గుప్పెడంతమనసు సెప్టెంబరు 2nd ఎపిసోడ్ (Guppedanta Manasu September 2nd Written Update)


వసుధారని కలసిని రిషి... సిలబస్ గురించి తనతో ఎందుకు మాట్లాడలేదని వాదనకు దిగుతాడు. నేను డిస్ట్రబెన్స్ లో ఉంటే వర్క్ మానేస్తారా..పని చేస్తుంటే నాకు ఏ డిస్ట్రబెన్స్ ఉండదంటూ మాట్లాడుతాడు. ఇది చాలా చిన్న విషయం కానీ మీరెందుకు సాగదీస్తున్నారంటుంది..ఎవరిమీదో కోపం నాపై చూపిస్తున్నట్టుంది, ఎక్కడో జరుగిన సమస్యకి నాపై అసహనం వ్యక్తం చేస్తున్నారు, మీరేదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారని వసుధార అంటుంది. నా మనసులో ఏముందో తెలిసే వాళ్లతో ఇలానే మాట్లాడాలి అంటాడు. మీ అలక,కోపం అన్నీ నాపైనే సర్ అనుకుంటుంది వసుధార. రిషిని చూస్తుండిపోవడంతో మీరు చూడాల్సింది నన్ను కాదు పని చేయండి అని చెబుతాడు. అయినా వసు అలాగే ఉండడంతో.. తన క్యాబిన్లో ఫైల్స్ తీసుకురమ్మని పంపిస్తాడు...క్యాబిన్ కి వెళ్లిన వసుధార ఓ చార్ట్ చూసి ఆశ్చర్యపోతుంది ( వసుధార కళ్లు రిషి గీసిన చార్ట్).. అది చూస్తుండిపోతుంది ఇంతలో రిషి వచ్చి లాగేసుకుని ఏం తీసుకురమ్మని చెప్పాను ఏం చేస్తున్నారని ఫైర్ అవుతాడు.
వసు: ఎవరికి ఆ కళ్లు
రిషి: మీకెందుకు
వసు: ఎందుకు 24 గంటలూ డిస్ట్రబ్ మూడ్ లో ఉండేకన్నా మీ చేతిలో ఉన్న కళ్ల చార్టు గురించి చెప్పొచ్చు కదా
రిషి: మీరిచ్చిన సలహాకు థ్యాంక్స్...ఇక వెళ్లండి అంటాడు.. వసుధార వెళ్లిపోతుంటే ఓ చిన్న హెల్ప్ చేయగలరా అని అడిగుతాడు.. ఆనందంతో వసు వెంటనే ఓకే చెబుతుంది. నేను తనకు తగను అని ఏంజెల్ కి తెలిసేటట్టు మీరు చేయాలి..రియల్లీ అన్ ఫిట్ మేడం.. తను తోడుకోసం పెళ్లిచేసుకోవాలి అనుకుంటోంది. ఈ విషయంలో మీరు హెల్ప్ చేయాలి. 
ప్రయత్నిస్తాను సార్..ఏంజెల్ అడిగితే హెల్ప్ చేశాను కదా ఇప్పుడు మీరూ అడుగుతున్నారు మీక్కూడా హెల్ప్ చేస్తాను అనేసి వెళ్లిపోతుంది...
వసు వెళ్లిపోయిన తర్వాత ఆ కళ్లను చూస్తూ అలాగే ఉండిపోతాడు.... మళ్లీ వెనక్కు వచ్చిన వసుధార ఆర్ట్ బావుంది సార్ అనేసి వెళ్లిపోతుంది  ( పొగరు..ఆర్ట్ బావుండడం ఏంటి బావుండేవి ఆకళ్లు..తనకు తెలియదా అనుకుంటాడు ప్రేమగా)


Also Read: వసుకి మనసులో మాట చెప్పిన రిషి, చిరాకు తెప్పిస్తోన్న శైలేంద్ర బిహేవియర్!


