యష్ కోపంగా ఉంటే వేద వస్తుంది. శుభమా పెళ్లి ముహూర్తం పెట్టుకుంటే వాళ్ళ పెళ్లి గొడవ మనకి ఎందుకని అంటాడు. ఇంకొక ఐదు రోజులు ఓపిక పడితే పెళ్లి అయిపోతుంది కదా. ఈ పెళ్లి జరిగితే చిత్ర, వసంత్ హ్యపీగా ఉంటారు అది మాత్రమే ఆలోచించండి ఇంకేం ఆలోచించొద్దు అని చూపులతో యష్ ని మాయ చేసేస్తుంది. పనిలో పనిగా మనకి ఒక ముహూర్తం పెట్టించి ఉంటే బాగుండేది కదాని యష్ సిగ్గు పడిపోతాడు. అబ్బో సిగ్గే ఏం ముహూర్తమో చెప్పండి అంటుంది. ఇంకేం ముహూర్తం మిగిలింది మనకి శోభనం ముహూర్తమని యష్ అనేసరికి వేద సిగ్గు మొగ్గలు వేస్తుంది. మాళవిక హ్యపీగా వచ్చి అభిని కౌగలించుకుంటుంది. పెళ్లికి ముహూర్తం కుదురిందని ఒప్పుకున్నారని చెప్తుంది. వసంత్, చిత్ర మన పెళ్లి ఒకేసారి జరుగుతుంది. ముహూర్తం పెట్టించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.


Also Read: సూపర్ ట్విస్ట్, రాజ్‌కు దొరికిపోయిన స్వప్న, రాహుల్ - కావ్యని భార్యగా అంగీకరిస్తాడా?


జరిగేది ఒక పెళ్లి మాత్రమే అది నాకు చిత్రకి మాత్రమేనని అభి మనసులో అనుకుంటాడు. పెళ్లికి చాలా తక్కువ టైమ్ ఉంది ఆదిత్యని తీసుకురావాలని మాళవిక సంతోషంగా మాట్లాడుతుంది. ఎప్పుడు పెళ్లి అని చెప్పినా ఏదో ఒకటి చెప్పి తప్పించుకునే వాడివి ఇప్పుడు పెళ్లికి రెడీ అయినందుకు చాలా సంతోషంగా ఉందని మాళవిక సంబరపడుతుంది. శశిధర్ పెళ్లికి పిలవాల్సిన వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే యశోధర్ వస్తాడు. ఒక ప్రాబ్లం వచ్చింది అయితే నాది కాదు మా ఫ్రెండ్ ది. వాడు, వాడి భార్య చాలా మంచి వాళ్ళు. ఇద్దరి మధ్య ప్రేమ ఉంది కానీ ఇద్దరూ ఒక్కటి అవలేకపోతున్నారు. అవ్వాలి అనుకున్నప్పుడే ఏదో ఒక ప్రాబ్లం వస్తుందని యష్ చెప్పేసరికి సేమ్ మీలానే అని శశిధర్ అనేస్తాడు. పెళ్లి అంటే శోభనం ఇద్దరూ ఒకటి అవాలి. ఈ విషయంలో లేడీస్ తొందర పడాలి. సో మీరే ముందడుగు వేయాలి. ఆవిడ మనసులో అతడి ఉద్దేశం అర్థం అయ్యేలా అని చెవిలో ఏదో గుసగుసగా చెప్తాడు.


Also Read: చిత్ర, వసంత్ పెళ్లి ముహూర్తం ఫిక్స్- మాళవిక పెళ్లికి అందరినీ ఒప్పించిన వేద


ఖైలాష్ అభి దగ్గరకి వచ్చి పెళ్లి ఫిక్స్ అయ్యిందట కదా కంగ్రాట్స్ అంటాడు. అదంతా ఒక ప్లాన్ అని అభి చెప్తాడు. నేను మాళవికని పెళ్లి చేసుకుంటే చిత్రతో ఎలా పెళ్లి జరుగుతుంది. మాళవికతో నా పెళ్లి, చిత్ర వాళ్ళతో ఒకేలా జరిగేలా చేశాను. వాళ్ళు రెండు పెళ్ళిళ్ళకి ఒప్పుకుని ఒకే ముహూర్తం పెట్టారు. కానీ అక్కడ జరిగేది ఒకటే పెళ్లి అదే ముహూర్తంలో నేను చిత్రని పెళ్లి చేసుకోబోతున్నానని అభి అనేసరికి ఖైలాష్ షాక్ అవుతాడు. రెండు రోజుల్లో చిత్ర నా కాళ్ళు పట్టుకుని నా జీవితాన్ని నిలబెట్టమని అడుక్కునే దాకా తీసుకొస్తానని చెప్తాడు. మరి మాళవిక పరిస్థితి ఏంటని అడుగుతాడు. అది అయిపోయిన చాప్టర్ అది ఏమైపోతే నాకు ఎందుకు ఇప్పుడు నా ఫోకస్ అంతా చిత్ర మీదే అంటుండగా మాళవిక వచ్చి అభి అంటుంది. వినేసిందని కంగారుపడతాడు. కానీ తను ఏమి వినదు. వేదతో శోభనం చేసుకునేందుకు యష్ తెగ తిప్పలు పడిపోతాడు.