కావ్య రాజ్ ని పక్కకి తీసుకెళ్ళి మాట్లాడటం అపర్ణ వాళ్ళందరూ చూస్తారు. మా అక్క తన బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళింది ఇప్పుడే ఫోన్ వచ్చింది మనం వెళ్తే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చని కావ్య అనేసరికి రాజ్ షాక్ అవుతాడు. వెంటనే వెళ్ళాలి మీరు నాకు ఇచ్చిన టైమ్ తక్కువ కానీ నా తప్పు లేదని ప్రూవ్ చేసుకోవడానికి మీ వెనుక ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మనం అర్జెంట్ గా వెళ్లాలని చెప్తుంది. దీంతో రాజ్ వాళ్ళు బయల్దేరతారు. మీ అన్నయ్య వాళ్ళు వచ్చేసరికి మనం ఇక్కడ ఉండకూడదని మనల్ని చూస్తే మనమే ఏదో ప్లాన్ చేశామని అనుకుంటాడు అలా పక్కకి వెళ్దాం పద అంటుంది. తాళి బొట్టుకి అపర్ణ, కనకం కలిసి సూత్రాలు, పూసలు ఎక్కిస్తారు. ఇష్టం లేకపోయినా అపర్ణ వియ్యపురాలితో కలిసి పని చేయడం చూసి అందరూ సంతోషిస్తారు. అబ్బాయి, అమ్మాయిని పిలవమని పంతులు చెప్పేసరికి ధాన్యలక్ష్మి పిలిచేందుకు వెళ్తుంది కానీ గుడి మొత్తం వెతికినా కూడా వాళ్ళు కనిపించరు.
Also Read: తొందరపడిపోతున్న యష్- రెండు రోజుల్లో చిత్రని తనవైపుకి తిప్పుకుంటానన్న అభి
రిసార్ట్ లో రాహుల్ ని ముగ్గులోకి దించేందుకు స్వప్న బాగానే ట్రైల్స్ వేస్తుంది. ఇప్పుడు దీని అందం చూసి ఎగ్జైట్ అయితే నీ గొంతు నువ్వే కోసుకున్నట్టని రాహుల్ మనసులో అనుకుని ఎందుకు పిలిచావని అడుగుతాడు. అందంగా రెడీ అయ్యి వస్తే ఎందుకు పిలిచావని అంటావా అని స్వప్న చిందులు తొక్కుతుంది. తనని బుట్టలో వేసుకునేందుకు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావాని మెచ్చుకునేసరికి బుంగ మూతి పెడుతుంది. గుడిలో అందరూ రాజ్ వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు. రిసార్ట్ లో రసికుడు స్వప్నని బుట్టలో వేస్తాడు. ఇంతకీ మన పెళ్లి ఏర్పాట్లు ఎంత వరకు వచ్చాయని అడుగుతుంది. అమ్మో మళ్ళీ పెళ్లి టాపిక్ తీసుకొచ్చిందని ఏదో ఒకటి ప్లాన్ చేసి డైవర్ట్ చేయాలని ముగ్గులోకి దించుతాడు. ధాన్యలక్ష్మి వచ్చి పిల్లలు లేరని చెప్పేసరికి అపర్ణ కంగారుపడుతుంది. పూజ మధ్యలో వదిలేసి వీళ్ళు ఎక్కడికి వెళ్లారని అప్పు ఆలోచిస్తుంది. ఏం జరుగుతుంది పెళ్ళిలో స్వప్న పెళ్ళిలో వెళ్లిపోయినట్టు కావ్య పూజలో వెళ్ళింది ఇక నయం భర్తతో వెళ్ళింది కాబట్టి సరిపోయింది లేదంటే దుగ్గిరాల అపర్ణ అగ్గిమీద గుగ్గిలం అయ్యేదని కనకం మనసులో అనుకుంటుంది.
రాజ్ వాళ్ళు అప్పు వాళ్ళు చెప్పిన రిసార్ట్ కి వస్తారు. కావ్య వాళ్ళని రాహుల్, స్వప్న చూసేస్తారు. వెంటనే ఇక్కడ నుంచి పారిపొమ్మని చెప్తాడు. స్వప్న పారిపోయే టైమ్ కి రాజ్ రాహుల్, స్వప్నని చూసేస్తాడు. కావ్య పట్టుకోబోతుంటే వదిలించుకుని పారిపోతుంది. రాజ్ షాక్ లో ఉండిపోతాడు. జరిగిన దాంట్లో కావ్య అక్క తప్పు లేదని తెలిసిపోయి ఉంటుందని అప్పు వాళ్ళు అనుకుంటారు. కానీ స్వప్న పారిపోవడం కళ్యాణ్ చూసేస్తాడు. ఈ నిజం మీకు డైజెస్ట్ కావడం లేదా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురు కాలేదా? ఇప్పటి వరకు మీరు నన్ను నమ్మలేదు కానీ ఇదే నిజం. మా అక్క వెనుక ఉన్నది మీ ఇంట్లో మనిషే అని ఇప్పటికైనా అర్థం చేసుకోండి నా తప్పు లేదని అర్థం చేసుకోండి. ఈ నిజం నాకు ఎప్పుడో తెలుసు కానీ మీకు చెప్పాలంటే సాక్ష్యం కావాలి అందుకే ఇప్పటి వరకు ఆగాను. మా అక్కని నమ్మించి మాయ మాటలు చెప్పి పెళ్లి నుంచి లేవదీసుకుపోయి ఇంటికి తిరిగి వచ్చాడు. మా అక్క వెనుక ఉంది ఈ రాహుల్ అని కావ్య చెప్తుంది.
Also Read: చిత్ర, వసంత్ పెళ్లి ముహూర్తం ఫిక్స్- మాళవిక పెళ్లికి అందరినీ ఒప్పించిన వేద
ఏదైతే అది జరిగిపోయింది నిజం చెప్పాల్సింది ఎందుకు పారిపోయి వచ్చానని స్వప్న మనసులో అనుకుంటుంది. అక్కడ నుంచి వచ్చేసి చాలా పెద్ద తప్పు చేశాను, పూజ నుంచి రాజ్ వాళ్ళు ఎలా వచ్చారు అసలు ఏం జరుగుతుందని ఆలోచిస్తుంది.