గుప్పెడంతమనసు ఆగస్టు 24 బుధవారం ఎపిసోడ్ (Guppedantha Manasu August 24 Episode 537)
వసు ఆలోచనల్లో రిషి..రిషి ఆలోచనల్లో వసు... ఒకరిపై మరొకరి ప్రేమను బయటపడకుండా మనసులోనే ఫీలవుతున్నారు. గతంలో రిషి ఇచ్చినప్పుడు కిందపడేసిన గిఫ్ట్ ని తిరిగి అతికించిన వసుధార..ఆ గిఫ్ట్ చూస్తూ మాట్లాడుతుంటుంది..
వసు: రిషి సార్ నమస్తే..ఏం చేస్తున్నారు ( అక్కడ రిషి తల దువ్వుకునేందుకు దువ్వెన వెతుక్కుంటూ వసుధార కశ్చీఫ్ చూస్తాడు)
రిషి: ఇన్ని జ్ఞాపకాలు ఎందుకిచ్చావ్..వాటినే మిగల్చాలనా..
వసు: వీఆర్ అని ఉంగరం చేయించిన వసుధార..రిషిసార్ ఇది మిమ్మల్ని చేరాలి..చేరుకుంటుంది..
రిషి: నువ్వే ఒక జ్ఞాపకంగా మిగిలిపోవద్దు..నువ్వు నా కళ్లముందే ఉండాలి..నాతోనే ప్రయాణం చేయాలి. క్యాలెండర్ వైపు చూసిన రిషి..24వ తేదీని సర్కిల్ చేసి..ఫేర్ వెల్ పార్టీ... ఫేర్ వల్ ఎవరికి..ఫైనలియర్ స్టూడెంట్స్ కా..వసుధారతో నా పరిచయానికా?
Also Read: మోనితని ఫాలో అవుతూ వెళ్లిన దీపకు పెద్ద షాక్, కార్తీక్ అక్కడే ఉన్నాడా!
జగతి -మహేంద్ర ఇద్దరూ మెట్లు దిగుతూ మాట్లాడుకుంటూ వస్తుంటారు..ఇంతలో ఏంటి మహేంద్ర ఫేర్ వెల్ పార్టీ గ్రాండ్ గా చేస్తున్నారా అని అడుగుతుంది దేవయాని..
మహేంద్ర: గ్రాండ్ గా ఏం కాదు..సింపిల్ గానే చేస్తున్నాం
దేవయాని: ఏం చేసినా మీ మొగుడు పెళ్లాల హడావుడి, మీ వసుధార సందడి ఎలాగూ ఉంటుంది కదా
జగతి: తన ప్రస్తావన ఎందుకిప్పుడు
దేవయాని: అదేంటి అలా అంటావ్...ఫేర్ వెల్ పార్టీకి స్వీట్స్ చేయించాను..కొందరు దూరమవుతారు కదా అందుకే చేయించాను
జగతి: ఎదుటివారి మంచి కోరుకోవాలి కానీ..చెడు కోరుకోవద్దు..చేతిలో స్వీట్ పెట్టుకుని మనసులో విషం పెట్టుకుంటే బావోదని ధరణికి సమాధానం చెబుతుంది..
దేవయాని: మనసులో విషం ఏంటి.. రిషి నిన్ను అమ్మా అని పిలవాలని కోరుకుంటున్నావ్..కానీ అది జరగడం లేదు కదా.. మేడం అని పిలుస్తాడు పాపం.. మంచి మనసుతో కోరుకోవాలని అన్నావ్ కదా..నేను కోరుకుంటున్నాను..జరగాలి కదా...
రిషిని కనీసం నువ్వు పేరు పెట్టి కూడా పిలవలేవు..సార్ అంటావ్.. ఇన్ని పెట్టుకుని మళ్లీ నాకే నువ్వు ప్రవచనాలు చెబుతున్నావ్ చూడు నవ్వొస్తోంది చూడు...
జగతి: ఇంతలో మెట్లు దిగుతున్న కొడుకుని చూసి.. రిషి కాఫీ అంటుంది జగతి...
దేవయాని షాక్ లో ఉంటుంది..అటు ధరణి కూడా చిన్నత్తయ్య పేరు పెట్టి పిలించింది ఏమవుందో అనుకుంటుంది..
దేవయాని: ఆ కాఫీ కప్పు విసిరికొడతాడు అనుకుంటుంది
దేవయాని ముందు కావాలనే జగతి..రిషి రిషి రిషి అని పిలుస్తుంటుంది...ఫోన్ రావడంతో రిషి పక్కనకు వెళతాడు...
