడేందుకు మీ స్నేహితులు కొన్ని సలహాలిస్తారు..పాటిస్తే మంచి జరుగుతుంది. రియల్ ఎస్టేట్ లో పెట్టబడి పెట్టేందుకు ఇదే మంచిసమయం. మీ కుటుంబ సభ్యులకు చెప్పడం ద్వారా మీరు వారిపట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నారో వారికి అర్థమయ్యేలా చెప్పండి. 


వృశ్చిక రాశి


మహా శివరాత్రి ఈ రాశివారు పూర్తిగా భక్తిలో మునిగితేలుతారు. ఏదైనా మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఈ రోజు మీరు ఆనందంగా ఉండాలంటే మీ స్వభావంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. అనవసర విషయాలపై అతి శ్రద్ధ చూపించకపోవడం మంచిది


Also Read: మహాశివరాత్రి రోజు ఉపవాసం-జాగరణ చేసేవారు చేయాల్సినవి, చేయకూడనివి


ధనుస్సు రాశి


మీరు గతంలో పడిన కష్టానికి ఈ రోజు ప్రతిఫలం పొందుతారు. మీరు తలపెట్టిన పనులకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించవచ్చు..జాగ్రత్తగా ఉండండి. చిన్న అనారోగ్య సమస్యను కూడా నిర్లక్ష్యం చేయవద్దు. మీరీ ఎక్కువ ఒత్తిడికి గురికావొద్దు. వ్యాపారులు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. 


మకర రాశి


ఈ రోజు ఈ రాశివారు సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. మీరు ప్రారంభించిన పనులకు స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది.  భాగస్వామ్య వ్యాపారం లాభిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం నిండిఉంటుంది. అనుకున్న పనులు పూర్తిచేయగలుగుతారు. 


కుంభ రాశి


ఈ రాశివారు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. క్రీడాకారులు విజయం సాధిస్తారు. అంకితభావంతో వ్యవహరిస్తారు. ఆర్థికపరంగా బావుంటుంద. ఇంట్లో పరిశుభ్రత అత్యవసరం. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. 


మీన రాశి


మహా శివరాత్రి రోజు మీకు శుభప్రదమైన రోజు. ఈ రోజు పనులన్నీ మీ మనసుకి అనుగుణంగా పూర్తవుతాయి. ఈ రోజు మీరు పాత స్నేహితులను కలుస్తారు. కొత్త వ్యక్తులను కలుస్తారు.