Chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: దీక్షితులు గారు అరవిందను ఎందుకు వచ్చావు అని అడిగితే తన కోడలు గురించి అని మిత్ర చెప్తాడు. లక్ష్మీ తన గురించి అడుగుతున్నారేమో అనుకుంటే మిత్ర మా అమ్మకు కాబోయే కోడలు మనీషా గురించి అడగటానికి వచ్చామని అంటాడు. దానికి లక్ష్మితో పాటు అరవింద కూడా షాక్ అవుతుంది.


మిత్ర: మనీషా నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎదురు చూస్తుంది. కానీ ఇంకా నా గతం జ్ఞాపకాలు నన్ను వదలడం లేదు. ఇంకా నా మనసు మీద మరకలుగా ఉండిపోయాయి. అవి వదిలించుకోలేక కొత్త జీవితంలోకి అడుగులు వేయలేక నేను అక్కడే ఆగిపోయాను. దానితో పాటు ఇప్పుడు నా చుట్టూ ఉన్న గండాలు కూడా వలయంలా చుట్టుకున్నాయి. దాంతో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. 
దీక్షితులు: నువ్వు చీకటిలో దీపం వెలిగించడం గురించి మాట్లాడుతున్నావ్ మిత్ర. కానీ నీ చుట్టూ వెలుతురిని గుర్తించడం లేదు. నువ్వు మనీషాని పెళ్లి చేసుకోవాల్సిన సమయం రాలేదు. నిజానికి ఆ సమయం కోసం నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అంటే నీ భార్య లక్ష్మి. 
మిత్ర: దీక్షితులు గారు దయచేసి నా ముందు ఆ పేరు పలకకండి.
దీక్షితులు: ఏమైంది మిత్ర.
మిత్ర: నమ్మకద్రోహం చేసే మనుషులు నా ఎదురుగా ఉండటానికి వీల్లేదు. వారి పేరుకూడా నా ముందు వినపడటానికి వీల్లేదు.
దీక్షితులు: మన కంటికి కనిపించిది మనసుకి అనిపించింది నిజం అనుకోవడం పొరపాటు.
మిత్ర: లక్ష్మి చేసిన ద్రోహంతో నా గుండె ఎప్పుడో పగిలిపోయింది. అందుకే ఆ మనిషిని గానీ ఆ పేరుని గానీ నేను జీవితంలో క్షమించలేను.
  
మిత్ర, అరవిందలను దీక్షితులు పంపేస్తారు. లక్ష్మికి ధైర్యం చెప్తారు. మరోవైపు మనీషా మిత్ర, అరవిందల కోసం ఎదురు చూస్తుంది. దేవయాని మనీషాకు వాళ్ల గురించి ఎదురు చూడొద్దని చెప్తుంది. లక్ష్మి బతికే ఉందని అరవింద నమ్మకం అని ఆ నమ్మకం ఉంచాలా వద్దా అని దీక్షితులు గారిని అడగటానికి వెళ్లుంటారు అని అంటుంది. ఇంతలో మిత్ర వాళ్లు వస్తారు. ఏమైందని మనీషా అడిగితే పెళ్లి గురించి ఇంకా కొంత టైం వేచి ఉండమని దీక్షితులు గారు చెప్పారని అంటాడు. మనీషా మిత్రతో మన పెళ్లి అవుతుందా లేదా అర్థం కావడం లేదు అని ఏడుస్తుంది. దేవయాని మాత్రం మిత్రకు పెళ్లి గాలిలో దీపం లాంటిదని మిత్ర కోసం ఆగి తన కొడుకు జీవితం నాశనం చేయలేను అని వివేక్‌కి ఓ సంబంధం చూశాను అని రేపే ముహూర్తాలు పెట్టిస్తాను అంటుంది. అరవింద అడ్డుకుంటే దేవయాని తన కొడుకు పెళ్లి తన ఇష్టమని అంటుంది. వివేక్ తన పెళ్లి గురించి తనకు నిర్ణయం తీసుకునే హక్కులేదా అంటే దేవయాని తనకు నచ్చిన పెళ్లి చేస్తాను అంటుంది. 


