ఒక ఆడపిల్ల నెల తప్పిన దగ్గర నుంచి ఎన్నో సంబరాలు ఉంటాయి కొద్ది రోజులు ఆగుదామని గోవిందరాజులు సర్ది చెప్తాడు. కానీ నాకు ఇద్దరు కోడళ్ళు సమానం జానకి కోసం ఇప్పుడు చిన్న కోడలికి ఫంక్షన్ చేయకపోతే ఇంట్లో లేనిపోని గొడవలు జరుగుతాయి అందుకే ముందు మల్లికకి ఫంక్షన్ చేద్దాం తర్వాత జానకి నెల తప్పితే తనకి చేయాల్సినవి చేద్దామని జ్ఞానంబ అంటుంది. నా చదువు గురించి ఆలోచించి మీరు కోరుకుంటున్న ఆనందాన్ని అందించలేకపోయాను క్షమించండి అత్తయ్యగారు, మీ బాధ కోడలిగా నా బాధ్యతని మరోసారి గుర్తు చేసిందని జానకి మనసులోనే బాధపడుతుంది.


మల్లిక ఎవరు చూడకుండా చాటుగా పట్టు చీర తెచ్చి నీలావతికి ఇస్తుంది. తీసుకో పండగ చేసుకో అని అంటుంది. నువ్వు ఏకంగా కడుపు అని చెప్పి నాటకం ఆడుతున్నావ్, ఈ విషయం రేపు బయటపడితే నిన్ను నన్ను మీ అత్త రాజమండ్రి దాకా పరిగెత్తించి కొడుతుందని భయపడుతుంది. నా నటనని పోలేరమ్మ కాదు కదా వాళ్ళ అత్త కూడా కనిపెట్టలేదని మల్లిక అంటుంది. ఐదో నెల వచ్చినా పొట్ట పెరగలేదని మీ అత్త డౌట్ పడితే ఏం చేస్తావని అడుగుతుంది. జానకి కడుపు పండలేదన్న కుళ్లుతో జానకి కుట్ర చేసి నా కడుపు పోగొట్టిందని సెంటిమెంట్ తో జీవించేసి అత్తని నమ్మించి జానకి మీదకి తోసేస్తాను అని మల్లిక అంటుంది. ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నావని నీలావతి అడుగుతుంది. కడుపు మండింది నా ఈగో మీద కొట్టింది అందుకే ఇలా చేశా, ఇక నుంచి ఇంటి పనులు కూడా జానకి మీద పడతాయి అని అంటుంది. మల్లిక ఇక నుంచి నువ్వు ఈ ఇంటి మహారాణివి అని సంబరపడుతుంది.


Also Read: తులసి, సామ్రాట్ గురించి నీచంగా ఆర్టికల్- రచ్చ చేసిన అభి, అనసూయ బుర్రలో విషం నింపిన నందు, లాస్య


రామా మల్లిక కడుపుతో ఉందని తినడానికి చాలా తీసుకొస్తాడు. వాటిని మల్లికకి ఇచ్చి జాగ్రత్తలు చెప్పమని చెప్తాడు. నా మీద మీకు కోపం లేదా అని జానకి అడుగుతుంది. ‘జానకి గారు మీరు నెల తప్పారని శుభవార్త వింటే నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోయి ఉండేది ఆ సంతోషం మీరు నాకు లేకుండా చేశారని బాధగా ఉంది జానకి గారు అని మీరు అడుగుతారని చాలా ఎదురు చూశాను. కానీ మీ నోటి నుంచి ఆ మాట రాకపోతుంటే నేను పశ్చాత్తాపంతో కాలిపోతున్నా రామాగారు’ అని జానకి ఫీల్ అవుతుంది. ‘ఇంత చిన్న విషయానికి అలా బాధపడొచ్చా, మీ చదువుకి ఆటంకం కాలగకూడదని మనం పిల్లలు వద్దని అనుకున్నాం ఒక మంచి లక్ష్యం కోసం ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది అలాంటప్పుడు నేను ఎందుకు బాధపడతాను చెప్పండి. త్వరలోనే మీరు ఐపీఎస్ అవుతారు తర్వాత తల్లి అవుతారు. కాకపోతే కొంచెం ఆలస్యం. మీరు దీని గురించి ఆలోచించకండి’ అని రామా సర్ది చెప్తాడు.