జగతి: అదీ సంగతి అక్కయ్యగారు..మరి నేను కాలేజీకి వెళ్లిరానా ..ధరణి అక్కయ్య గారికి స్ట్రాంగ్ కాఫీ ఇవ్వు..ఇప్పుడు తనకి చాలా అవసరం..మహేంద్ర వెళదామా..
Also Read: కాలేజీలో ఫేర్ వెల్- వసు, రిషి దూరం కానున్నారా?
కాలేజీలో స్టూడెంట్స్ అంతా ఫేర్ వెర్ పార్టీ సందడిలో ఉంటారు. వసుధార ఇంకా రాలేదేంటని పుష్ప వెతుకుతూ ఉంటుంది. రిషి-గౌతమ్ ఇద్దరూ బ్యానర్ సెట్ చేస్తుంటారు... నాక్కూడా ఏదైనా వర్క్ చెప్పండి సార్ అంటుంది వసు. ఫైనలియర్ వాళ్లంతా మా అతిథులు..సో..వాళ్లకి ఏపనీ చెప్పం..
వసు: నన్ను అతిథిలా దూరం పెడుతున్నారా
రిషి: నాకు కనిపించేలా ఓ చోట కూర్చో..
వసు: ఎప్పటికీ మీకే కనిపించాలని ఉంది సార్..
గౌతమ్: ఏంటి వసుధారా..మీ పార్టీ కదా డల్ గా ఉన్నావేంటి..
వసు: అర్థమవుతోంది సార్..మా పార్టీ అంటూనే మమ్మల్ని దూరం పెడుతున్నారు కదా...
ఇంతలో రిషి పిలవడంతో గౌతమ్ వెళ్లిపోతాడు...
ఇంతలో మహేంద్ర ఎంట్రీ ఇస్తాడు...ఏమయ్యా గౌతమూ నీతో పనిఉంది రా అని పిలిచి.. కాసేపు వాళ్లిద్దర్నీ వదిలేద్దాం అంటాడు.
గౌతమ్: వదిలేసినా వాళ్లిద్దరూ కనీసం ఒక్కమాటైనా మాట్లాడుకుంటారా..నాకు నమ్మకం లేదు..
మహేంద్ర: మన ప్రయత్నం మనం చేద్దాం..
గౌతమ్: సరే అంకుల్.. కింద కొన్ని పనులున్నాయ్ అందరూ రండి అని వసు-రిషిని వదిలేసి అంతా వెళ్లిపోతారు..
వసుధార వెళ్లిపోతోంది అనే ఫీలింగ్ నాకు కలగడం లేదు..ఇధే ఫీలింగ్ తనకీ ఉండాలి కదా..అలా ఏం లేదా..అనుకుంటూ వసుధార దగ్గరకు వెళ్లి బ్యాగ్ తీసుకుని... ఇప్పుడు కూడా ఈ బరువు మోయాలా అంటాడు
వసు: కొన్ని బరువులు దింపాలి అనిపించదు..ఇందులో పుస్తకాలు మాత్రమే కాదు నా భవిష్యత్, నా జ్ఞాపకాలున్నాయి..
ఇంతలో రిషి పెదనాన్న ఫణీంద్ర వచ్చి రిషిని పిలుస్తాడు.. ఇక్కడే ఉండు ఎక్కడికీ వెళ్లొద్దని చెప్పి వెళతాడు రిషి..
ఫుడ్ కి సంబంధించి అంతా రెడీనా అని అడుగుతాడు రిషి..వసుధార మాత్రం రిషినే చూస్తుంటుంది... ప్రోగ్రాం ప్రారంభిద్దాం అని పిలుస్తాడు ఫణీంద్ర...
రిషి-వసుధార చూపులతోనే మాట్లాడుకుంటారు..
మహేంద్ర: వీళ్ల మధ్య దూరం తగ్గేదెప్పుడో
జగతి: ఈ రోజు వసుధార తన మనసులో మాట చెప్పేస్తుంది అనుకుంటున్నాను. కొన్ని మనం అనుకుంటే జరగవు..వాటంతట అవే జరగాలి అంతే..
మహేంద్ర: మంచే జరగాలని ఆశిద్దాం జగతి..
ఫేర్ వెల్ పార్టీ చేసుకోవడం ఆనందంగా ఉన్నా..మనసులో ఏదోమూల బాధ అంటూ ప్రసంగం మొదలుపెట్టి డీబీఎస్టీ కాలేజీ గురించి, పరీక్షల గురించి మాట్లాడతాడు. జగతి కూడా స్టూడెంట్స ని ఆశీర్వదిస్తుంది... స్టూడెంట్స్ అంతా వసుధారని మాట్లాడమని అడుగుతారు....