మే 10 రాశిఫలాలు


మేష రాశి


ఈ రాశి వారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి.నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. వ్యాపారులకు రోజు ప్రారంభం నిదానంగా ఉంటుంది కానీ ఆ తర్వాత డబ్బు సంపాదిస్తారు. ప్రజా సంక్షేమ కార్యకలాపాల ద్వారా రాజకీయనాయకులు మంచి పేరు సంపాదించుకుంటారు. 


వృషభ రాశి


వృషభ రాశి వారు వ్యాపారంలో భాగస్వాములపై ​​విశ్వాసం ఉంచుకోవాలి. మీరు ద్రవ్య ప్రయోజనాలను పొందవచ్చు కానీ ఖర్చులు నియంత్రించాలి. మీ పనిపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది..భారం తగ్గుతుంది. వ్యాపారులకు కూడా మంచి సమయమే.


మిథున రాశి


మిథున రాశి వారికి ఈరోజు మంచి రోజు అవుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల నిర్వహణపై చర్చిస్తారు. మీరు మీ లక్ష్యం పట్ల అంకితభావంతో కనిపిస్తారు. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అందరితో కలిసి పనిచేయడం వల్ల మంచి లాభాలు పొందుతారు.
 


Also Read: వాస్తుశాస్త్రం ప్రకారం ఏ దిశలో ఏది ఉంటే బాగుంటుందో తెలుసా!


కర్కాటక రాశి


కర్కాటక రాశి వారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి..తెలియని కొందరు వ్యక్తులు మీపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. అడగకుండా సలహా ఇవ్వడం మానుకోండి. మీ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనిని ఈరోజు పూర్తి చేయగలుగుతారు. మీ ప్రవర్తనలో మాధుర్యాన్ని ఉంచండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు.


సింహ రాశి


సింహ రాశి వారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని పాత జ్ఞాపకాల గురించి మాట్లాడతారు. పెద్ద నిర్ణయాలు తీసుకోకవద్దు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఓపికగా ఉండాలి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.


కన్యా రాశి


కన్యా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రావొచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు పూర్తి అవగాహనతో వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యాపారం చేసే వ్యక్తులు బలంగా ప్రయత్నిస్తే పనులు పూర్తవుతాయి. ఆస్తికి సంబంధించిన ఏదైనా విషయంలో కూడా విజయం పొందవచ్చు. మీరు కొత్త వాహనం కొనుగోలు చేస్తారు.


తులా రాశి


తులా రాశి వారికి ఈ రోజు మంచి రోజు. స్వల్ప దూర పర్యటనకు వెళ్ళే అవకాశం లభిస్తుంది. వ్యాపారం చేసే వ్యక్తులు సమస్యలను ఎదుర్కొంటారు. పనిలో చొరవ తీసుకోవడం అలవాటుగా మారవడం వల్ల అదే మీకు ఇబ్బంది అవుతుంది. పెద్దల ఆశీర్వాదంతో మీ ఆగిపోయిన పనులు పూర్తి కాగలవు.


వృశ్చిక రాశి 


వృశ్చిక రాశి వారు శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటికి అతిథి వస్తారు. రోజంతా సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు లేదంటే సమస్య తప్పదు. ముఖ్యమైన వస్తువు పోయినట్లయితే ఈరోజే దాన్ని తిరిగి పొందుతారు.


Also Read: గోడ గడియారం ఈ దిశగా ఉంటే నాశనమే, వాస్తు ప్రకారం ఎక్కడ ఉండాలి!


ధనుస్సు రాశి


ధనుస్సు రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. వ్యాపారంలో దీర్ఘకాలిక ప్రణాళికలతో, మీరు మంచి లాభాలను పొందగలుగుతారు. మీ ప్రయత్నాలు కొన్ని ఫలిస్తాయి. ఉద్యోగులకు పనిపై శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపారం బాగానే సాగుతుంది. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలపై చర్చిస్తారు.


మకర రాశి


మకర రాశి వారికి ఈ రోజు కష్టతరంగా ఉంటుంది.పెరుగుతున్న ఖర్చులు మీకు సమస్యలను కలిగిస్తాయి. ఈ రోజు మీరు ఏదైనా చట్టపరమైన విషయంలో ఓపికగా ఉండాలి. ప్రణాళిక ప్రకారం పనులు చేసుకోవడం మంచిది. విదేశాల నుంచి వ్యాపారం చేసే వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.  ఖర్చులు పెరగడం వల్ల మీరు సమస్యలను ఎదుర్కొంటారు.


కుంభ రాశి


కుంభ రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితం ఉంటుంది. ఎలాంటి ప్రమాదకర పనులు చేయకండి..అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు.  అందరి నమ్మకాన్ని గెలుచుకోగలుగుతారు. వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి..లేదంటే నష్టపోతారు. ఈ రోజు మీరు కార్యాలయంలో అందరి నమ్మకాన్ని పొందేందుకు ప్రయత్నించాలి.


మీన రాశి


మీన రాశి వారికి ఈరోజు సంతోషకరమైన రోజు. మీరు మీ లక్ష్యం దిశగా అడుగేయడం చాలా అవసరం. ఈరోజు మీరు ఆస్తికి సంబంధించిన విషయాలలో ఉపశమనం పొందుతారు. మాట్లాడేటప్పుడు మాటలోని మాధుర్యంపై పూర్తి శ్రద్ధ పెట్టండి. కార్యాలయంలో కొన్ని వివాదాలు ఉంటాయి.