గుప్పెడంతమనసు మే 11 ఎపిసోడ్
కాలేజీ ఎండీ సీట్లోంచి రిషిని తప్పించి తాను కూర్చోవాలని స్ట్రాంగ్ గాఫిక్సైన శైలేంద్ర..తల్లిదేవయానితో కలసి కుట్రలు కొనసాగిస్తున్నాడు. వీళ్లిద్దరి సంగతి జగతికి తెలిసిపోవడంతో... రిషిని ఎండీ సీట్లోంచి తప్పిస్తే మంచిది లేదంటే చంపేస్తామంటూ బెదిరిస్తారు. బయటకు చెప్పినా కానీ రిషి ప్రాణాలతో ఉండడని బెదిరించడంతో జగతి కక్కలేక మింగలేక బాధను తనలోనే దిగమింగుకుంటుంది. ఆ విషయంలో జగతి అడుగు ముందుకువేయకపోవడంతో ఈ రోజు (మే 11) ఎపిసోడ్ లో డోస్ పెంచాడు శైలేంద్ర. ఇద్దరకీ నిశ్చితార్థం జరిపిద్దామని చెప్పి షాపింగ్ కి వెళ్లమని చెబుతారు. మరోవైపు జగతిలో అనుమానం బలపడడంతో..శైలేంద్ర దగ్గరకు వచ్చి నా కొడుకుకి హాని తలపెట్టాలని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని బెదిరిస్తుంది. ఎండీ సీట్లో రిషి కాదు ఈ శైలేంద్ర ఉండాలి..లేదంటే నీ కొడుకు ప్రాణాలతో ఉండడని హెచ్చరిస్తాడు శైలేంద్ర..ఈ విషయం మొత్తం బయటినుంచి వినేస్తుంది వసుధార... ఆ తర్వాత జగతిని తీసుకుని బయటకు వెళ్లిన శైలేంద్ర ఓ చోట కారు ఆపి...లారీ డ్రైవర్ కు కాల్ చేస్తాడు...ఫాస్ట గా వెళ్లు అని ఫోన్లో చెబుతుంటాడు..ఆ లారీకి ఎదురుగా రిషి కారు వస్తుంది... ఇదంతా చూసి భయంతో కళ్లుమూసుకుని రిషీ అని అరుస్తుంది జగతి...రిషికి యాక్సిడెంట్ జరిగిందో లేదో తెలియాలంటే ఈ ఫుల్ ఎపిసోడ్ చూడాలి మరి...
Also Read: మే 11 రాశిఫలాలు, ఈ రాశులవారు ఆస్తులు కొనుగోలు చేయాలి అనుకుంటే ఇదే మంచి సమయం
గడిచిన ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
తనపై దాడిచేయించింది MSR మనిషే అని రిషికి క్లారిటీ రావడంతో శైలేంద్రతో కలసి వెళ్లి నేరుగా MSR అని కలసి నిలదీస్తాడు. ‘మర్యాదగా చెప్పు.. ఇదంతా నువ్వే చేశావ్ కదా? నిజం చెప్పు.. లేదంటే..’ అంటూ రిషి కోపంగా ఎమ్ఎస్ఆర్ మీదకు వెళ్లబోతాడు. ‘రిషీ’ అంటూ రిషిని ఆపిన శైలేంద్ర.. ‘వీడ్ని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు.. నువ్వు వెళ్లి కారులో కూర్చో.. నేను వీడికి వార్నింగ్ ఇచ్చి వస్తాను’ అంటాడు శైలేంద్ర. ‘అది కాదు అన్నయ్యా వీడు..’ అంటూ రిషి ఏదో అనబోతుంటే.. ‘రిషీ నేను మాట్లాడతా అంటున్నాను కదా.. వెళ్లు.. వెళ్లి కారులో కూర్చో’ అంటూ రిషిని కారు దగ్గరకు పంపించేస్తాడు శైలేంద్ర.రిషి వెళ్లి కారులో కూర్చున్నాక..MSR ని మెచ్చుకుంటాడు శైలేంద్ర..ముందు ముందు మనం ఇలాగే ఉండాలి..సమయం చూసి చెబుతాను వచ్చేందుకు సిద్ధంగా ఉండు అని చెప్పి పంపించేస్తాడు.
దేవయాని ఇంట్లో రచ్చ
అంతా హాల్లో కూర్చుని ఉంటారు..ఇంతలో పేరంటానికి పిలవడానికి అంటూ ఓ లేడీ బ్యాచ్ ఎంట్రీ ఇస్తారు. అందర్నీ పిలిచి..దేవయాని కుటుంబాన్ని పొగిడేస్తారు. ఆ తర్వాత పసుపు కుంకుమ తీసి..అందరి తాళిబొట్టుకి బొట్టు పెడతారు. ఆ తర్వాత వసుధార దగ్గరకు వచ్చి తాళి ఏదని అడిగి ..ఇంకా సంప్రదాయబద్ధంగా పెళ్లికాలేదని తెలియడంతో నానా యాగీ చేస్తారు. పెళ్లికాకుండా కలసి ఎలా ఉంటారంటూ ఇంట్లో అందర్నీ ఏకిపారేస్తారు. వాళ్లంతా వెళ్లిపోయిన తర్వాత దేవయాని మరింత ఫైర్ అవుతుంది. శైలేంద్ర మాత్రం తన స్కెచ్ లో భాగంగా రిషివసుని వెనకేసుకుని వస్తాడు. తప్పేముందని మాట్లాడతాడు. ఇప్పట్లో పెళ్లి ముహుర్తాలు లేవుకాబట్టి పెట్టుడు ముహూర్తంతో అందరికీ తెలిసేలా నిశ్చితార్థం జరిపిద్దాం అంటాడు. ఆ మాటకు అందరూ సంతోషిస్తారు కానీ..జగతి మనసులో ఏదో అనుమానం ఉంటుంది.
Also Read: భార్యతో సరసాలు, ప్రేమికురాలితో ఎంగేజ్మెంట్- మురారీతో భవానీ మాట్లాడుతుందా?
రిషిధార సంబరం
జగతి తన రూమ్ కి వెళ్లి ఆలోచనలో పడుతుంది..ఇంతలో వసుధార వచ్చి సంతోషంగా మాట్లాడుతుంది. నిశ్చితార్థం అంటే సగం పెళ్లి అయిపోయినట్లే కదా రిషి సార్ నా వాడు అయిపోయినట్లే కదా అంటూ సంబరంగా చెబుతుంది. అసలు విషయం వసుకి చెబుతాం అనుకుని వెనక్కు తగ్గుతుంది జగతి. ఇంతలో రిషి వచ్చి..ఇద్దర్నీ పెద్దమ్మ షాపింగ్ కి వెళ్లమంది పద అంటాడు. జగతీ డల్‌గా కనిపించడంతో ‘ఏంటి మేడమ్.. మీకు ఇదంతా ఇష్టం లేదా? నిశ్చితార్థం వెంటనే అంటే మీకు నచ్చడం లేదా? ఏదైనా సమస్యా?’ అని అడుగుతాడు కానీ అదేం లేదని కవర్ చేస్తుంది జగతి. దీనికి కొనసాగింపే రిషి-వసుధార బయటకు వెళ్లడం..శైలేంద్ర యాక్సిడెంట్ ప్లాన్....