దేవయాని దగ్గరకు వెళ్లిన జగతి తన నగలివ్వమని అడుగుతుంది. ఎందుకు అని అడిగితే.. మీ నగలపై మీకెంత హక్కు ఉంటుందో నా నగలపై నాక్కూడా అంతే హక్కు ఉంటుందంటుంది. చెబితే కానీ ఇవ్వను అని దేవయాని హడావుడి చేస్తుంటుంది. ఇంతలో ఎంట్రీ ఇస్తారు ఫణీంద్ర, శైలేంద్ర. ఏమైందని అడుగుతాడు.. వాళ్లు చెప్పరని దేవయాని అడిగితే..మీరు చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారని అంటాడు మహేంద్ర. 
దేవయాని: జగతి గోల్డ్ మొత్తం అడుగుతోంది..ఎందుకో చెప్పడం లేదు
ఫణీంద్ర: దేవయాని చెప్పింది నిజమా
జగతి: అవును బావగారు అక్కయ్య చెబుతోంది నిజమే
దేవయాని: ఇందులో నాదేమైనా తప్పుందా
ఫణీంద్ర: ఇప్పుడు గోల్డ్ తో పనేముంది..ఫంక్షన్స్ కూడా ఏమీ లేవుకదా
దేవయాని: నేను అడిగితే ఎలాగూ చెప్పడం లేదు..మీ బావగారికి అయినా చెప్పండి..ఎందుకు గోల్డ్ మొత్తం అడుగుతున్నారు
శైలేంద్ర: తాకట్టు పెట్టడానికి..చెప్పండి పిన్నీ అందుకోసమే అని
ఫణీంద్ర: నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా..నువ్వు మంచిగా మారాను అన్నావ్ నీలో వచ్చిన మార్పు ఇదేనా
శైలేంద్ర: నేను చెప్పింది నిజం.. 
ఫణీంద్ర: నిజం కాదు అబద్ధం..గోల్డ్ తాకట్టు పెట్టడం ఏంటి..నాకు చెప్పకుండా వాళ్లు ఏ పనీ చేయరు..అందుకే వాళ్లు ఏం చేసినా అడగను ఒకవేళ తను గోల్డ్ తాకట్టు పెట్టాలి అనుకుంటే నాకు ముందే చెప్పేవారు.. చెప్పలేదంటే అది అబద్ధం 
జగతి: మమ్మల్ని క్షమించండి బావగారు శైలేంద్ర చెబుతున్నది నిజమే..గోల్డ్ మొత్తం తాకట్టు పెట్టాలి అనుకుంటున్నాం
శైలేంద్ర: వాళ్ల గురించి మీకిప్పుడు అర్థమైందా.. గోల్డేనా ఇంకేమైనా తాకట్టు పెట్టాలి అనుకుంటున్నారా
ఫణీంద్ర: ఏదో పెద్ద సమస్యే వచ్చింది అనిపిస్తోంది..ఏంటది..ప్రాబ్లెమ్ ఏంటో చెప్పమ్మా
శైలేంద్ర: శాలరీ ప్రాబ్లెమ్..ఇప్పుడే మేనేజర్ ఫోన్ చేసి చెప్పాడు మన కాలేజీ అకౌంట్స్ సీజ్ అయ్యాయి..ఎవ్వరికీ శాలరీస్ రాలేదు. 
దేవయాని: గోల్డ్ తాకట్టు పెట్టి వాళ్లకి శాలరీస్ ఇవ్వాలి అనుకుంటున్నారన్నమాట..అది ఎంత అవమానకరంగా ఉంటుందో తెలియదా..మావయ్యగారి పేరు ప్రఖ్యాతులకు భంగం కలుగుతుంది కదా
జగతి: శాలరీస్ కోసం స్టాఫ్ ఇబ్బంది పడుతున్నారు..
ఫణీంద్ర: మీ ఇద్దరూ చాలా పెద్ద తప్పు చేశారు..అకౌంట్స్ సీజ్ అయిన విషయం చెప్పాలి కదా..మీరిలా చేయడం నాకు నచ్చలేదు.. ఇంత పెద్ద ప్రాబ్లెమ్ ని చిన్న ప్రాబ్లెమ్ అంటారేంటి..
దేవయాని: ఇంకా ఏదైనా విషయం దాచిపెడితే ఇప్పుడైనా చెప్పండి..
ఫణీంద్ర: గోల్డ్ తాకట్టు కుదరదు..అందరికీ శాలరీస్ ఇవ్వాలంటే మన అకౌంట్స్ లో ఉన్న మొత్తం సరిపోదు..ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. మీరు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు కదా ఈ విషయంలో ఎందుకు నెగ్లెట్ చేశారని నిలదీస్తాడు.
శైలేంద్ర: అన్నీ వాళ్లే చూసుకోవాలి అంటే ఎలా కుదురుతుంది..కొన్ని సార్లు ఇలాంటివి జరుగుతుంటాయి..
ఆ డబ్బు నేను అరెంజ్ చేస్తానంటాడు శైలేంద్ర...నువ్వెలా చేస్తావ్ అని ఫణీంద్ర అడుగుతాడు.. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇస్తారంటాడు. మీరు నాకు పర్మిషన్ ఇస్తే ప్రాబ్లెమ్ సాల్వ్ చేస్తానంటాడు..సరే అంటాడు ఫణీంద్ర.. మీ నమ్మకాన్ని నేను నిలబెడతానంటూ వెళతాడు శైలేంద్ర... 


Also Read: ఉప్పెనంత ప్రేమతో గుప్పెడంత గుండెలో రిషిధార యుద్ధం, పెళ్లి విషయంలో అస్సలు తగ్గని ఏంజెల్!


శైలేంద్ర వెళ్లి అప్పట్లో కాలేజీని మెర్జ్ చేయమన్న వ్యక్తిని కలుస్తాడు. కాలేజీని పూర్తిగా లాక్కునే ప్లాన్ చేస్తాడు. ఫణీంద్రకి కాల్ చేసి డబ్బు ఇస్తానన్న నా స్నేహితుడు అగ్రిమెంట్ అడుగుతున్నాడని చెబుతాడు. సరే ముందు అగ్రిమెంట్ పూర్తి చేసి డబ్బు తీసుకురా అంటాడు. అటు ఇంట్లో ఫణీంద్ర  ... శైలేంద్ర గురించి పొగుడుతాడు. శైలేంద్ర విలువ మనం గుర్తించలేకపోయాం అంటాడు. జగతి-మహేంద్ర టెన్షన్ గా మొహాలు చూసుకుంటారు. మొత్తానికి కాలేజీని దక్కించుకునే ప్లాన్ లోభాగంగా ముందడుగు వేసినట్టే.. మరి దీనికి జగతి, మహేంద్ర ఎలా చెక్ పెడతారో చూడాలి...