థియేటర్లలో 'లైగర్' (Liger Movie) హంగామా మొదలైంది. అమెరికాలో అయితే ఆల్రెడీ ప్రీమియర్ షోలు కంప్లీట్ అయ్యాయి. మరి, సినిమా ఎలా ఉంది? రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్ మేజిక్ చేసిందా? మూవీ సూపర్ డూపర్ హిట్టా? అభిమానులు ఆహా ఓహో అనేలా ఉందా? ప్రేక్షకుల్ని అలరించేలా ఉందా? లేదంటే ఎవరేజా? ఫట్టా? అమెరికా ఆడియన్స్ 'లైగర్' గురించి ఏమంటున్నారు? సినిమా గురించి సోషల్ మీడియాలో నడుస్తున్న టాక్ ఒకసారి చూడండి...
 
ట్విట్టర్‌లో 'లైగర్'కు నెగిటివ్ టాక్!
అమెరికా ఆడియన్స్ నుంచి... మరీ ముఖ్యంగా ట్విట్టర్‌లో జనాల నుంచి 'లైగర్'కు ఆశించిన స్పందన రాలేదు. నెగిటివ్ రివ్యూలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ అండ్ పూరి జగన్నాథ్ అభిమానులు ఈ రివ్యూలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. పూరి సినిమాలకు రివ్యూలతో పని లేదనేది, హీరోయిజాన్ని ఆయన ఎలివేట్ చేసినట్లు మరొకరు చేయరని ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు.
 
విజయ్ దేవరకొండ బాడీ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌ సూపర్!
'లైగర్' కోసం విజయ్ దేవరకొండ తనను తాను మలుచుకున్న విధానం సూపర్ అని, ఆయన ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌ గ్రేట్ అని కొందరు ట్వీట్లు చేస్తున్నారు. అయితే... పాన్ ఇండియా మార్కెట్‌కు ఇటువంటి సినిమాతో ఇంట్రడ్యూస్ కాకూడదని,ఇదొక బ్యాడ్ ఛాయస్ అని చెబుతున్నారు.
  
మంచి అవకాశాన్ని పూరి వృథా చేసుకున్నారా?
'లైగర్' కథలో మంచి సినిమాకు అవసరమైన పొటెన్షియల్ ఉన్నప్పటికీ... పూరి జగన్నాథ్ మంచి సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో ఫెయిల్ అయ్యారని ఒకరు ట్వీట్ చేశారు. హీరోయిన్ అనన్యా పాండే నటనకు నెగిటివ్ మార్కులు పడ్డాయి. 


Also Read : ఎవరు ఆపుతారో చూద్దాం - బాయ్‌కాట్‌పై విజయ్ దేవరకొండ


సినిమా నచ్చిన జనాలు కూడా ఉన్నారు!
'లైగర్'కు నెగిటివ్ రివ్యూలతో పాటు పాజిటివ్ రివ్యూలూ ఉన్నాయి. అయితే, సినిమా బావుందని ట్వీట్ చేసే జనాల కంటే బాలేదని ట్వీట్లు చేస్తున్న జనాలు ఎక్కువ. అందువల్ల, నెగిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అవుతోంది. విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్స్ ఇంట్రడక్షన్ సీన్, నేపథ్య సంగీతం బావుందని నెటిజన్లలో కొందరు పేర్కొన్నారు. పాటలు మాత్రం బాలేదని అంటున్నారు. రమ్యకృష్ణ సూపర్ యాక్ట్ చేశారని చెబుతున్నారు.  




Also Read : 'లైగర్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా? ఏ ఏరియా రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారో చూడండి




'లైగర్' ట్విట్టర్ రివ్యూలను కింద చూడండి: