ఇప్పుడే ఇక్కడే నువ్వు వాళ్ళకి కావాల్సిన వ్యక్తివని వాళ్ళకి చెప్పేయ్యాలని ఉంది కానీ దేవిని చూసి ఆగాల్సి వస్తుంది, దేవికి నా మీద అనుమానం వచ్చిందంటే నేను వేసిన ప్లాన్ అంతా పాడైపోతుంది. నా మాట విని నాతో పాటు ఇంటికి వచ్చేసేయ్ అని మాధవ్ రాధని బెదిరిస్తాడు. రాధ కారు దగ్గర ఉంటుంది. అక్కడికి వచ్చిన మాధవ్ ఏంటి రాధ మనం ఇద్దరం కలిసి వెళ్దామని ఎదురు చూస్తున్నావా అని అంటాడు. 'నీ నీడ మీదే కాలు వేయడానికి మనసు రాదు గసువంటిది నీతో వస్తానా, మా అత్తమ్మ ముంగట ఏం మాట్లాడను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు రోల్లినవ్ ఏంటి అందరి ముంగట నా ముసుగు తీస్తావా నా బిడ్డతో నువ్వే తన నాయనవని చెప్పిస్తావా మా అత్తమ్మ గుండెలు పగిలేటట్టు చేస్తావా? మా అత్తమ్మ గుండె కాదు అంత దాకా వస్తే నీ తల పగిలిద్ది. నీ కళ్ళతో నువ్వే చూశావ్ చెవులారా విన్నావ్ కదా నా ఇంట్లో నా బిడ్డ ఎంత సంతోషంగా ఉందో నా వాళ్ళు నా బిడ్డని ప్రాణం లెక్క ఎట్లా చూసుకుంటున్నారో బెదిరించి భయపెట్టి బాధపెట్టి రక్త సంబంధాన్ని విడదియ్యలేవు సారు’ అని రాధ కోపంగా అంటోంది.
Also Read: తులసి, సామ్రాట్ గురించి నీచంగా ఆర్టికల్- రచ్చ చేసిన అభి, అనసూయ బుర్రలో విషం నింపిన నందు, లాస్య
అత్తగారి ఇంటికి వచ్చేసరికి చాలా మాటలు వచ్చేస్తున్నాయని మాధవ్ అంటే అవును నా అత్త ఇల్లు అంటే నా ఇల్లు. నువ్వు ఎన్ని కథలు పడినా నేను ఈరోజు ఇక్కడిదాకా వచ్చాను అంటే రేపు నా బిడ్డని ఈ ఇంటికి పంపించలేనా నువ్వు చూస్తా ఉండు నా బిడ్డని వాళ్ళ నాయన దగ్గరకి ఎలా పంపిస్తానో అని రాధ సవాల్ చేస్తుంది. ఆ ఆదిత్యాది నీదు ఒకటే మాట పదేళ్ళు గడిచిపోయినా మనుషుల్లోనే కాదు మాటల్లో కూడా ఏ మాత్రం తేడా లేదు ఆదర్శ దంపతులన్నమాట, ఇందాక మీ అత్తయ్య ముందు అలా మాట్లాడినప్పుడు నువ్వు ఎంత వణికిపోయావో నాకు తెలుసు, అందరి ముందు నీ నిజ స్వరూపం చూపించాలని ఆవేశపడి కూడా ఎందుకు ఆగానో తెలుసా ఆదిత్య, నువ్వు బాగా తెగించారని అర్థం అయ్యింది అందుకే డీల్ చేయాల్సిన పని ఇది కాదని ఆగిపోయాను అని అంటాడు. నేను ఈరోజులా సైలెంట్ గా ఉన్నానని అనుకోకు తట్టుకోలేవు అని హెచ్చరిస్తాడు మాధవ్.
దేవుడమ్మ రుక్మిణి ఫోటో చూసుకుంటూ బాధపడుతుంది. మీ అక్క బిడ్డకి ఎంత ఘనంగా బారసాల ఏర్పాటు చేశానో అదే నీ బిడ్డ ఉంటే ఇంకెంత ఘనంగా చేసేదాన్నో అని ఏడుస్తుంది. నిన్ను మర్చిపోలేక కమల బిడ్డకి రుక్మిణి అని నీ పేరే పెట్టుకున్నాను కానీ మన ఇంటి వారసుడో, వారసురాలో ఉంది ఉంటుంది వాళ్ళకి ఏం పేరు పెట్టావో నాకు తెలియదు, నిన్ను మరచిపోవడం ఈ జన్మలో జరగదు అని బాధపడుతూ మాట్లాడుతూ ఉంటే భాగ్యమ్మ అవి వింటూ ఉంటుంది. దేవి ఇంటికి వెళ్తాను అని అంటే దేవుడమ్మ నువ్వు ఈ ఇంటి పెద్ద మనవరాలివి అప్పుడే వెళ్తావా అని అడుగుతుంది. దేవుడమ్మ జానకికి చీర ఇచ్చి రాధకి ఇవ్వమని చెప్తుంది. మీకు మా రాధని చూపించే బాధ్యత నాది అని జానకి మాట ఇస్తుంది. అది విని సత్య షాక్ అవుతుంది. జానకి దేవుడమ్మ ఇచ్చిన చీర చూస్తూ ఉంటే అది చూసి మాధవ్ రగిలిపోతాడు.
Also Read: యష్ ని ఘోరంగా అవమానించిన కొడుకు ఆదిత్య- తల్లడిల్లిన తండ్రి మనసు
దేవుడమ్మ కమల వాళ్ళతో మాట్లాడుతుంది, రుక్మిణి పేరు పెట్టినందుకు మీరు ఏమనుకుంటున్నారో అని అంటుంది. అనుకోడానికి ఏముంది అంటా మంచిగానే చేశారు కదా నేను కూడా రుక్మిణి పేరు పెట్టాలని అనుకున్నా కానీ నా చెల్లిని గుర్తు చేసుకుని మీరు ఎక్కడ బాధపడతారో అని అనుకున్నామని కమల చెప్తుంది. ఈ ప్రాణం పోయేంత వరకు రుక్మిణిని మర్చిపోవడం జరగదని దేవుడమ్మ అంటుంది. దాని పేరు పెట్టి రుక్మిణి నా కళ్ల ముందే ఉందని ఆనందపడుతున్నా అని చెప్తుంది. రుక్మిణి ఆదిత్యతో తన సంతోషాన్ని పంచుకుంటుంది. ఈ పొద్దు నేను నా వాళ్ళందరిని చూశాను వాళ్ళ దగ్గరకి వచ్చాను అని సంతోషపడుతుంది. దేవి అలా సరదాగా తిరుగుతూ ఉంటే అందరూ తన మీద ప్రేమ చూపించడం చూసి దేవికి నేనేం మీ నాన్నని అని చెప్పాలని అనిపించింది అని ఆదిత్య బాధపడతాడు.