Bigg Boss Telugu Season 8 Promo Coming Soon: బుల్లితెరపై ఎంతో ఆదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్‌. ఈ షో వరల్డ్‌ వైడ్‌గా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది.  గుర్తింపు ఉన్న సెలబ్రిటీలను ఒకే దగ్గరపెట్టి వారితో మూడు నెలల పాటు ఎంటర్‌టైన్‌ చెపిస్తుంది ఈ షో. ఈ క్రమంలో హౌజ్‌ జరిగే గొడవలు, వాదనలు, లవ్‌ ట్రాక్స్‌, గాసిప్స్‌ ఇలా బుల్లితెర ఆడియన్స్‌కి ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తుంది. ఆడియన్స్‌ నుంచి ఎంతో ఆదరణ పొందుతున్న ఈ షో ఓ వర్గం నుంచి కూడా వ్యతిరేకత ఉంది.


అయినా కూడా బిగ్‌బాస్‌ నిర్వహకులు సీజన్‌ సీజన్‌కు కొత్త కాన్సెప్ట్‌, డిఫరెంట్‌ టాస్క్‌లతో ఈ షోను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంది. వరల్డ్‌ వైడ్‌గా ఎంతో ఫేమస్ అయినా బిగ్‌బాస్‌ తెలుగులో ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక త్వరలోనే సీజన్‌ 8తో రెడీ అవుతుంది. మొన్నటి వరకు అసలు బిగ్‌బాస్‌ సీజన్‌ 8 ఉంటుందా? లేదా? అనే అనుమానాలు ఉండేవి. కానీ వాటిన్నింటికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ సీజన్‌ 8 రాబోతుందంటూ గట్టి ప్రచారం జరుగుతుంది. దీనిపై ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ లేకపోయినా.. త్వరలో బిగ్‌బాస్‌ సీజన్‌ 8 రావడం పక్కా అంటున్నారు. ఈ క్రమంలో ఈ సీజన్‌ కంటెస్టెంట్స్‌ కూడా వీరే అంటూ ఓ జాబితా వైరల్ అవుతుంది. 


అప్పుడే ప్రోమో..


మరోవైపు బిగ్‌బాస్‌ 8 ప్రోమో రానుందంటూ తాజాగా ఓ అప్‌డేట్‌ బయటకు వచ్చింది.  లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 8కి సంబంధించి ప్రోమో రెడీ అయ్యిందని, త్వరలోనే దీనిపై ఆఫీషియన్‌ అనౌన్స్‌మెంట్‌ ఇస్తూ ప్రోమోను రిలీజ్‌ చేసేందుకు బిగ్‌బాస్‌ టీం ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. జూలై ఫస్ట్‌ వీక్‌ ప్రోమో రిలీజ్ కానుందంటూ సోషల్‌ మీడియోలో ఓ అప్‌డేట్‌ చక్కర్లు కొడుతుంది. ఈసారి రెట్టింపు వినోదం అంటూ హెస్ట్ నాగార్జునతో ప్రోమో రిలీజ్‌కు టీం ప్లాన్‌ చేసిందట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా సీజన్‌ 7 లాగే.. సీజన్‌ 8ని సరికొత్తగా ప్లాన్‌ చేసిందట బిగ్‌బాస్‌ టీం. ఎన్నడూ లేని విధంగా సరికొత్త టాస్క్‌లు, ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న సెలబ్రిటీలను, కామన్‌ మ్యాన్‌, సోషల్‌ మీడియా ఇన్‌ప్లూయేన్సర్లను హౌజ్‌లోకి దింపుతున్నారట.


ఇక కంటెస్టెంట్‌ లిస్ట్‌లో మొదటగా 'బ్రహ్మముడి' సీరియల్‌ కావ్య (ఆలియాస్‌ దీపికా రంగరాజు) పేరు వినిపిస్తుంది. కాగా సీరియల్లో ఉత్తమ కోడలిగా, అనుకువగా కనిపించే కావ్య బయట అల్లరి పిల్ల అనే విషయం తెలిసిందే. షోలో ఆమె చేసే అల్లరి అంతా ఇంతకాదు. ఇక దీపికాను బిగ్‌బాస్‌ హౌజ్‌లో దింపితే ఆమె చేసే ఫన్‌, సందడి బిగ్‌బాస్‌కు ప్లస్‌ అవుతుందని ఆమెను తీసుకునేందుకు బిగ్‌బాస్‌ టీం ప్లాన్‌ చేస్తుంది. మరి ఇందుకు దీపికా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందో లేదో చూడాలి. ఇక బిగ్‌బాస్‌ సీజన్‌ 8 సెప్టెంబర్‌ ప్రారంభం కానుందని గుసగుస.  ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ హోస్ట్‌ విషయంలో ముందునుంచి ఎన్నో సందేహాలు ఉన్నాయి. సీజన్‌ 7 విన్నర్‌గా కామన్‌ మ్యాన్‌ పల్లవి ప్రశాంత్‌ గెలిపించడం వివాదానికి దారి తీసింది.



సీజన్ 7ను చూట్టుముట్టిన వివాదాలు.. 


ఫైనల్‌ రోజు బిగ్‌బాస్‌ ట్రోఫీతో బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్‌.. ఫ్యాన్స్‌ చేసిన రచ్చ వల్ల పెద్ద వివాదం చెలరేగింది. అలా సీజన్‌ 7 మంచి విజయం సాధించినా.. వివాదాలు కూడా అదే స్థాయిలో చూట్టుముట్టాయి. పల్లవి ప్రశాంత్‌పై కేసు కూడా నమోదైంది. అప్పట్లో ఇది తీవ్ర దూమారం రేపింది. ఈ కాంట్రవర్సిలో హోస్ట్‌ నాగార్జున పేరును కలుపుతూ ఆయనపై కేసు నమోదు చేయాలంటూ పలువురు డిమాండ్‌ చేశారు. దీంతో నాగార్జున బిగ్‌బాస్‌ హోస్ట్‌ నుంచి తప్పుకున్నారంటూ ప్రచారం చేశారు. ఆయన స్థానంలో మాజీ కంటెస్టెంట్‌ శివాజీ పేరు కూడా వినిపించింది. కానీ అవన్ని అపోహాలే అని. సీజన్‌ 8 హోస్ట్‌ నాగార్జునే అంటూ ఓ అప్‌డేట్‌ బయటకు వచ్చింది.


Also Read: ‘బిగ్ బాస్’లోకి ఎంట్రీ ఇవ్వనున్న ‘బ్రహ్మముడి’ కావ్య - ఇదిగో ఇలా హింట్ ఇచ్చేశారుగా, ఇక అల్లరే అల్లరి