రాజ్ రాహుల్ చొక్కా పట్టుకుని నిలదీస్తాడు. ఎంత చీట్ చేశావు చిన్నప్పటి నుంచి నాతో కలిసి పెరిగి నాతోనే తిరుగుతూ నా పెళ్లి చెడగొట్టి పెళ్లి కూతుర్ని లేవదీసుకునిపోతావా? ఇంత ద్రోహం ఎలా చేయగలిగావు. కళ్ళారా చూసిన తర్వాత కూడా ఏం ఎక్స్ ప్లైన్ చేస్తావ్ అని రాజ్ నిలదీస్తాడు.
కావ్య: ఇక చాలు ఈ నాటకానికి తెరవేయి. నన్ను బెదిరించి భయపెట్టాలని చూశావు నీ బండారం బయట పెడతానని అనేసరికి నాకే సవాల్ విసిరావ్ ఇప్పుడు దొరికిపోయావు, నిజం చెప్పక తప్పదు మా అక్కకి నువ్వు చేసిన అన్యాయం గురించి కూడా బయట పెట్టక తప్పదు
రాజ్: నువ్వు ఇంత మోసం చేసింది కాక ఈ కళావతి స్వప్నని తప్పించి పెళ్లి చేసుకుందని చెప్పావు. నేను నా భార్య మాట నమ్మకుండా నిన్ను నమ్మి ఎంత ఫూల్ లా ప్రవర్తించానో అర్థం అయ్యింది. చెప్పు ఎందుకు ఇలా చేశావ్, నీకు ఏం అపకారం చేశావ్ నా కుటుంబాన్ని ఎందుకు అల్లరి పాలు చేశావు
Also Read: జరగబోయేది మన పెళ్ళే అంటూ చిత్రకి వార్నింగ్ ఇచ్చిన అభిమన్యు- రొమాన్స్ లో తేలిపోతున్న యష్ జంట
కావ్య: ఇక తప్పించుకోవాలని చూడకు నిజమెంటో చెప్పి తీరాల్సిందే
గుడిలో కావ్య వాళ్ళు కనిపించకపోవడంతో అపర్ణ గొడవకు దిగుతుంది. ఇంత పవిత్రమైన తంతు జరుగుటుందంటే కావ్య బయటకి వెళ్ళిందంటే ఏదో ముఖ్యమైన కారణమేదో ఉండి ఉంటుందని కృష్ణమూర్తి అంటాడు. మీరు ఒక్కరినీ కూడా సరిగా పెంచలేదని దెప్పి పొడుస్తుంది. కావ్య కలలో కూడా పొరపాటు చేయదని మీనాక్షి అంటుంది. ఆ అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్లిపోయిందంటే ఎంత నిర్లక్ష్యం అర్థం చేసుకోండి. మన పరువు బజారుకీడ్చి ఇక్కడ మనల్ని ఖాళీగా నిలబెట్టారని ఆవేశపడుతుంది. కోడలు మాత్రమే కాదు కొడుకు కూడా వెళ్లాడని రుద్రాణి అంటుంది. తంతు ఆపేసి వెళ్లిపోదామని అపర్ణ చెప్తుంది. తంతు మధ్యలో ఆపేసి వెళ్లిపోతే అరిష్టం జరుగుతుందని కాసేపు వెయిట్ చేయమని కనకం బతిమలాడుతుంది.
కావ్య: మన పెళ్లి జరుగుతుంటే ఇతను ఎందుకు లేడు ఆఫీసులో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అన్నారు జరిగిందా? లేదు మళ్ళీ పెళ్లికి ఎందుకు తిరిగి రాలేదు. ఎప్పుడు తిరిగొచ్చాడు. పెళ్లి నుంచి మా అక్కని తీసుకెళ్ళి హోటల్ లో ఉంచాడు మీతో కంటే తనతోనే జీవితం బాగుంటుందని ఆశలు కల్పించి తీసుకెళ్ళాడు ఇదంతా కావాలనే కదా చేసింది
రాజ్: నువ్వు ఇంత దుర్మార్గుడివా తీసుకెళ్లిన వాడివి స్వప్నని పెళ్లి చేసుకుని రావచ్చు కదా ఎందుకు మోసం చేశావ్
కావ్య: పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు మోసం చేయాలని అనుకున్నాడు అందుకే మా అక్క ఇంటికి వచ్చేసింది
రాహుల్: ఇన్నేళ్లుగా కలిసి పెరిగి నేను ఎలాంటి వాడినో తెలిసి నమ్మేశావా తన మాటలు. అంటే ఈమె వలలో పడిపోయావా? నువ్వు నన్ను అనుమానించడం బాధగా ఉంది
రాజ్: కళ్ళారా చూశాను. తను చెప్పినా చెప్పకపోయిన నేను కళ్ళారా చూశాను. మీరు ఇద్దరూ ఇక్కడ ఎందుకు ఉన్నారు ఎవరికి తెలియకుండా ఇక్కడ ఎందుకు కలుసుకున్నారు
కావ్య: మా ఇంట్లో ఎవరు లేరు మన ఇంట్లో ఎవరు లేరు అది తెలిసి ఇద్దరూ రహస్యంగా కలుసుకున్నారు
రాహుల్: నువ్వు నోరు మూసుకుంటావా
Also Read: ట్విస్ట్ అదుర్స్, కావ్యని తోసేసి పారిపోయిన స్వప్న- రాహుల్ చెంప పగలగొట్టిన రాజ్
రాజ్: షటప్ హోల్డ్ యుర్ టంగ్. నోరు మూసుకో ఏంటి మొహం పగిలిపోద్ది తనకి ఇప్పుడు అన్ని అనే హక్కు ఉంది తను ఇప్పుడు నా భార్య. ఇది నీకు నాకే కాదు తనకి తన అక్కకి మధ్య కూడా జరిగింది తప్పకుండా మాట్లాడుతుంది
రాహుల్: ఇప్పుడు నువ్వు ఆవిడ కలిసిపోయారు నో ప్రాబ్లం. స్వప్న ఇక్కడకి ఎందుకు వచ్చిందో నాకు పూర్తిగా తెలియదు తనే నన్ను ఇక్కడికి రమ్మని చెప్పింది కావాలంటే నా ఫోన్ చూడు స్వప్న నాకు ఎన్ని సార్లు ఫోన్ చేసిందో నేను ఏమైనా కాల్ చేశానా? తనే నాకు చేసింది. అసలు స్వప్న నన్ను ఎందుకు కలుసుకోవాలనుకుందో తెలుసుకోవాలని అనుకున్నా. అసలు మేం ఇద్దరం కలుసుకున్నామని నీకు ఎవరు చెప్పారు
రాజ్: అవును నీకు ఎలా తెలుసు
కావ్య: మా అక్క ఇంటికి వచ్చినప్పుడు నుంచి తనని గమనించి ఫాలో అవమని చెప్పాను అది వీళ్ళ ఫోన్ విని ఇక్కడికి వచ్చిందని అప్పు చెప్తే మనం వచ్చాము. అసలు ఇప్పుడు అది విషయమే కాదు వీళ్ళు
రాహుల్: మీరిద్దరూ కలిసి ప్లాన్ చేసి నన్ను ఇరికించారా అనేసరికి కావ్య కొట్టబోతుంటే రాజ్ అడ్డు పడతాడు.