Guppedanta Manasu  Serial Today Episode: వసుధార నిద్రపోతుంది. రంగ వచ్చి వసుధారను నిద్ర లేపి నేను రిషినేనని కొన్ని పరిస్థితుల కారణంగా ఇలా ఉండాల్సి వచ్చిందని ఇప్పుడే మనం మన ఇంటికి వెళ్దాం పద అనగానే వసుధార లేచి వెళ్లబోతుంది. వెంటనే పూల కుండి కిందపడిపోతుంది. అందరూ నిద్ర లేస్తారు. వసుధార షాక్‌ అవుతుంది. రిషి సార్.. అంటుంది. ఇంతలో రాధమ్మ నిద్రలేచి వచ్చి అమ్మా ఏదైనా కల కన్నావా? అని అడుగుతుంది. వసుధార ఏం మాట్లాడదు. రాధమ్మ రూంలోకి  తీసుకెళ్లి పడుకోబెడుతుంది. మరోవైపు  ఎంజెల్‌, మనుకు ఫోన్‌ చేస్తుంది. నిన్ను కలవాలని వచ్చాను మీ ఇంటి బయటే ఉన్నాను అంటుంది.


మను: ఏంటి అంత ఇంపార్టెంట్‌ విషయం.


ఎంజెల్‌: నాకు ఐస్‌క్రీం తినాలని ఉంది.


మను: ఇది ఇంపార్టెంట్‌ విషయమా? నేను ఎలా కనిపిస్తున్నాను నీకు


ఎంజెల్‌: బాగానే కనిపిస్తున్నావు. మంచి హెయిర్‌ స్టయిల్‌. మంచి ఫిజిక్కు. డ్రెసింగ్‌ సెన్స్‌ బాగానే ఉంది. చాలా బాగానే కనిపిస్తున్నావు.


మను: జోకులు కాదు.


అనగానే నువ్వు ఐస్‌క్రీం తినిపిస్తావా? లేక అత్తయ్యను పిలవమంటావా? అనగానే సరే వస్తాలే అని ఇద్దరూ కలిసి వెళ్లి ఐస్‌ క్రీం తింటుంటారు. ఎంజెల్‌ ఒక విషయం అడుగుతాను సీరియస్‌గా తీసుకోమని చెప్తూ.. నేను రిషిని ప్రేమించానని కానీ రిషి వసుధారను పెళ్లి చేసుకున్నాడు అని చెప్తుంటే అదంతా నాకెందుకు చెప్తున్నావు.. అని మను అడిగితే తర్వాత నువ్వు బాధపడకూడదని ఎంజెల్‌ చెప్తుంది. మరోవైపు స్టూడెంట్స్‌ ధర్నా చేస్తుంటారు. మహేంద్ర వచ్చి ఎందుకు  ధర్నా చేస్తున్నారు  అని అడుగుతాడు.


స్టూడెంట్స్‌: మాకు న్యాయం కావాలి సార్‌


మహేంద్ర: ఏం న్యాయం.


స్టూడెంట్స్‌: మాకు  శైలేంద్ర సార్‌ ఎండీగా కావాలి సార్‌, వు వాంట్‌ శైలేంద్ర సార్‌


మహేంద్ర: వీళ్లందరూ కాలేజీ స్టూడెంట్స్‌ కాదు. ఆ శైలేంద్ర గాడే వీళ్లను అరైంజ్‌ చేసినట్టు ఉన్నాడు. ( అని మనసులో అనుకుంటాడు.)


శైలేంద్ర: వీళ్లు చాలా బాగా యాక్ట్‌ చేస్తున్నారు. మనం ఇంకాస్త పెంచాలి ( అని మనసులో అనుకుంటాడు.) ఏయ్‌ ఆగండి మీరు ఇలా అరిస్తే క్లాసులు డిస్టర్బ్‌ అవుతాయి.


స్టూడెంట్స్‌ : ఏది ఏమైనా మీరే మాకు ఎండీగా కావాలి సార్‌.


ALSO READ: ఎన్ని యుగాలైనా.. ఎన్ని అవకాశాలు ఇచ్చిన మనిషి మారడు - గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న 'కల్కి' రిలీజ్‌ ట్రైలర్‌


అంటూ విద్యార్థులు నినాదాలు  చేస్తుంటే శైలేంద్ర వాళ్లను ఇన్‌డైరెక్టుగా ఎక్కువ రెచ్చగొడతాడు. మిమ్మల్ని ఎండీగా ఎన్నుకునేవరకు మేము ఇక్కడి నుంచి కదలము అని నినాదాలు చేస్తుంటారు. ఇంతలో మను వచ్చి ఒక స్టూడెంట్‌ను బాబు నీకు ఎంత ఇచ్చాడని అడుగుతాడు. వాడు రెండు వందలు ఇచ్చాడని చెప్పగానే మను మిగతా వాళ్లకు ఐదు వందలు ఇచ్చాడని నిన్ను శైలేంద్ర మోసం చేశాడని చెప్పగానే స్టూడెంట్స్‌ అందరూ గొడవపడి శైలేంద్రను తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. దీంతో మను, మహేంద్ర నవ్వుకుంటారు. ఇంతలో మరికొంత మంది స్టూడెంట్స్‌ వస్తే వాళ్లను మను...  శైలేంద్ర ఎండీ అయితే ఓకేనా అంటే ఆయనకు ఎం తెలియదు అని శైలేంద్ర ఇజ్జత్‌ తీస్తారు. దీంతో మను, మహేంద్ర పడి పడి నవ్వుకుంటారు.


మహేంద్ర: ఎంతకు తెగించావురా? బయటి వాళ్లకు డబ్బులిచ్చి కాలేజీలో గొడవ చేయిస్తావా? ఈ విషయం నేను ఊరికే  వదలను మీ డాడీకి చెప్తాను.


శైలేంద్ర: వద్దు బాబాయ్‌ తప్పై పోయింది. ఇంకో సారి ఇలా చేయను. ఈ విషయం డాడికి తెలిస్తే కొడతారు. ప్లీజ్‌ బాబాయ్‌.


మహేంద్ర: తప్పులు చేయడం.. చేసిన తప్పు బయటపడ్డాక కాళ్లా వేళ్లా పడటం. ఇప్పటికైనా మారు.


అని చెప్పి మను, మహేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత తన చాంబర్‌లో పని చేసుకుంటున్న మను దగ్గరకు ఎంజెల్‌  వస్తుంది. బయటకు వెళ్దాం పద అని అడుగుతుంది. మను రాను అనడంతో చెయ్యి పట్టుకుని లాగుతుంది. ఇంతలో శైలేంద్ర వచ్చి మా కాలేజీలో అక్రమంగా దూరి అడ్డమైన పనులు చేస్తున్నావా? అంటూ ప్రశ్నించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.