యష్ పార్టీ జరిగే ఇంట్లోకి వెళ్తుంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఇన్విటేషన్ కార్డ్ ఏది అని అడుగుతారు. కార్డ్ ఉంటేనే లోపలికి పంపిస్తామని అక్కడి సెక్యూరిటీ చెప్పడంతో మాలిని కోప్పడుతుంది. తను ఎవరో తెలుసా లోపల పార్టీ జరుగుతున్న ఆదిత్య కన్న తండ్రి అని మాలిని అంటుంది. ఏదైనా సరే కార్డ్ ఉంటేనే లోపలికి పంపిస్తామని అతను చెప్తాడు. అదంతా చూస్తూ ఉన్న మాళవిక వచ్చి ఏంటి గొడవ అని అడుగుతుంది. ఇన్విటేషన్ లేకుండా వచ్చారు అడిగితే గొడవ చేస్తున్నారు మేడమ్ సెక్యూరిటీ అనేసరికి వీళ్ళంతేలే అని అంటుంది. వీళ్ళు వస్తారని తెలిస్తే నేను కూడా మన ఆఫీసులో లేబర్ ని పిలిచే వాడిని కదా అని అభి యష్ ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాడు. ఎవరే లేబర్ అని మాలిని గొడవపడేందుకు వెళ్లబోతుంటే యష్ ఆపుతాడు.


ఆదిత్య ఫోన్ చేస్తేనే మేము ఇక్కడకి వచ్చామని మాలిని అంటే వాడు అంటే చిన్న పిల్లోడు ముందు వెనక తెలియకుండా ఫోన్ చేస్తాడు మరి మీకేమైంది వయసుకి జ్ఞానం ఉండక్కర్లేదా నేనంటే కోపం నేను చేసింది పాపం అని మీరు ఫీల్ అయినప్పుడు నా ఇంటికి మేరు ఎలా వస్తారు అని మాళవిక ప్రశ్నిస్తుంది. మాకు అన్ని తెలుసు ఎప్పటికైనా నేర్చుకోవాల్సింది నువ్వే అని కాంచన సీరియస్ అవుతుంది. ఇదంతా పక్కన చాటుగా నిలబడి ఖైలాష్ చూస్తూ ఉంటాడు. మీ ఇంటికి వస్తే నన్ను అవమానించారు, మరి నా ఇంటికి మాత్రం రోషం, పౌరుషం లేకుండా ఎలా వచ్చారు? మీరంతా గ్రేట్. మీరు చేస్తే న్యాయం నేను చేస్తే అన్యాయం అని మాళవిక మనసులో ఉన్నదంతా కక్కేస్తుంది. పొరపాటున వీళ్ళ పార్టీకి కనుక మనం వెళ్తే వీళ్ళు కుక్కల్లాగా మీద పడి అరిచేస్తారు. మరి ఇప్పుడు నేనేం చెయ్యాలని అభిని అడుగుతుంది. నువ్వు చాలా మంచిదానివి నీది మంచి మనసు అలా చేయవని అభి అంటే వేద కోపంగా నోరు అదుపులో పెట్టుకో ఆదిత్య ఫోన్ చేసి తను ఇక్కడ ఉన్నాను పార్టీ ఉంది రమ్మని పిలిస్తేనే వచ్చామని అంటుంది.


అసలు నిన్ను ఎవరు రమ్మన్నారు.. ఖుషిని సొంతం చేసుకున్నట్టే ఆదిని కూడా నీ కొడుకే అంటావా ఏంటి? నోటికి వచ్చినట్టు మాట్లాడకు మాళవిక అని వేద అంటే నేను ఇలానే మాట్లాడతా ఇది నా కొడుకు పార్టీ అసలు ఎవరే నువ్వు అనేసరికి తను నా భార్య అని యష్ చెప్తాడు, ఖుషికి తల్లి. దీన్ని ఇక్కడితే ఆపితే బాగుటుంది అని మాళవికతో అంటాడు. నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావని నాకు తెలుసు కానీ ది రైట్ టైం కాదు ప్లీజ్ ప్రాబ్లం క్రియేట్ చెయ్యకు అని యష్ చెప్తాడు. మాళవిక నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఘోరంగా అవమానిస్తుంది.. కానీ యష్ అవన్నీ భరిస్తూ కొడుకు కోసం మౌనంగా తలదించుకుంటాడు. వెళ్ళి ఒక మూలాన కూర్చుని నాలుగు మెతుకులు తినేసి వెళ్లండని అవమానిస్తుంది. ఆ మాటకి ఇంట్లో వాళ్ళందరూ కోపంగా మాళవిక మీద అరుస్తుంటే యష్ ఆపేస్తాడు.