వివేక్: అమ్మ నేనే జానుని ప్రేమించాను. తననే పెళ్లి చేసుకుంటాను.
దేవయాని: సరేరా నా మాట విను. నువ్వు నన్ను కాదు అని జానుని పెళ్లి చేసుకుంటే నా శవాన్ని చూస్తావ్. 
మిత్ర: పిన్ని అసలు నువ్వు మాట్లాడేదానికి అర్థముందా. నువ్వు చేసే పనిలో అర్థం లేదు. నువ్వు చేసే పనిలో వాడికి భవిష్యత్ ఉండదు.
దేవయాని: ఇక్కడ ఎవరికి నచ్చింది వాళ్లు చేస్తున్నారు. నాకు నచ్చింది నేను చేస్తున్నా.
మనీషా: ఇక్కడ సమస్య నా పెళ్లి దానికి పరిష్కారం చూడండి. మా అమ్మ ఎలాంటి పరిస్థితుల్లో చనిపోయిందో మీకు తెలుసు. ఎవరి వల్ల తన ప్రాణాలు గాల్లో కలిసిపోయాయో మీకు తెలుసు. నా మీద మీకు జాలి లేదా. ఇదే మీ పెద్దరికం. 
అరవింద: మీ అమ్మ చావుని అడ్డు పెట్టుకొని నువ్వు ఎన్ని చేశావో నాకు తెలుసు. వాటి గురించి మాట్లాడమంటావా. నా నోరు తెరవమంటావా.
మిత్ర: అమ్మ నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావ్. మనీషా నాటకాలు ఆడటం ఏంటి.


మనీషా గతంలో లక్ష్మిని బెదిరించి మిత్రకు దూరంగా వెళ్లిపోమని చెప్పి ఉంటుంది. మిత్ర మనీషాతో ఇంట్లో అందరితో నువ్వు చక్కగా ఉంటేనే మన పెళ్లి జరుగుతుందని చెప్పి వెళ్లి పోతాడు. దేవయాని మనీషాకి ధైర్యం చెప్తుంది. అరవింద మిత్రకు మేటర్ చెప్తే ఈ కుటుంబంలో నీకు చోటు దక్కదని అంటుంది. మనీషా వివేక్ పెళ్లిలోనే తనకు మిత్రకు పెళ్లి జరిగేలా ప్లాన్ చేస్తున్నా అని అంటుంది.


మరోవైపు అర్జున్ వాళ్లు లక్ష్మి గురించి టెన్షన్ పడుతుంటారు. పోలీసులకు చెప్తారు. ఇంతలో లక్ష్మి ఇంటికి చేరుకుంటుంది. జున్ను లక్ష్మిని హగ్ చేసుకొని నా కంటే అర్జున్ బాబ ఎక్కువ టెన్షన్ పడ్డారు అని అందరికీ ఫోన్ చేశారు అని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఫోటో ఇచ్చి వెతకమన్నారని చెప్తాడు. లక్ష్మి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినందుకు తన ఫొటో ఇచ్చినందుకు అర్జున్‌ మీద కోప్పడుతుంది. తన గురించి అందరికీ తెలియాలి అని ఇలా చేస్తున్నారా అని సీరియస్ అవుతుంది. నేను మీ దగ్గర పని చేస్తున్నాను అని ఎవరి హద్దులు వాళ్లు తెలుసుకొని ప్రవర్తిస్తే మంచిదని తిట్టి వెళ్లిపోతుంది. అర్జున్ చాలా బాధ పడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: అత్తని నోటికొచ్చినట్లు తిట్టి రచ్చ చేసిన సీత.. విద్యాదేవి శివకృష్ణతో మాట్లాడిందని మహాకి తెలిసిపోతుందా!