Guppedanta Manasu Serial Today Episode: వసుధారను ఏ నిర్ణయం తీసుకున్నారని మను అడగ్గానే.. అందిరలాగే మీకు కూడా ఈ మీటింగ్ లోనే సమాధానం దొరుకుతుందని చెప్తుంది. అందరిలాగా కాదు మీరు ఏ నిర్ణయం తీసుకుంటారోనని టెన్షన్ పడుతున్నాను అని మను అడగ్గానే నేనేం చనిపోనులే అంటుంది వసు. దీంతో మను షాక్ అవుతాడు. అదేంటి మేడం అలా మాట్లాడుతున్నారు అని అడగ్గానే మీరు వెతుకుతున్న ప్రశ్నకు కూడా సమాధానం ఇవాళ మీకు దొరుకుతుంది అని చెప్పి మీటింగ్ హాల్‌లోకి వెళ్తుంది. మను కూడా వెళ్తాడు.
వసు: లేట్ అయినందుకు అందరికీ సారీ. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిన్నప్పుడు మన కుటుంబ సబ్యులతోనూ, మన మనసుకు బాగా దగ్గరైన వాళ్లతోనూ పంచుకుంటాం కదా అలానే నేను రిషి సార్‌తో పంచుకుని వచ్చాను. రిషి సార్‌కు ఈ నిర్ణయం గురించి చెప్పుకుని వచ్చాను. సారీ సార్ నిన్న మీతో కొంచెం తప్పుగా మాట్లాడాను.
మంత్రి: అయ్యో పరవాలేదమ్మా.. నీ వర్షన్ నువ్వు మాట్లాడావు అంతే ఇంతకీ ఈరోజు బోర్డు మీటింగ్ ఎందుకమ్మా అరెంజ్ చేసింది.
వసు: చెప్తాను సార్ దాని గురించే వచ్చింది. ఈ కాలేజీ నాకు అమ్మ తర్వాత అమ్మ లాంటిది. నాకు జన్మనిచ్చింది అమ్మ అయితే నాకు పునర్జన్మను ఇచ్చింది ఈ కాలేజీ. అలాంటి కాలేజీకి ఇప్పుడు నేను దూరం కాబోతున్నాను.
ఫణీంద్ర: ఏం మాట్లాడుతున్నావు అమ్మా..
వసు: అవును సార్ ఈ కాలేజీని వదిలేద్దామనుకుంటున్నాను.
మహేంద్ర: అదేంటమ్మా నువ్వు ఈ కాలేజీకి ఎండీవి.. నువ్వు వదిలేద్దామనుకోవడం ఏంటి?
వసు: ఎండీ పదవికి రిజైన్ చేసి నేను వెళ్లిపోదాం అనుకుంటున్నాను. ఇదిగోండి సార్ నా రిజిగ్నేషన్ లెటర్
ఫణీంద్ర: ఎంటమ్మా ఇది అసలు ఎవరికి ఒక్కమాట చెప్పకుండా రిజైన్ చేయడం ఏంటి?
మహేంద్ర: అన్నయ్యా వసుధారకు నేను నచ్చజెప్తాను. తను ఆ లెటర్ వెనక్కి తీసుకుంటుంది. అమ్మా వసుధార అ లెటర్ చించెయ్… నేను చెప్తున్నాను కదా రిజైన్ వెనక్కి తీసుకో.. లేదంటే ఆ లెటర్ ఇటువ్వు నేను చించివేస్తాను.
వసు: మామయ్య ఫ్లీజ్ మీరు ఈ విషయంలో నన్న బలవంతం పెట్టొద్దు. ఇది నేను పూర్తి స్పృహలో ఉండి రాసిన లెటర్. ఇది మీరు కాదనకూడదు. కాదనరు కూడా.
మహేంద్ర: వసుధార నీ ఎమోషన్ ను నేను అర్థం చేసుకోగలను నువ్వు ఇప్పుడు ఆవేశంలో ఉండి ఈ నిర్ణయం తీసుకున్నావు.
అనుపమ: అవును వసుదార కావాలంటే మనం దీని గురించి మాట్లాడుకుందాం. ముందైతే నువ్వు నీ నిర్ణయం వెనక్కి తీసుకో..
శైలేంద్ర: కాలేజీని వదిలిపెడితే తన ప్రాణాలు వదిలిపెట్టినట్టు ఫీలవుతుంది వసుధార. మనం తనని బలవంత పెట్టడం కూడా కరెక్టు కాదు. తన రాజీనామాను ఆమోదించడమే కరెక్టు సార్. ఎంత మానస బాధ అనుభవించి ఉంటే ఈ నిర్ణయం తీసుకుంటుంది.
ఫణీంద్ర: రేయ్ నోర్ మూయి.. అమ్మ వసుధార నువ్వు చెప్పు నీ ప్రాబ్లమ్ ఏంటి?
వసు: నాకు ఏ ప్రాబ్లమ్ లేదు సార్
ఫణీంద్ర: మరెందుకు సడెన్‌గా ఈ నిర్ణయం తీసుకున్నావు. నువ్వు మాత్రం రిజైన్ చేయొద్దమ్మా.
మంత్రి: ఇప్పుడు నువ్వు ఎండీగా ఉండాలంటే మేము ఏం చేయాలి చెప్పు. మేము మా నిర్ణయాలు ఏమైనా మార్చుకోవాలా? చెప్పు.
ఫణీంద్ర: చెప్పమ్మా మినిస్టర్ గారు అడుగుతున్నారు కదా చెప్పు..
వసు: రిషి సార్ బతికే ఉన్నారని మీరు నమ్ముతారా?
అంటూ అందర్ని అడుగుతుంది. శైలేంద్ర అలా ఎలా నమ్ముతామని.. మేము నమ్మితే తాను బతికి వస్తాడా? అని అడుగుతాడు. బోర్డు మెంబర్స్ కూడా మీరు బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు ఉంది అని అంటారు. దీంతో అదంతా నాకు సంబంధం లేని విషయం ఎండీని మీరే నిర్ణయించుకోండి అంటూ చెప్పి వసుధార వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మోదీ, చిరు మాత్రమే కాదు - చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఈ స్టార్ హీరో కూడా