Kalki Second Trailer Release: రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో 'కల్కి 2898 AD' మూవీ నుంచి రోజుకో ఆసక్తికర అప్‌డేట్ వదులుతుంది మూవీ టీం. జూన్ 27న వరల్డ్ వైడ్‌గా కల్కి మూవీ విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, భైరవ అంథమ్ సాంగ్ విపరీతమైన బజ్ క్రియేట్ చేశాయి. ఇక ముంబైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌లు ఇచ్చిన అప్‌డేట్స్ మూవీపై మరింత క్యూరియాసిటిని పెంచాయి.
ఇక మూవీ టీం తీరు చూస్తుంటే ప్రమోషనల్ ఈవెంట్స్‌పై కాకుండ కల్కి టీం అప్‌డేట్స్‌తో సినిమాను ప్రమోట్ చేస్తుందనిపిస్తుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషనల్‌లో భాగంగా కల్కి రిలీజ్ ట్రైలర్‌ను నేడు విడుదల చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆడియన్స్ ఊహాలను మించి ఉంది. పూర్తి విజువల్ వండర్‌గా రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేసి మూవీపై మరింత హైప్ పెంచింది కల్కి టీం. ఇక మూవీ టీం తీరు చూస్తుంటే ప్రమోషనల్ ఈవెంట్స్‌పై కాకుండ కల్కి టీం అప్‌డేట్స్‌తో సినిమాను ప్రమోట్ చేస్తుందనిపిస్తుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషనల్‌లో భాగంగా కల్కి రిలీజ్ ట్రైలర్‌ను నేడు విడుదల చేశారు మేకర్స్.
తాజాగా విడుదలైన ట్రైలర్ ఆడియన్స్ ఊహాలను మించి ఉంది. విజువల్ వండర్‌గా రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేసి మూవీపై మరింత హైప్ పెంచింది కల్కి టీం. ఈ సెకండ్ ట్రైలర్ యాక్షన్ సీక్వెల్స్, విజువల్స్‌తో ఆకట్టుకుంటుంది. ఇందులో సమయం వచ్చిందంటూ అశ్వద్ధామగా అభితాబ్ చెప్పే డైలాగ్‌తో మొదలైంది. ఆ తర్వాత ప్రభాస్, మితాబ్ తలపడటం ఉత్కంఠ పెంచుతుంది. కొన్ని యాక్షన్, ఎమోషన్స్ సీన్స్‌తోనూ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఇందులో "ఒక్క పెద్ద బౌండరి.. వన్ షాట్.. కాంప్లెక్స్ వెళ్లిపోతా" అనే ప్రభాస్ డైలాగ్ ఆసక్తిగా ఉంది. ఆ తర్వాత ఎన్ని యుగాలైనా.. ఎన్ని అవకాశాలు ఇచ్చినా.. మనిషి మారడు, మారలేడు.. అనే కమల్ హాసన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. చివరిలో మాధవ అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో సాగే పాట ఎంతో ఎమోషనల్‌గా ఉంది. బ్యాగ్రౌండ్‌లో మాధవ సాంగ్ ప్లే అవుతుంటే.. యాక్షన్, యుద్ద సన్నివేశాలను చూపించారు. ఎలియన్, మనషుల మధ్య సాగే యుద్ధాన్ని చూపించారు.
ఇక చివరిలో "ఇంతవరకు ఒక్క ఫైట్ ఓడిపోలేదు.. ఇది కూడా ఓడిపోను.. ఈసారి సిద్ధం అయ్యే వచ్చాను.. రా" అని చివరిలో ప్రభాస్ చెప్పే డైలాగ్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. కాగా వైజయంతీ మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుస్తున్న ఈ చిత్రం కోసం వరల్డ్ వైడ్‌గా మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదుచూస్తున్నారు. ఇక కల్కి జర్నీ గురించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇస్తున్న అప్‌డేట్స్ మూవీపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఇది మూడు ప్రపంచాల మధ్య సాగే కథని, కలియుగంతో కల్కి ఏం చేశాడన్నేది ఈ సినిమా స్టోరీ అంటూ క్యూరియాసిటి పెంచాడు. ఇక నాగ్ అశ్విన్ ఇచ్చిన అప్‌డేట్‌ను.. విజువల్స్ రూపంలో మలిచి.. కల్కి రిలీజ్ ట్రైలర్ శాంపిల్ చూపించింది మూవీ టీం. మొత్తానికి మూవీ రిలీజ్‌కు ఇంకా ఆరు రోజులు ఉందనగా.. కల్కి రిలీజ్ ట్రైలర్ విడుదల చేసి మూవీపై అంచనాలు పెంచెశారు మేకర్స్.
Also Read: అమితాబ్ బచ్చన్ చేసిన పనికి ఆశ్చర్యపోయా - నిర్మాత అశ్వినీ దత్ ఎమోషనల్ పోస్ట్