Trinayani Today Episode త్రినయని నేను చావను అని పెద్ద పెద్దగా అరుస్తుంది. గాయత్రీ దేవి ఎక్కడుంది అని మొత్తం తిరుగుతుంది. హాసిని పిచ్చిపట్టిందాని తిలోత్తమని అంటే నాకు పిచ్చి పట్టలేదు వచ్చిన అక్కయ్య ఆత్మని పట్టుకోవాలి అని అంటుంది. విశాల్ కోపంగా అమ్మ ఏమైంది నీకు ఏం మాట్లాడుతున్నావ్ అని అంటుంది. దీంతో నయని అద్దంలోకి చూడండి అత్తయ్య అని అంటుంది.


తిలోత్తమ: ఈ అద్దంలోకి చూస్తుంటే ఆత్మ కనిపిస్తుంది. అటు చూస్తే ఫొటో కనిపిస్తుంది. ఏంటి ఈ మాయ. ధైర్యముంటే నేరుగా కనిపించమని. ఎక్కడున్నావ్ అక్క నాకు కనిపించు. నా కళ్లెదురుగా కనిపించు అక్క.
నయని: ఇక్కడే ఉన్నారు అత్తయ్యగారు.
తిలోత్తమ: ఎక్కడ.
నయని: ఈ అద్దంలో.
తిలోత్తమ: నవ్వకు అక్క. నవ్వకు. నవ్వకు అంటూ తిలోత్తమ తన కుడి చేతితో అద్దం పగల గొట్టేస్తుంది. దీంతో తిలోత్తమ కుడి చేతి నుంచి నల్లని మట్టి జారుతుంది. 
గాయత్రీదేవి: నయని నువ్వు కనుక్కోవాల్సింది అదే.
విక్రాంత్: చేతికి గాయం అవ్వకుండా రక్తం రాకుండా నల్లగా ఏదో పొడి రాలుతుంది. 
నయని: అమ్మగారు.. 
విశాల్: నయని అమ్మ వచ్చిందా.
తిలోత్తమ: లేదు బాబుగారు తిలోత్తమ అత్తమ్మకు ఏమైందా కనిపించారా ఇలా ప్రవర్తించారు అని అడిగాను.
హాసిని: ఈ పొడి మసిలా అంటుకుంటుందేంటి.


హాసిని నయని దగ్గరకు వచ్చి గాయత్రీ అత్తమ్మ వచ్చింది కదా అని అడుగుతుంది. సుమన అది చూసి వీళ్ల మాటలు తిలోత్తమ అత్తయ్యకి చూపించాలి అని వీడియో తీస్తుంది. హాసిని ఒట్టు వేస్తుంది. దాంతో నయని గాయత్రీ అమ్మగారు వచ్చారని చెప్తుంది. తనని మాట్లాడొద్దని అందుకే తిలోత్తమ పిచ్చిదానిలా ప్రవర్తించిందని అంటుంది. 


తిలోత్తమ గంటలమ్మ దగ్గరకు వెళ్లి తన చేతికి గాయం అయిందని చేతి నుంచి మసి రావడం ఇంట్లో వాళ్లు చూశారని చెప్తుంది. ఇక తిలోత్తమ ముందు ముగ్గు వేసి ముగ్గు మీద చేయి వేయమని గంటలమ్మ చెప్తుంది. తిలోత్తమ అలా చేయగానే గంటలమ్మ చాకుతో నిమ్మకాయ కోసి మంత్రాలు చదువుతూ తిలోత్తమ చేతి మీద వేస్తుంది. తిలోత్తమ మంట అని అరుస్తుంది. తన కుడి చేయి పెద్దగా వణుకుతుంది. గంటలమ్మ మంత్రాలకు తిలోత్తమ చేతి నుంచి మసి రాలడం ఆగిపోతుంది. మరోవైపు నయని బయట ఉంటే ఇంతకు ముందు వచ్చి ఆ బాబు వస్తాడు. మీ అత్తయ్య ఏం చేస్తుందో అని భయపడపడ్డాను అని చెప్తాడు. నయని షాక్ అవుతుంది. 


హర్ష: మీ అత్త తాంత్ర విద్యలు నేర్చుకుంది. రెండు చేతుల్ని మట్టిలో పెట్టుకొని కాల్చుకుంది అక్క. 
నయని: అందుకా ఆవిడ అలా ప్రయత్నిస్తుంది.
హర్ష: అవును అక్క ఈ రహస్యం నీకు చెప్పలని చాలా సార్లు ప్రయత్నించా ఇప్పుడు కదిరింది.
నయని: మంచిది హర్ష నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. ఎలాంటి దుర్మార్గపు ఆలోచనలతో ఆ రాక్షసి దుష్ట శక్తిగా మారిపోయిందో ఏంటో. నేను తల పడతాను. ఎవరికీ ఎలాంటి హాని జరగకుండా ఢీ కొడతా.
హర్ష: జాగ్రత్త అక్క.
నయని: హర్ష నీ విషయంలో ఏం జరిగిందో చెప్పలేదు.
హర్ష: వచ్చే అమావాస్యకి వివరంగా చెప్తాను అక్క.


నయని: హర్ష బాబు చెప్పినప్పుడు తన కళ్లలో భయం చూశా. వచ్చే అమావాస్యకి ఏం చెప్తాడు.
విశాల్: నయని నీలో నువ్వు మాట్లాడుతున్నావ్ అంటే ఆబ్ధికం అప్పుడు అమ్మ ఎందుకు రాలేదు అని ఆలోచిస్తున్నావ్ కదా.
నయని: బాబు గారు మిమల్ని కన్న తల్లి కంటే పెంచిన తల్లి గురించే ఎక్కువ ఆలోచిస్తున్నాను. సమస్య అయితే పరిష్కరించొచ్చు కానీ ఆవిడే ఆపదలా మారింది బాబు. సర్పదీవికి వెళ్లి వచ్చిన తిలోత్తమ అత్తను సాధారణ మనిషిలా జత కడితే పొరపాటు పడినట్లే. తను భిన్నమైన మనిషిలా మారిందని అందుకు ప్రయత్నం చేసిందని నాకు అనుమానంగా ఉంది. తన మనస్తత్వం మారింది. తన ఆలోచన విధానంలో తేడా ఉంది. ఇంకో మాటలో చెప్పాలి అంటే ఇంతకు ముందు ఉండే మొండి తిలోత్తమ అత్తయ్య కాదు. 
విశాల్: చాలా విషయాలు దాచిపెడుతుంది.
నయని: అన్నింటిని బయట పెట్టడానికి కూడా ప్రయత్నిస్తుంది. అయితే మాటతో చెప్పదు. చేతలతోనే చేసి చూపించాలి అనుకుంటుంది. నష్టం జరిగినా పర్వాలేదు కానీ తన ఉనికిని చాటాలనుకోవాలి అనుకున్నవారితో ప్రమాదం బాబుగారు. తన ఆలోచనల్ని అంచనాలు వేయలేం. రేపు ఏదో చేయబోతుందని నాకు అనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండాలి. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహాలక్ష్మిని రఫ్పాడించేసిన విద్యాదేవి.. సుమతి గురించి తెలుసుకున్న మహా తన చేతులతోనే చంపేస్తానంటూ శపథం!