ఇక జ్ఞానంబ ఇంట్లో మల్లిక ఫంక్షన్ ఏర్పాట్లు ఘనంగా చేస్తుంది. అమ్మలక్కలు అందరూ వస్తారు. జానకి మల్లికని చక్కగా ముస్తాబు చేసి తీసుకొస్తుంది. గబగబా వచ్చి కుర్చీలో కూర్చుంటుంటే జ్ఞానంబ తిడుతుంది. జాగ్రత్త ఉండే పని లేదా ఎలా పడితే అలా కూర్చుంటున్నావ్ అసలే ఒట్టి మనిషివి కూడా కాదు అని జ్ఞానంబ అంటే కాకపోతే తల్లినా ఏంటి అని నోరు జారి పగలబడి నవ్వుతుంది. ఆ మాటకి ఇంట్లో వాళ్ళు అందరూ షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావ్ తల్లినా అంటున్నావెంటీ ఇంకోసారి ఇలా మాట్లాడకు అని చీవాట్లు పెడుతుంది. అందరూ మల్లికని ఆశీర్వదిస్తారు. జ్ఞానంబ ఆ రోజు నువ్వు చేసిన శపథం నిలబెట్టుకున్నావ్ అని నీలావతి అంటుంది. నీ శపథాన్ని నీ చిన్న కోడలు గెలిపించింది అని నీలావతి మంట వేస్తుంది. ఇక అందరూ కూడా జానకిలో ఏదైనా లోపం ఉందా ఏంటి అని అంటారు, ఆ మాటకి జ్ఞానంబ బాధపడుతుంది. మల్లిక సంబరపడుతుంది. వాళ్ళిద్దరినీ మంచి డాక్టర్ కి చూపించు అని అమ్మలక్కలు సలహా ఇస్తారు. గోవిందరాజులు వాళ్ళని తిడతాడు. వచ్చిన పని ఏంటి చేస్తుంది ఏంటి తిడతాడు. వాళ్ళ మాటలు పట్టించుకోకు అని జ్ఞానంబకి చెప్తాడు.


Also read: కాలేజీలో ఫేర్ వెల్- వసు, రిషి దూరం కానున్నారా?


పోలేరమ్మ జానకి మీద విరుచుకు పడితే గదిలోకి వెళ్ళి తీన్మార్ డాన్స్ వేసుకుంటాను అని మల్లిక లోలోపల సంతోషపడుతుంది. నేను ముందే చెప్పాను ఇలా జరుగుతుందని నువ్వే వినలేదు మన ఇంటి పరిస్థితి మనకి తెలుసు ఎవరో అన్న మాటలు పట్టించుకోకు జానకి కూడా త్వరలోనే నీ కోరిక నెరవేరుస్తుందని అంటాడు. ‘అమ్మా జానకి..  ఆడపిల్ల జీవితం ఫలాన్నిచ్చే చెట్టు లాంటిది పళ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు, వాళ్ళ మాటలకి మీ ఇద్దరి మనసులు ఎంత బాధపడి ఉంటాయో నేను అర్థం చేసుకోగలను. ఆ మాటకి కట్టుబడి నేను చదువు విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తానని నువ్వు అనుకోవచ్చు ఒకవేళ నేను అలా చేస్తే వాళ్ళకి నాకు తేడా ఉండదు, నేను నిన్ను నమ్మాను, నీ ఆశయాన్ని గౌరవించాను’ అని జ్ఞానంబ అంటోంది.