Guppedanta Manasu Serial Today Episode: అనుపమకు వాళ్ల పెద్దమ్మ ఫోన్ చేస్తుంది. అక్కడ నీకు బాగానే ఉందా అని అడుగుతుంది. నాకు ఎక్కడైనా బాగానే ఉంటుంది. అక్కడ తప్పా అని వాడొచ్చాడా అని అడుగుతుంది. రాలేదని చెప్పడంతో ప్రతి ఒక్కరూ మా గురించే అడుగుతున్నారు. నువ్వు నీ కొడుకుతో ఎందుకు మాట్లాడవు.. ఎందుకు కలిసి ఉండవు అని ప్రశ్నిస్తున్నారు. అసలు వాడు ఇక్కడికి రాకుండా ఉంటే బాగుండు.. అని అనుపమ చెప్పగానే.. నువ్వు ఎలా ఎందకు వెళ్లావో వాడు అందుకే వచ్చాడు అని వాళ్ల పెద్దమ్మ చెప్తుంది. ఇంతలో మహేంద్ర, మనును తీసుకుని ఇంటికి వస్తాడు.
మహేంద్ర: అనుపమ.. మను వచ్చాడు చూడు.
అను పెద్దమ్మ: ఏంటి ఎవరో వచ్చారు అంటున్నారు.
అను: ఏమో ఎవరో?
అను పెద్దమ్మ: ఫోన్‌లో నాకే వినబడింది. నీకు వినిపించలేదా?
అను: వినిపించలేదు...
పెద్దమ్మ: సరేలే వాడు అక్కడే భోజనం చేసి వస్తాడో.. ఇక్కడికి వచ్చాక భోజనం చేస్తాడో కనుక్కుని చెప్పు
అను: నేను అడగను.. అడగాల్సిన అవసరం లేదు.
అనగానే పెద్దమ్మ ఫోన్ కట్ చేస్తుంది. మరోవైపు మహేంద్ర, మనుతో మాట్లాడుతుంటాడు.
మను: మేడంకు ఈ టాబ్లెట్స్ తీసుకుని వచ్చాను.
మహేంద్ర: అవునా? అయినా ఇప్పుడెందుకొచ్చావని నేను నిన్ను అడిగానా?
మను: మీరు అడగకున్నా నేను వచ్చిన పర్పస్ చెప్పడం అనేది నా బాధ్యత సార్.
వసు: ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు తన పక్కన లేకపోతే ఎలా? మీరు మీ తల్లి పక్కనే ఉంటే తనకి బాగుంటుంది కదా?
మను: అని మీరనుకుంటున్నారు. కానీ ఆవిడ అనుకోదు.
మహేంద్ర: తన గురించి పక్కన పెట్టు మను నీ గురించి ఆలోచించు. నీ తల్లిని చూడాలనే కదా నువ్వు ఇక్కడకు వచ్చావు. తనతో మాట్లాడాలనే కదా వచ్చావు.
ఎంజేల్: అత్తయ్యా ఆ గదిలో ఉంది. వెళ్లి ఆ టాబ్లెట్స్ ఇస్తూ మాట్లాడండి.
వసు: ప్లీజ్ మను గారు మీరింకేం ఆలోచించకండి వెళ్లి మేడంను పలకరించండి..
అని అందరూ చెప్పగానే మను ఆలోచిస్తూనే అనుపమ గదిలోకి వెళ్తాడు. మహేంద్ర ఇక మీరు వెళ్లి వంట రెడీ చేయండి అని చెప్తాడు. గదిలోకి వచ్చిన మనును కోపంగా చూస్తుంది అనుపమ. మను ఎలా ఉంది మీకు అని అడగ్గానే ఎందుకొచ్చావ్ అని అనుపమ అనడంతో అయితే వెళ్లిపోతాను మీకు దూరంగా వెళ్లిపోతాను అంటాడు మను.
అను: నువ్వు వచ్చిన దగ్గర నుంచి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. అసలు నువ్విక్కడ ఉండటమే నాకు ఇష్టం లేదు.
మను: నాది కూడా అదే సిచ్యుయేషన్ మేడం. పాతికేళ్లుగా నా ప్రశ్నకు సమాధాన దొరకడం లేదు. సమాధానం లేని ప్రశ్నను మోస్తూ.. ముందుకు సాగలేకపోతున్నాను.
అను: ఇంక చాలు ఆపు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లు. వెళ్లమన్నానా?
వసు: ఎక్కడికి వెళ్తారు మేడం. వెళ్లమంటున్నారేంటి మేడం. తను ఇప్పుడు వెళ్లరు. భోజనం చేసిన తర్వాత వెళ్తారు. ఒకవేశ ఉండాలనిపిస్తే ఉంటారు.
అను: తనని నువ్వు ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు. ఎందుకొచ్చాడు.
వసు: ఈరోజు మీకు గాయం అయ్యిందని మీరు బెడ్ రెస్ట్ లో ఉన్నారని చూడటానికి వచ్చారేమో?
అను: తను చేసిన గాయం కంటే ఈ గాయం పెద్దదేం కాదు. అయినా ఎవరి పర్మిషన్ తీసుకుని నన్ను చూడటానికి వచ్చాడు. సరే తనొస్తే మీరెలా పంపిస్తారు.
వసు: ఒక బిడ్డకు ఆకలేస్తే అమ్మ దగ్గరకు ఎలా వెళ్తుందో.. తనకి కూడా మీ దగ్గరకు వచ్చే హక్కు ఉంది మేడం. ఒక కొడుకుగా తనకు నిద్రొచ్చినా మీ ఒళ్లో పడుకునే స్వేచ్చ ఉంది మేడం.
అంటూ వసుధార అనుపమకు మను గురించి చెప్తుంటే మహేంద్ర అనుపమను మెచ్చుకుంటాడు. చిన్న వయసులోనే బంధాలు అనుబంధాల గురించి చాలా బాగా చెప్పావు అంటాడు. కొందరైతే ఎంత వయసు వచ్చినా పరిణతి రాదు అనగానే అనుపమ మహేంద్రను కోప్పడుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.