Guppedantha Manasu Actor Ravi Shankar on Negative Comments: సాధారణంగా ఫ్యాన్‌ వార్ అంటే ఇద్దరు స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ మధ్య జరుగుతుంది. తరచూ ఇలాంటి వార్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ ఫ్యాన్స్‌ మధ్య చూశాం. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా టైంలో జూనియర్ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్ ఫ్యాన్స మధ్య చూశారం. కానీ బుల్లితెర హీరోల ఫ్యాన్స్‌ మధ్య వార్‌ జరగడం ఎప్పుడైన విన్నారా? ఎంటీ షాక్‌ అవుతున్నారా? అవును.. ఇద్దరు సీరియల్‌ నటుల ఫ్యాన్స్‌ మధ్య గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో వార్‌ నడుస్తుంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. 


మరి అసాధ్యాన్ని కూడా సాధ్యం చేసింది 'గుప్పెడంత మనసు' సీరియల్‌. స్టార్‌ మాలో ప్రసారమయ్యే ఈ సీరియల్‌ ఎంతటి ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈ సీరియల్‌ హీరో రిషి అకా ముఖేష్‌ గౌడకు విపరీతమైన ప్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడిపై పేరుపై లేక్కలేనన్ని ఫ్యాన్‌ పేజీలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అతడి గర్ల్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువ. రిషి సార్‌గా ఎంతో గుర్తింపు పొందిన ముఖేష్‌ గౌడ కొంతకాలం సీరియల్లో కనిపించని విషయం తెలిసిందే. కొన్ని కారణాల వల్ల రిషి సిరియల్లో నటించలేకపోయాడు. దీంతో అతడి చనిపోయినట్టుగా చిత్రీకరించి సీరియల్‌ నడిపించారు.


దీంతో ఈ పాత్రకు పోటీగా డైరెక్టర్‌ మరో పవర్ఫుల్‌ రోల్‌ క్రియేట్‌ చేసి సీరియల్లోకి దింపాడు. అతడే నటుడు రవి శంకర్‌. మను పాత్రలో రవి శంకర్‌ అచ్చం రిషి సార్‌లాంటి యాటిట్యూడ్‌, స్టైలిష్‌ లుక్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో ఈ పాత్రకు మంచి క్రేజ్‌ వచ్చింది. అతడికి కూడా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. మను రాకతో ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్న గుప్పెడంత మనసు సీరియల్లోకి ఇటీవలె రిషి సార్‌ రీఎంట్రీ ఇచ్చేశాడు. అప్పటి నుంచి ఈ సీరియల్‌ మరింత ఆసక్తి సాగుతుంది. రిషి, మను పాత్రలు నువ్వా-నేనా అన్నట్టు ఉన్నాయి. దీంతో వీరి కోసం సోషల్‌ మీడియలో ఫ్యాన్స్‌ కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఈ వార్‌ వారి మధ్యే కాదు హీరోల పర్సనల్‌ లైఫ్‌ వరకు వెళ్లింది.


రిషి స్థానంలో వచ్చిన మనును టార్గెట్‌ చేస్తూ ముఖేష్‌ గౌడ ఫ్యాన్స్‌ అతడిపై నెగిటివ్‌ కామెంట్స్‌తో విరుచుకుపడుతున్నారు. అతడిని మాత్రమే కాదు తన ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఇందులోకి లాగుతున్నారు. అక్క,చెల్లె, అమ్మను ఉద్దేశిస్తూ దుర్మాషలాడుతున్నారు. ఇదే విషయాన్ని రవి శంకర్‌ ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. "గుప్పెడంత మనసు సీరియల్లో రిషి పాత్రకు ఆరోగ్యం బాగుండకపోవడంతో కథకు ఒక హీరో అవసరని డైరెక్టర్ నన్ను తీసుకున్నారు. దీంతో ఆ పాత్రను నేను ఓకే చేశాను. కానీ కొందరు నా రోల్‌ని టార్గెట్‌ చేసి  తిడుతున్నారు. అమ్మ, అక్క, చెల్లి ఇలా పర్సనల్‌గా కూడా వెళుతున్నారు. నెగిటివ్‌ కామెంట్స్‌ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. వారి ప్రొఫైల్ చూస్తే జీరో ఫాలోవర్స్.  జీరో పోస్టులు ఉన్నాయి. బయటకు వచ్చి మాట్లాడరా అంటే స్పందించడం లేదు" అంటూ చెప్పుకొచ్చాడు. 


Also Read: ఒకప్పటి బుల్లితెర హీరోయిన్‌ పల్లవి రామిశెట్టి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?


అలాగే "నేను ఊరికే సీరియల్లోకి రాలేదు. ఇప్పటికిప్పుడు నేను సీరియల్స్ మానేసినా నాకేం ఇబ్బంది లేదు. నన్ను ఇంట్లో చాలా బ్రహ్మండంగా చూసుకుంటారు. మా ఇంట్లో పది మంది డాక్టర్లు ఉన్నారు. నటన అంటే నాకు ఫ్యాషన్.. అందుకే యాక్టింగ్ చేస్తున్నాను. మా కుటుంబం పేరు మీద కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మాకు గుడి కూడా ఉంది. ధర్మకర్తలుగా ఉన్నాం. మేము సంపాదించిన దాంట్లోంచి దానం చేస్తుంటాం. మా నాన్న ప్రభుత్వంతో మాట్లాడి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఓ ఆటోస్టాండ్‌ కట్టించారు. అందులో నన్ను మెంబర్‌ను కూడా చేశారు. ఇలా నా మీద నెగిటివ్‌ కామెంట్స్‌ చేస్తున్నారని వాళ్లకి చెబితే ఇచ్చిపడేస్తారు. నన్ను అనేవారికి నేను కూడా తిరిగి తిట్టగలను.. కానీ వాళ్లకు, నాకు తేడా ఏముంటుంది. ఇలా పర్సనల్ అటాక్ చేయడం ఎంతవరకు సమంజసం"  అంటూ మను తన ఆవేదన వ్యక్తం చేశాడు.