Guppedanta Manasu  Serial Today Episode: శైలేంద్ర, మను ఇంటికి వెళ్లి కాలేజీకి రావాలని అడుగుతాడు. నేను రానని మను చెప్పడంతో మొన్న నేను అన్న దానికి హర్ట్‌ అయ్యారా? ఇంకోసారి అలా అడగను.. మీరు కాలేజీ కష్టాల్లో ఉంటే యాబై కోట్లు ఇచ్చి కాపాడారు. ఇప్పుడు కష్టాల్లో ఉన్న కాలేజీని ఆదుకోవడానికి రావాలని అడుక్కుంటాడు. మను రానని కచ్చితంగా చెప్పగానే మీరు రాకపోతే మా నాన్న నన్ను చంపేస్తాడని.. కాళ్లు పట్టుకుంటాడు. మీరు కాలేజీకి వచ్చే వరకు మీ కాళ్లు వదలను అంటూ బతిమాలుతుంటే ఏవండి లేవండి అంటూ ధరణి పిలుస్తుంది. దీంతో షాక్‌ అయిన శైలేంద్ర సరిగ్గా చూడగానే ధరణి కాళ్లు పట్టుకుని ఉంటాడు. దీంతో నేను ఈ మధ్య పగటి కలలు కంటున్నాను అనుకుని లేస్తాడు.

ధరణి: ఏంటండి ఏమైంది మీకు నా కాళ్లు పట్టుకుని బతిమిలాడుతున్నారు. నన్ను కాలేజీకి రమ్మంటున్నారేంటి?

శైలేంద్ర: నేనెక్కడ రమ్మన్నాను.

ధరణి: ఇప్పుడే రమ్మన్నారు కదండి.

అనగానే అది నిన్ను కాదు వేరే వాల్లను రమ్మన్నాను అంటూ భార్యాభర్తలు సమం అంటారు కదా  అందుకే నీ కాళ్లు పట్టుకున్నాను అని శైలేంద్ర అనగానే.. మీరు చాలా మారిపోయారండి మీకు కాఫీ తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్తుంది.  శైలేంద్ర, మనుకు కాల్‌ చేస్తాడు. కాలేజీకి రావాలని చెప్తాడు. దీంతో కోపంగా మను ఎందుకు రావాలని ప్రశ్నిస్తాడు. నేను రాకపోతే ఏమౌతుంది అంటూ అడగ్గానే శైలేంద్ర డ్రీమ్‌ లో చెప్పిన డైలాగ్సే మళ్లీ చెప్తాడు. దీంతో మను రానని చెప్పి ఫోన్‌ కట్‌ చేస్తాడు. ఈసారి ఫోన్‌ చేస్తే బాగుండదు అంటూ మెస్సెజ్‌ చేస్తాడు. మరోవైపు అనుపమ, వసుధార, మహేంద్ర ఆలోచిస్తుండగా విశ్వనాథం, ఎంజేల్‌ వస్తారు.

విశ్వనాథ: అమ్మా అనుపమ ఇప్పుడు ఎలా ఉంది అమ్మా

అనుపమ: పర్లేదు డాడీ బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు.

విశ్వ: ఉన్నానమ్మా ఏదో అలా ఉన్నాను. నీమీద ఎటాక్‌ చేసినవాడిని నువ్వు ఇంతకు ముందు ఎప్పుడైనా చూశావా? అసలు అటాక్‌ చేయాల్సిన అవసరం వాడికేముంది. మహేంద్ర గారు ఇన్వెస్టిగేషన్‌ జరుగుతుందా? లేకపోతే వాడెవడో తెలియాలి. 

మహేంద్ర: అలాగే సార్‌ మీతో కూడా మాట్లాడిస్తాను.

విశ్వ: అమ్మా అనుపమ.. ఇక్కడెందుకమ్మా ఇంటికి రావొచ్చు కదా?

మహేంద్ర: ఇక్కడ మేము బాగానే చూసుకుంటున్నాం సార్‌. పర్వాలేదు. తను వస్తానంటే మీరు తీసుకెళ్లవచ్చు. కానీ తనకు ఇక్కడ కంఫర్ట్‌ గా ఉంది.

విశ్వ: కంఫర్ట్‌ గా ఉంటే తను మీ ఇంట్లోంచి ఎందుకు వెళ్లాలనుకుంటుంది.

అనగానే మహేంద్ర కొన్ని కొన్ని సార్లు పరిస్థితులు అలా నడిపిస్తాయి అని చెప్పగానే విశ్వనాథం సరేనని వెళ్లబోతుంటే అనుపమ నువ్వు మళ్లీ మనును కలవొద్దని విశ్వానికి చెప్తుంది. అది మన చేతుల్లో లేదని అంతా పైవాడి లీల అంటూ చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు శైలేంద్ర కాలేజీ గేటు దగ్గరకు వెళ్లి మను గురించి ఆలోచిస్తుంటాడు. ఇంతలో వసుధార ఫోన్‌ చేస్తుంది.

వసుధార: ఎక్కడున్నారు?

శైలేంద్ర: కాలేజీ గేటు దగ్గర ఉన్నాను..

వసుధార: సెక్యూరిటీ గార్డుగా ముందే ప్రాక్టీస్‌ చేస్తున్నారా?

శైలేంద్ర: వసుధార నువ్వు మరీ అవమానకరంగా మాట్లాడుతున్నావు.

వసు: చెప్పిన పని ఎం చేశారు.  

శైలేంద్ర: ఏం పని..

వసు: ముందు మీరు నా కాబిన్‌ కు రండి

శైలేంద్ర: ఆర్డర్‌ వేస్తున్నవా? రిక్వెస్ట్‌ చేస్తున్నావా?

వసు: ఆర్డరే..

 శైలేంద్ర: నేను రాకపోతే..

 వసు: మీరు రావాలి.. వస్తారు.. నాకు తెలుసు

అని వసుధార ఫోన్‌ కట్‌ చేస్తుంది. శైలేంద్ర, వసుధార కాబిన్‌కు వెళ్తాడు. లోపలికి రాగానే చెప్పిన పని ఏమైందని మనును కాలేజీకి తీసుకొచ్చావా? అంటూ అడగ్గానే ఫోన్‌ చేశాను రానంటున్నాడు అనగానే ఏదేమైనా మను గారిని కాలేజీకి తీసుకురావాల్సింది నువ్వే  అని వసు చెప్పగానే ఇంతలో మను వస్తాడు. శైలేంద్ర షాక్‌ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: లవ్ గురు రివ్యూ: భార్య ప్రేమ కోసం రోమియోగా మారిన విజయ్ ఆంటోనీ - కొత్త సినిమా ఎలా ఉందంటే?