Divi Vadthya About bg Boss And Her Caree: దివి.. యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఇన్ స్టాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. మోడల్ గా తన కెరీర్‌ను స్టార్ట్ చేసిన దివి ఆ తర్వాత బిగ్ బాస్ కి వెళ్లి కుర్రకారు మనసు దోచుకుంది. యూత్ లో ఫాలోయింగ్ పెంచుకుంది. ఇక ఇప్పుడు యాక్టింగ్ లో బిజీగా ఉంది. అయితే, ఆ ఛాన్సులు ఈజీగా రాలేదని చెప్తోంది. సినిమాలో ఛాన్స్ రావాలంటే బతిమిలాడాలని, తగ్గి ఉండాలని చెప్తోంది. రవితేజ సినిమాలో ఛాన్స్ అంటూ చీట్ చేశారని తన గురించి చెప్పుకొచ్చింది.
బిగ్ బాస్ కి వెళ్లొద్దు అనుకున్నా.. బాయ్ ఫ్రెండ్ ఉండొద్దని ఫిక్స్ అయ్యా..
"బిగ్ బాస్ లో ఎవ్వరితో స్ట్రాంగ్ బాండింగ్ పెట్టుకోవద్దని ఫిక్స్ అయ్యి వెళ్లాను. మంచి పేరు రాకపోయినా పర్లేదు. చెడ్డ పేరు తెచ్చుకోవద్దు అని ఫిక్స్ అనుకున్నా. అమ్మ నేను వెళ్లను అని చెప్పాను. నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అవకాశాలైనా వస్తాయి. అక్కడికి వెళ్తే రాకపోవచ్చు కూడా అని అన్నాను అమ్మతో. వెళ్లేముందు దాదాపు ఒక 100 మంది సలహాలు తీసుకున్నా. ఎలా ఉండాలి? ఎలా ఆడాలి? అని. ఎక్కువ సలహాలు తీసుకున్నా ఇబ్బందే. కానీ, ఒక్కటి ఫిక్స్ అయ్యి వెళ్లాను. నాకు బాయ్ ఫ్రెండ్స్ వద్దు. నిజానికి బాయ్ ఫ్రెండ్స్ చేసుకోవాలనేంత గొప్పవాళ్లు కూడా ఎవ్వరూ లేకుండే లోపల. నాకు కనెక్ట్ అయ్యేవాళ్లు ఎవ్వరూ లేరు. ఇక పండుగ రోజు బయటకి వచ్చా. అయిపోయింది ఇంక నా లైఫ్ నెగటివ్ ఇంకా అని అనుకున్నా. కానీ, ఇప్పుడంతా డిఫరెంట్. ఫ్యామిలీలో లేడీస్, పిల్లలు అందరూ బాగా సపోర్ట్ చేశారు. దానివల్ల చాలామంది గుర్తు పడుతున్నారు. కానీ, అంతకంటే ముందు చాలా కష్టాలు పడ్డాను కెరీర్ లో" అని తన బిగ్ బాస్ అనుభవాలు చెప్పింది దివి.
తగ్గి ఉండాలి.. మాట్లాడకూడదు..
"సినిమా ప్రపంచం అనేది అన్ స్టేబుల్. నీకు లైఫ్ వచ్చినా, రాకపోయినా ఈ కెరీర్ అన్ స్టేబుల్. మనకు వచ్చిన ఛాన్స్ మనకి ఉండకపోవచ్చు. మనల్ని అనుకున్న ప్లేస్ లో ఇంకో పదిమందిని మార్చొచ్చు. ఆ పదిమందిని మార్చకుండా ఉండాలంటే వాళ్లను ఎప్పుడూ ఫాలోఅప్ చేయాలి, రిక్వెస్ట్ చేస్తుండాలి, తగ్గి ఉండాలి, బతిమాలుతుండాలి, గ్రౌండెడ్ గా ఉండాలి, గమ్మున ఉండాలి ఇవన్నీ ఉంటాయి. ఎవ్వడూ తోపు కాదు. ఛాన్సులు వచ్చి వెళ్లిపోతూనే ఉంటాయి. ఎవ్వరూ హెల్ప్ చేయలేరు. కొంతమంది మనల్ని అర్థం చేసుకోరు. ఇంత కష్టపడి, ఇంత చేసి చిన్నప్పుడు తీసుకున్న బడ్జెట్ ఇస్తాము. మీకు ఇంతే.. ఇంతకే వర్క్ చేయండి. మీకు ఇంతే ఇస్తాం అన్నప్పుడు బాధ అనిపిస్తుంది. ఇంత కష్టపడ్డాం కదా.. ఖర్చులు ఉంటాయి కదా. చూపించుకోవాల్సింది ఎక్కువ ఉంటుంది. వేసుకునేడ్రెస్సు, పట్టుకునే బ్యాగు, కారు, వెళ్లే రెస్టారెంట్ అన్నీ ఖర్చులు పెరిగిపోతాయి. అలాంటప్పుడు వాల్యూ ఇవ్వకుండా ఇంతే అంటే కచ్చితంగా హర్ట్ అవుతాం. అరే ఇంతేనా అనిపిస్తుంది. అయితే, కమర్షియల్ గా తగ్గాలి. లేదంటే సెల్ఫ్ రెస్పెక్ట్ నైనా చంపుకోవాలి. "
ఒక్కోసారి ఫ్రీగా చేశాను..
