Shobha Shetty Gifts Mahindra XUV Car To Yashwanth: బిగ్ బాస్ బ్యూటీ శోభాశెట్టి తనకు కాబోయే భర్త యశ్వంత్ కు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది. ఆయన బర్త్ డే సందర్భంగా అదిరిపోయే కారును గిఫ్టుగా ఇచ్చింది. అతడి మీద తనకున్న ప్రేమను వ్యక్తం చేసింది. 


బిగ్ బాస్ షోతో బాగా పాపులర్


బుల్లితెరతో పాటు కొన్ని వెండితెరపైనా కనిపించిన శోభా శెట్టి.. బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘కార్తీకదీపం‘ సీరియల్ లో మోనిత అనే నెగెటివ్ రోల్ పోషించిన ఆమె, బిగ్ బాస్ షోలోనూ అలాగే వ్యవహరించిందనే టాక్ వినిపించింది. షోలో బాగా ఆడినా, పెద్ద ఎత్తున నెగెటివిటీ వచ్చింది. నెటిజన్లు ఆమె తీవ్రస్థాయిలో ట్రోల్ చేశారు. మంచి, చెడో ఏదైతేనేం ఈ షో ద్వారా ఆమె బాగా పాపులర్ అయ్యింది. ఈ షోలోనే శోభాశెట్టి తన ప్రేమ గురించి బయటకు చెప్పింది. తన తోటి నటుడితో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది.  


సహ నటుడితో రీసెంట్ గా నిశ్చితార్థం


రీసెంట్ గా ‘కార్తీకదీపం‘ సీరియల్ లో తనతో కలిసి నటించిన యశ్వంత్ అనే నటుడితో శోభాశెట్టి ఎంగేజ్ మెంట్ జరిగింది. సీరియల్ లో నటిస్తున్న సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారింది. కొంత కాలం పాటు ఇద్దరూ చెట్టాపట్టాల్ వేసుకుని తిరగారు. త్వరలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. రీసెంట్ గా వీళ్లిద్దరు కలిసి కొత్త ఇల్లు కొనుగోలు చేశారు. కలిసి గృహ ప్రవేశం చేశారు.  






కాబోయే శ్రీవారికి ఖరీదైన గిఫ్ట్


తాజాగా కాబోయే శ్రీవారికి శోభాశెట్టి ఖరీదైన గిఫ్టు అందించింది. యశ్వంత్ బర్త్ డే సందర్భంగా కాస్ట్ లీ కారును కొనిచ్చింది. ముందుగానే బుక్ చేసిన బీస్ట్ ఎక్స్ యూవీ 700 కారును బర్త్ సందర్భంగా డెలివరీ తీసుకుంది. యశ్వంత్ తో పాటు తన కుటుంబ సభ్యులను షో రూమ్ కు తీసుకెళ్లి అందరి సమక్షంలో కారు కీస్ అందించింది. ఈ కారు ధర సుమారు రూ. 20 లక్షలు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లికి ముందే ఇల్లు.. ఖరీదైన కారు.. అదిరిందమ్మా శోభమ్మా.. అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. శోభ లాంటి సంపాదించే భార్య దొరికితే ఏ భర్తకైనా సంతోషమే అని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. పెళ్లయ్యాక యశ్వంత్ ఇంట్లో హాయిగా కూర్చొని లైఫ్ ఎంజాయ్ చెయ్యొచ్చని మరికొంత మంది అంటున్నారు.



Also Read: విజయ్ ‘గోట్’ నుంచి రెండో పాట విడుదల - చనిపోయిన సింగర్ వాయిస్‌ను రీక్రియేట్ చేసిన మేకర్స్