Guppedanta Manasu Serial Today Episode: డీబీఎస్టీ కాలేజీలో ఎండీ పదవి ఎవరికి ఇవ్వాలనే విషయం మీద బోర్డు మీటింగ్ జరుగుతుంది. మొదటి నుంచి మా ఫ్యామిలీ నుంచే ఎండీ పదవి నిర్వహించేవాళ్లం ఇప్పుడు కూడా ఎండీ పదవి మా ఫ్యామిలీకే ఇవ్వాలని ఈ పరిస్థితుల్లో మా డాడీకి ఎండీ పదవి అంటే అంతగా ఇంట్రెస్ట్ లేదని ఇక ఆ పదవి నాకే ఇవ్వాలని మంత్రి గారికి బోర్డు మెంబర్స్ కు చెప్తాడు శైలేంద్ర. అయితే కొంత మంది బోర్డు మెంబర్స్ శైలేంద్రను వ్యతిరేకించి మనుకు సపోర్టుగా మాట్లాడతారు. మరికొందరు శైలేంద్రకు సపోర్టుగా నిలబడతారు.
మంత్రి: చూడండి ఒక ఎండీ సీటు విషయంలో మీలో మీరు కొట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ముందుకొచ్చి నిన్ను ఎండీగా చేస్తే.. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా దానిపై ఏకగ్రీవం రాదు. అప్పుడు కాలేజీ మొత్తం ఆగిపోవాల్సి వస్తుంది. స్టూడెంట్స్ భవిష్యత్తు దెబ్బతింటుంది. ఇవన్నీ ఆలోచించే మేము కాలేజీని హ్యాండోవర్ చేసుకోవాలనుకుంటున్నాం.
శైలేంద్ర: సార్ మీరు చెప్పేది కాదనటం లేదు. కానీ ఒక్కసారి మా కాలేజీ వైపు నుంచి ఆలోచించండి. ఇప్పటికే డీబీఎస్టీ కాలేజీ పేరు చాలా పడిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ హ్యాండోవర్ చేసుకుందంటే ఇంకా పడిపోయిందంటారు.
మంత్రి: నేనేమీ ఇమీడియట్‌గా హ్యాండోవర్ చేసుకుంటామని చెప్పడం లేదు. ఒక వీక్ టైం ఇస్తున్నాను. అంతలోపు మీరే ఆలోచించుకోండి.
శైలేంద్ర: సార్ ఇంక వేరే ఆల్‌టర్‌నేట్ ఏం లేదా?
మంత్రి: నువ్వు చెప్పినట్టు రిషిని జగతిని ఎండీగా ఎన్నుకున్నాం. అలాగే రిషినే వసుధారను ఆ పదవిలో కూర్చోబెట్టాడు. ఇప్పుడు నువ్వు ఎండీ పదవిలోకి రావాలంటే కనీసం వసుధార రావాలి.
శైలేంద్ర: వసుధార ఉంటే కదా సార్ రావడానికి
ALSO READ: మరోసారి ఆస్కార్ నుంచి ‘RRR’ టీమ్‌కు పిలుపు - స్వయంగా ప్రకటించిన రాజమౌళి
అని శైలేంద్ర అనగానే అందరూ షాక్ అవుతారు. మంత్రి గారు లేకపోవడం ఏంటి? అని ప్రశ్నించడంతో అదే సార్ ఇక్కడికి రానని చెప్పింది కదా? తనుకు ఆత్మాభిమానం ఎక్కువ మీలాగా నాలాగా కాదు. అనగానే మంత్రి గారు సీరియస్‌గా చూస్తాడు. ఫణీంద్ర కోపంగా తిడతాడు. దీంతో మినిస్టర్ వారం రోజులు గడవు ఇస్తున్నానని వెళ్లిపోతాడు. ఫణీంద్ర, శైలేంద్రను తిట్టి వెళ్లిపోతాడు. మరోవైపు రంగ కంగారుగా ఇంట్లోకి వస్తూ వసుధార కనిపించిందా? అని అడుగుతాడు. లేదని రాధమ్మ, సరోజ చెప్పగానే ఎక్కడికి వెళ్లారోనని వెతకడానికి వెళ్తాడు రంగ. ఒక దగ్గర టీ తాగుతున్న వసుధారను చూసి కోపంగా కొట్టబోయి ఇంట్లో చెప్పకుండా ఎందుకు వచ్చావని మీరు అసలే ప్రమాదంలో ఉన్నారని ఇంటికి వెళ్దాం పద అనగానే మీరు రిషి సార్ అని ఒప్పుకుంటే వస్తానని వసుధార బెట్టు చేయడంతో రంగ చేయి పట్టుకుని లాక్కెళతాడు. మరోవైపు మను మంత్రిగారికి థాంక్స్ చెప్తుంటాడు. దూరం నుంచి శైలేంద్ర వింటుంటాడు.
మను: బోర్డు మీటింగ్‌లో మనం అనుకున్నట్టుగానే మీ నిర్ణయం చెప్పారు సార్.
శైలేంద్ర: ఇదంతా మీ ప్లానా? ఇంత ప్లాన్ చేశారా నా వెనక ( అని మనసులో అనుకుంటాడు.)
మంత్రి: గవర్నమెంట్ హ్యాండోవర్ చేసుకుంటుంది అని నేను అనకపోతే ఈ కాలేజీ దుర్మార్గుడి చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని చెప్పావు కదా?
మను: మీరు చెప్పిన కండిషన్స్ కూడా బాగున్నాయి సార్. రిషి సార్ ఐనా రావాలి. లేకపోతే వసుధార అయినా రావాలి అన్నారు.
అని ఇద్దరూ కాలేజీ గురించి మాట్లాడుకుంటారు. తర్వాత మంత్రి గారు వెళ్లిపోతారు. శైలేంద్ర వచ్చి మనును తిడతాడు. నా వెనకే గోతులు తవ్వుతారా? అంటూ ఫైర్ అవుతాడు. నీ సంగతి చూస్తానని వార్నింగ్ ఇవ్వగానే మను నవ్వుకుంటూ వెళ్లిపోతాడు. వెంటనే శైలేంద్ర రౌడీలకు ఫోన్ చేసి మనును చంపాలని చెప్తే మేము చేయలేమని చెప్తారు. మరోవైపు వసుధారను రాధమ్మ మందలిస్తుంది ఇంకోసారి అలా వెళ్లోద్దని చెప్తుంది. ఎందుకు వెళ్లావని అడగ్గానే వసుధార బాధపడుతుంది. రిషి సార్ ఎవరు? అసలు నువ్వు ఎవరు? అని అడగ్గానే తన గురించి మొత్తం చెప్తుంది వసుధార. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.