ఇంట్లోకి వచ్చిన యష్ ఆదిత్య కోసం ఆత్రంగా వెతుక్కుంటూ వెళ్తాడు. ఖుషి కూడా వెతుక్కుంటూ ఆదిత్య గదికి వచ్చి అన్నయ్యా.. అని పిలుస్తుంది. తనని చూసి చాలా సంతోషిస్తాడు. నువ్వు నన్ను ఎప్పుడు చూడలేదు కదా ఎలా గుర్తు పట్టవని ఆది ఖుషిని అడుగుతాడు. నిన్ను చడగానే నువ్వే మా అన్నయ్యవని అనిపించిందని చెప్తుంది. నేను నీ పుట్టు మచ్చ చూడగానే నువ్వే నా చెల్లివని గుర్తు పట్టానని అంటాడు. మామ్ చెప్పింది నువ్వు మామ్ పోలీకే అంట కదా అని చెప్తాడు. యష్ ఆది దగ్గరకి వస్తాడు. తనని చూసి ప్రేమగా దగ్గరకి తీసుకుని ముద్దులు పెడతాడు. ఆప్యాయంగా దగ్గరకి తీసుకుంటే నాకు ఇలాంటివన్నీ నచ్చావు ప్లీజ్ డోంట్ టచ్ మి అని అనేసరికి యష్ బాధపడతాడు. నీ బర్త్ డే రోజు నిన్ను చూస్తానో లేదో అని బాధపడుతుంటే నీదగ్గర నుంచి కాల్ వచ్చింది ఆ సంతోషం చెప్పడానికి మాటలు చాలవు అని ఆనందంగా మాట్లాడుతుంటే ఆది మాత్రం ఐ హేట్ యు అంటాడు. మీరంటే నాకు ఇష్టం లేదు మా మమ్మీని బాధపెడుతున్నారు, చెప్పగానే పార్టీకి వచ్చి నా చెల్లి ఖుషిణి తీసుకుని వచ్చినందుకు చాలా థాంక్స్ నా చెయ్యి వదిలిపెట్టు అని అంటాడు. యష్ చెయ్యి విడిచి పెట్టగానే చేతులు దులుపుకుంటాడు.


Also Read: రాధ, మాధవ్ ల సవాల్- రుక్మిణి ఈ ఇంటి దేవత అంటోన్న దేవుడమ్మ


ఖుషి వేదని తీసుకుని వస్తుంది. నిన్ను చూడగానే గుర్తు పడతాను అని అమ్మే చెప్పిందని ఖుషి అంటే అమ్మా అమ్మ ఎవరు అని అంటాడు. యష్ వచ్చి తను వేద నా భార్య అని అంటాడు. వేద దగ్గరకి వచ్చి ఆదికి ప్రేమగా విషెస్ చెప్తుంటే వద్దని అంటాడు. ఖుషి తను మన అమ్మ కాదు నాన్న వైఫ్.. మనకి అమ్మ అంటే మాళవిక అమ్మే అని అంటాడు. కాదన్నయ్య నాకు అమ్మ అంటే వేద అమ్మనే అంటుంది. నాకు మాత్రం కాదు అనేసి ఆది అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతాడు.


Also Read: యష్ ని ఘోరంగా అవమానించిన కొడుకు ఆదిత్య- తల్లడిల్లిన తండ్రి మనసు