"మోడలింగ్ చేసేటప్పుడు నా ఫస్ట్ రెమ్యునరేషన్ రూ.5 వేలు, అక్కడ నుంచి రూ.లక్ష వరకు వచ్చింది. అలా అలా పెరుగుతూ వచ్చింది. ఒక్కోసారి ఫ్రీగా చేస్తాం. ఒక్కోసారి ఛారిటీ కోసం చేస్తాం. ఒక్కోసారి ఫ్రెండ్స్ కోసం చేస్తాం. అలా అని కావాలని తీసుకెళ్లి పాత కాలం బడ్జెట్ లో పడేస్తాం అన్నప్పుడు బాధేస్తుంది. కొన్ని కొన్ని సార్లు తప్పదు. అన్ని భరించాలి."
ఛాన్స్ ఇచ్చి చీట్ చేశారు..
"రవితేజ గారి సినిమాలో ముగ్గురు లీడ్స్. ఒక లీడ్ గా నన్ను ఓకే చేశారు. నాకు ఆఫర్స్ రానప్పుడు దిండు మీద తలపెట్టి ముక్కి ముక్కి ఏడ్చేదాన్ని. మా అమ్మ నాన్నకి తెలియకుండా, సౌండ్ రాకుండా ఏడ్చేదాన్ని. ఎందుకంటే ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి అని అడుగుతారని. అదే బెడ్ లో అదే దిండ్లతో రవితేజ గారితో ఆఫర్ వచ్చినప్పుడు ఆనందం పంచుకున్నాను. మైండ్ లో స్పీచ్ ప్రిపేర్ చేసుకున్నా. ఆడియో లాంచ్ లో ఇలా మాట్లాడాలి, ఇది మాట్లాడాలి అని ప్రిపేర్ అయ్యా. స్టేజ్ ముందు చాలామంది ఉంటారు అసలే నాకు మాట్లాడం రాదు. ఇంతమంది ముందు మాట్లాడాలంటే స్పీచ్ రెడీ చేసుకోవాలి అని రోజు రాత్రి మాట్లాడుకునే దాన్ని. మూవీ నుంచి కాల్ వచ్చింది "నువ్వు ఫిక్స్. నీకు కాల్ వస్తుంది అప్పటి వరకు బయటికి చెప్పకండి" అని అన్నారు. కాల్ రాదే. సినిమా ఆఫీస్ కి వెళ్లి లుక్ టెస్ట్ చేశాను. నేను లుక్ టెస్ట్ లు చేసి పంపాను. రవితేజ గారి పక్కన అంటే కెరీర్ సెట్ అయిపోతుంది కదా నాకు. తీసేసుకున్నారు అనుకున్నాను కానీ, అవ్వలేదు. అది ఒక హార్ష్ రియాల్టీ."
నెగటివ్ కామెంట్స్ హార్ట్ కి తీసుకోను..
"ఫోక్ సాంగ్ నాకు ఫస్ట్ ది. డ్యాన్స్ నాకు కొత్త. శేఖర్ మాస్టర్ ఒక్కొకరినీ బెండు తీయిస్తాడు. ఆయన చాలా బాగా చేపించాడు. సాంగ్ అయిపోయిన తర్వాత కామెంట్స్ చాలా బ్యాడ్ గా వచ్చాయి. 3000 కామెంట్లు బ్యాడ్ గా వచ్చాయి. ఎవరైనా ఎదుగుతుంటే ఎవ్వరూ చూడలేరు. జనాలకు చాలా ఖాళీగా ఉంటూ, టైంపాస్ కి ఏం చేయాలో తెలీక కామెంట్లు పెడుతుంటారు. ఎవరో ఏదో అంటే మనం హార్ట్కి తీసుకోవద్దు. నాకు కొత్త కాబట్టి 3000 నెగటివ్ కామెంట్లు ఏంటి? ఇదేంటి? అదేంటి? అనుకున్నాను. నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. అప్పుడు అనుకున్నాను.. ఈ కామెంట్లను హార్ట్ కి తీసుకోవద్దు" అని తన కెరీర్ గురించి పంచుకున్నారు దివి.