గుప్పెడంతమనసు ఆగస్టు 25 గురువారం ఎపిసోడ్ (Guppedantha Manasu August 25 Episode 538)
డీబీఎస్టీ కాలేజ్ ఫేర్ వెల్ పార్టీ హడావుడి నడుస్తోంది. రిషి, జగతి ఇద్దరూ మాట్లాడిన తర్వాత స్టూడెంట్స్ తరపునుంచి వసుధార మాట్లాడుతుంది. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఈ కాలేజీలో జాయిన్ అయ్యానో, ఎన్ని సంఘటనలు ఎదుర్కొన్నానో, ఇక్కడికి వచ్చి యూత్ ఐకాన్ ఎలా అయ్యానో చెప్పడానికి సమయం సరిపోదంటుంది. ముందుగా నేను ముగ్గురికి ధన్యవాదాలు చెప్పుకోవాలి అనుకుంటున్నాను.ఒకరు నన్ను ఇక్కడ చేర్పించినవారు,ఇంకొకరు నన్ను ఇక్కడ చూసుకున్న వారు, ఇంకొక్కలు నేను వసుధారని అని నాకు గుర్తు చేసిన వారు. జగతి మేడం,మహేంద్ర సర్,రిషి సార్ థాంక్యూ వెరీమచ్ అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటుంది. జగతి వెళ్లి ఓదార్చుతుంది. ఆ తర్వాత స్టాఫ్-స్టూడెంట్స్ అందరూ ఫొటో తీసుకుంటారు. ఆ తర్వాత వసుధారని కార్లో తీసుకెళతాడు రిషి..
Also Read: నా కళ్లముందే ఉండాలని కోరిన రిషి, మీరు లేనిదే నేను లేను నా ప్రేమని అంగీకరించండన్న వసుధార
చీకటి పడిన తర్వాత రిషి ఇంటికి వెళుతూ..వసుధార చెప్పకుండా వెళ్లిపోయిందేంటని ఆలోచిస్తాడు. కాస్త ముందుకు వెళ్లగానే రోడ్డు పక్కన వసుధార నిల్చుని ఉంటుంది. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు.
వసు: ఇంకొక చిన్న పని మిగిలిపోయింది సార్
రిషి: వర్షం పడేలా ఉంది
వసు: నా మనసులో తుఫాను ఉంది సార్
రిషి: వర్షం పడేలాఉంది కారులో వెళుతూ మాట్లాడుకుందాం
వసు: కులాసాగా కార్లో వెళుతూ మాట్లాడుకోవాల్సిన కబుర్లు కాదు..నిజానికి నేనుకాదు మాట్లాడేది..నా మనసు మాట్లాడుతుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ చెప్పలేనేమో అనిపిస్తోంది.
రిషి: చెప్పు వసుధార..మాట్లాడవేంటి..
వసు: మాటలు రావడం లేదు..
రిషి: ఇప్పుడేకదా మాట్లాడతాను అన్నావ్
వసు: నేనేమీ మాట్లాడలేనేమో సార్ అంటూ..బ్యాగ్ లో ఉన్న గిఫ్ట్ తీసి దాని మీద తాడు, తాడులో ఉంగరం తీస్తుంది వసు.
రిషి: విరిగిపోయిన బొమ్మని మళ్లీ ఎందుకు తెచ్చావు వాసుధార, ఒంటరిగా ఉన్న అక్షరాన్ని ఇంకో అక్షరంతో ఎందుకు కలిపావు
వసు: బొమ్మ బయటికి విరిగిపోయి ఉన్న లోపల కలిసుంది సార్..ఒంటరిగా ఉన్న అక్షరానికి ఇంకో అక్షరం తోడవుతుంది.నాకు మీరు కావాలి సార్, జీవితాంతం కావాలి అప్పుడు నేను మిమ్మల్ని వద్దనుకున్నాను కానీ మీకన్నా నేనే ఎక్కువ బాధపడుతున్నాను
రిషి: ఆ రోజు నువ్వు అన్న మాటలకు నాకు చాలా బాధ వేసింది, అప్పుడు వద్దు అనుకున్నావు ఇప్పుడు అదే గిఫ్ట్ ఇస్తున్నావు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు
వసు: ఆ బాధని నేను ఇన్ని రోజులు గుండెల్లో మోసాను దింపుకోవడానికి నేను ఇప్పుడు చెప్తున్నాను సార్ అని అంటాది వసు.
రిషి: అప్పుడు ప్రేమ లేదన్నావు ఇప్పుడు ప్రేమ అంటున్నావు అసలు ఏంటిది వసుధార
వసు: మీకు చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు నేను ఎంత అల్లాడిపోయానో, ఆ రోజు లాబ్ లో మీ ప్రాణాలు కాపాడడానికి నా ప్రాణాలు కోల్పోయిన పర్వాలేదు అనుకున్నాను ఇదంతా ప్రేమ్ కదా సార్? నాకు మిమ్మల్ని కొల్పోవాలని లేదు,నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ, నా ప్రేమ నీ స్వీకరించండి
ఎపిసోడ్ ముగిసింది
Also Read: మోనితని ఫాలో అవుతూ వెళ్లిన దీపకు పెద్ద షాక్, కార్తీక్ అక్కడే ఉన్నాడా!